హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాదయాత్ర: క్లైమాక్స్ చూపిస్తామన్న దానం, పిట్టబెదిరింపులన్న శ్రీధర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సినిమా చూపిస్తామన్న తెలంగాణ మంత్రి కెటి రామారావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు, మాజీ మంత్రులు దానం నాగేందర్, శ్రీధర్ బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ.. కెటిఆర్ చూపిస్తే.. తాము క్లైమాక్స్ చూపిస్తామని అన్నారు. తప్పుడు కేసులు పెట్టి భయపెట్టలేరని అన్నారు.

తాము అధికారం వచ్చాక తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ ఎవరి సొత్తు కాదని అన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు సహించమని చెప్పిన దానం.. లేకుంటే సునామీల వస్తామని హెచ్చరించారు. ఆ సునామీలో టిఆర్ఎస్ కొట్టుకుపోతుందని అన్నారు. మోకాళ్లపై టిఆర్ఎస్ నేతలు నడిచినా ఓట్లు రాలవని శ్రీధర్ బాబు అన్నారు. పిట్టబెదిరింపులకు లొంగమని కెటిఆర్‌ను ఉద్దేశించి అన్నారు.

తమ పాదయాత్ర ట్రైలర్ మాత్రమేనని.. సినిమా ఇంకా చూపించాల్సి ఉందని అన్నారు. ఆదివారం తెలంగాణ అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. ప్రభుత్వం మొండితనం వీడకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సచివాలయం, చెస్ట్ ఆస్పత్రి తరలింపుపై ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు ఉద్యమం కొనసాగిస్తామని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు.

కాంగ్రెస్ నేతల ధర్నా

కాంగ్రెస్ నేతల ధర్నా

సినిమా చూపిస్తామన్న తెలంగాణ మంత్రి కెటి రామారావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు, మాజీ మంత్రులు దానం నాగేందర్, శ్రీధర్ బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ నేతల ధర్నా

కాంగ్రెస్ నేతల ధర్నా

శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ.. కెటిఆర్ చూపిస్తే.. తాము క్లైమాక్స్ చూపిస్తామని అన్నారు. తప్పుడు కేసులు పెట్టి భయపెట్టలేరని అన్నారు.

పాదయాత్ర

పాదయాత్ర

తాము అధికారం వచ్చాక తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ ఎవరి సొత్తు కాదని అన్నారు.

పాదయాత్ర

పాదయాత్ర


ప్రజా వ్యతిరేక నిర్ణయాలు సహించమని చెప్పిన దానం.. లేకుంటే సునామీల వస్తామని హెచ్చరించారు.

పాదయాత్ర

పాదయాత్ర

ఆ సునామీలో టిఆర్ఎస్ కొట్టుకుపోతుందని అన్నారు. మోకాళ్లపై టిఆర్ఎస్ నేతలు నడిచినా ఓట్లు రాలవని శ్రీధర్ బాబు అన్నారు. పిట్టబెదిరింపులకు లొంగమని కెటిఆర్‌ను ఉద్దేశించి అన్నారు.

పాదయాత్ర

పాదయాత్ర

తమ పాదయాత్ర ట్రైలర్ మాత్రమేనని.. సినిమా ఇంకా చూపించాల్సి ఉందని అన్నారు.

పాదయాత్ర

పాదయాత్ర

ఆదివారం తెలంగాణ అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. ప్రభుత్వం మొండితనం వీడకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

పాదయాత్ర

పాదయాత్ర

సచివాలయం, చెస్ట్ ఆస్పత్రి తరలింపుపై ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు ఉద్యమం కొనసాగిస్తామని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు.

పొన్నాలకు గాయం

పొన్నాలకు గాయం

ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, డి శ్రీనివాస్ అన్నారు.

ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, డి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి కాగానే అన్ని పార్టీలనూ కలుపుకొని వెళ్తామని చెప్పి కెసిఆర్.. ఇప్పుడు మాత్రం ఏకపక్షంగా వ్యవరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం, చెస్ట్ ఆస్పత్రి తరలింపును నిరసిస్తే.. తమను అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు.

శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రను అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో సహా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారు. కాగా, ఈ మొత్తం వ్యవహారాన్ని గవర్నర్ ముందు తీసుకెళ్తామని జానారెడ్డి చెప్పారు.

పాదయాత్రలో అరెస్ట్ చేసే సమయంలో జరిగిన తోపులాటలో పొన్నాల లక్ష్మయ్య భుజానికి గాయమైంది. దీంతో ఆయన కన్నీటి పర్యాంతమయ్యాడు. ఆయనను వెంటనే అంబులెన్స్‌లో నీమ్స్ ఆస్పత్రికి తరలించారు.

English summary
Former ministers and Congress leaders Danam Nagendera and Sridhar Babu on Friday fired at Telangana minister KT Rama Rao's comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X