వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఏం జరుగుతోంది? అమ్మాయిల కాళ్లవెంట నెత్తురు కారుతున్నా..

|
Google Oneindia TeluguNews

ఆమె డిగ్రీ ఫైనలియర్ విద్యార్థిని.. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో చదువుతోంది.. కాలేజీకి చివరి రోజు కావడంతో క్లాస్‌మేట్స్‌తో కలిసి ఫేర్‌వెల్ పార్టీకి వెళ్లింది.. కార్యక్రమం అయిపోయిన తర్వాత ఓ స్నేహితుడితో కలిసి ఇంటికి బయలుదేరింది.. దారి మధ్యలో పొలాల దగ్గర ఆగి మాట్లాడుకుంటుండగా.. నలుగురు వ్యక్తులు వాళ్లను చుట్టుముట్టారు.. అందులో ముగ్గురు అమ్మాయిని బంధించగా... నాలుగోవాడు.. యువతి స్నేహితుణ్ని లాక్కెళ్లి వేరేచోట నిర్బంధించాడు. మొత్తం నలుగురూ కలిసి ఆ అమ్మాయిని దారుణంగా రేప్ చేశారు.. ఈలోపే..

వాట్సాప్‌లో వైరల్..

వాట్సాప్‌లో వైరల్..

నిర్బంధం నుంచి తప్పించుకున్న యువతి స్నేహితుడు.. తన క్లాస్ మేట్స్ ను పోగేసుకుని ఘటనా స్థలికి వచ్చాడు.. రక్తస్త్రావం కారణంగా స్పృహతప్పి పడిపోయిఉన్న ఆమెను స్నేహితులు కాపాడారు. జరిగిన విషయం బయటికి తెలిస్తే పరువుపోతుందని ఆమె విన్నవించడంతో ఎవరు కూడా పోలీసులకు చెప్పలేదు. కానీ ఈ ఘటనపై వాట్సప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు.. ఓ రాజకీయ నేతద్వారా సెటిల్మెంట్ కు విఫలయత్నం చేశారనీ వాట్సప్ గ్రూపుల్లో షేరైంది. రేప్ ఘటనకు సంబంధించిన సమాచారం వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పడంతో చివరికామె ఫిర్యాదు చేసింది. కొద్దిగంటల్లోనే..

నలుగురు కీచకులు..

నలుగురు కీచకులు..

మండపేట డిగ్రీ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించి పోలీసులు.. మండపేటకు చెందిన వల్లూరి రామకృష్ణ(55), సుంకర సత్యనారాయణ(వెంకన్న), చేమంతి మధు, ములకల వీరబాబు(చిన్న)ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. బాధిత యువతికి న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు దిగాయి. ఏపీలో చరిత్రాత్మక దిశ చట్టం అమల్లోకి వచ్చిన రెండున్నర నెలల వ్యవధిలోనే ఏడు సంచలనాత్మక గ్యాంగ్ రేప్ ఘటనలు జరిగాయి. చిన్నారులు, యువతులు, మహిళలకు సంబంధించి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందో వివరాలిలా ఉన్నాయి..

 ఏపీనే టాప్..

ఏపీనే టాప్..

ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది ఎంతో కొంత ప్రశాంతంగా ఉంటుందనుకుంటాం. కానీ మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాల విషయంలో సౌతిండియాలోనే టాప్ ప్లేస్ లో నిలుస్తుంది ఆంధ్రప్రదేశ్. జగన్ సర్కారు అమల్లోకి తెచ్చిన చరిత్రాత్మక దిశ చట్టం తర్వాతైనా ఏపీ దశ మారలేదంటే పరిస్థితి ఎంత కరడుగట్టిపోయిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి గతేడాది ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే అది మావోయిస్టుల హింస, దొంగతనాలు, హత్యలకు సంబంధించినంత వరకేతప్ప మహిళలపై నేరాలు తగ్గలేదనడానికి కావాల్సినన్ని రుజువులు రోజు బయటపడుతూనే ఉన్నాయి. ఆడవాళ్ల కోసం ఆవురావురుమంటూ వెతికే మృగాళ్లు.. అనుకూలతలు చూసుకుని ఒక్కసారే గుంపులుగా విరుచుకుపడతారు.. బాధితురాళ్లను బలవంతంగా బంధించి.. కాళ్లవెంట నెత్తురు కారుతున్నా వదిలిపెట్టకుండా గ్యాంగ్ రేప్ కు పాల్పడతారు.

 దిశ తర్వాత ఏం జరిగిందంటే..

దిశ తర్వాత ఏం జరిగిందంటే..

చిన్నారులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వాళ్లకు కఠినంగా శిక్షలు పడాలన్న ఉద్దేశంతో ఏపీ అసెంబ్లీ డిసెంబర్ 23న చరిత్రాత్మక దిశ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. చట్టం అమల్లోకి వచ్చిన వారం రోజులకే డిసెంబర్ 30న చిత్తూరు జిల్లా మందనపల్లి మండలం పిట్టవాండ్లపల్లె అటవీ ప్రాంతంలో 23 ఏళ్ల వివాహితపై ముగ్గురి గ్యాంగ్ రేప్ చేశారు. జనవరి 5న నెల్లూరు జిల్లా చవటపాలెంలో మతిస్థిమితం లేని 30 ఏళ్ల మహిళలపై ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. జనవరి 27న శ్రీకాకుళం జిల్లా ధర్మపురంలో 16 ఏళ్ల ఇంటర్ ఫస్టియర్ విద్యార్థినిపై సీనియర్ విద్యార్థి, అతని స్నేహితులు కలిసి అఘాయిత్యానికి ఒడిగట్టారు.

గత నెలలలో ఇంకా దారుణం..

గత నెలలలో ఇంకా దారుణం..

ఫిబ్రవరి 11న గుంటూరు జిల్లా మంగళగిరి మండలపరిధిలోని నవులూరులో జ్యోతి అనే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నలుగురులు యువకులు.. త్వారత ఆమెను గొంతునులిమి చంపేశారు. ఫిబ్రవరి 15న గుంటూరు జిల్లా చినకాకానికి చెందిన ముగ్గురు యువకులు ఓ వివాహితను గ్యాంగ్ రేప్ చేశారు. ఫిబ్రవరి 21న చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలానికి చెందిన ఓ పదో తరగతి బాలికను ముగ్గురు యువకులు బలవంతంగా ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Recommended Video

AP CM YS Jagan On Disha Call Center And Disha Application At Rajahmundry | Oneindia Telugu
అరకు ఉత్సవాలకు తీసుకెళతామని..

అరకు ఉత్సవాలకు తీసుకెళతామని..

ఏపీకి కాబోయే రాజధాని విశాఖపట్నంలో రాజకీయ కార్యకలాపాలు పెరిగిన తర్వాత కూడా శాంతిభద్రతల పరిస్థితి మారలేదు. మార్చి 4న విశాఖపట్నం జిల్లా అరకులోయలో బొండాం పంచాయతీ రంపుడువలస గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజన బాలికలను ‘అరకు ఉత్సవాలు‘కు తీసుకెళ్తామని నమ్మించి ఐదుగురు యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.

English summary
four arrested for gangraping a dalith student in mandapeta of east godavari district. this is the seventh brutal insident in andhrapradesh after passing the disha act
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X