వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో దండుపాళ్యం గ్యాంగ్ దారుణాలు .. ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు ,ఆధారాలు దొరక్కుండా ఆరు హత్యలు

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా తరహాలో నరహంతకులుగా మారి దోపిడీకి పాల్పడుతున్న ఓ గ్యాంగ్ ను పెనమలూరు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈనెల 12వ తేదీన పోరంకి సెంటర్ లో ఉన్న కరూర్ వైశ్యా బ్యాంక్ ఎటిఎం చోరీ కేసులో నిందితులుగా గుర్తించిన కొందరిని పట్టుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో వారు చేసిన అరాచకాలు వెలుగులోకి వచ్చాయి.
ఒంటరిగా ఉన్న వృద్ధులను టార్గెట్ చేసుకొని, పగలు కూరగాయలు విక్రయిస్తూ, రెక్కీ నిర్వహించి రాత్రులు గుట్టుచప్పుడు కాకుండా ఎవరికీ అనుమానం రాకుండా, ముఖం పై దుప్పటి కప్పి ఊపిరాడకుండా చేసి హత మారుస్తున్న అగంతకులు చేసిన నేరాలు పోలీసులను షాక్ కు గురి చేశాయి.

కొత్తగూడెంలో దారుణం: తాగిన మైకంలో తిట్టిన వ్యక్తి..కోపంతో చెవి, మర్మాంగం కోసేసి ఆపై..కొత్తగూడెంలో దారుణం: తాగిన మైకంలో తిట్టిన వ్యక్తి..కోపంతో చెవి, మర్మాంగం కోసేసి ఆపై..

ఏటీఎం చోరీ కేసులో దొరికిన నిందితుల షాకింగ్ దారుణాలు

ఏటీఎం చోరీ కేసులో దొరికిన నిందితుల షాకింగ్ దారుణాలు

గుట్టుచప్పుడు కాకుండా హత్యలు చేస్తున్న వీరు, ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లో ఉన్న నగలను, నగదును దోపిడీ చేస్తున్నట్టు పోలీసులు తేల్చారు. కరూర్ వైశ్యా బ్యాంక్ ఎటిఎం చోరీ కేసులో నిందితుడిని పట్టుకున్న పోలీసులు వారి ఫింగర్ ప్రింట్స్ , కంచికచర్ల లో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసు నిందితుల వేలిముద్రలతో సరిపోలడంతో వారిని విచారించారు పోలీసులు. ఇక పోలీసుల విచారణలో ఈ గ్యాంగ్ గుట్టురట్టయింది.

ఒంటరి మహిళలను , వృద్ధులను టార్గెట్ చేసుకున్న గ్యాంగ్

ఒంటరి మహిళలను , వృద్ధులను టార్గెట్ చేసుకున్న గ్యాంగ్

పెనమలూరు మండలం పోరంకి, తాడిగడప కు చెందిన వేల్పూరి ప్రభు కుమార్, సుంకర గోపి రాజు, వనమాల చక్రవర్తి అలియాస్ చక్రి, మొరం నాగ దుర్గారావు అలియాస్ చంటి, మద్ది ఫణీంద్ర కుమార్ లు ఒక గ్యాంగ్ గా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించడానికి ఒంటరిగా ఉన్న వృద్ధులను లక్ష్యంగా చేసుకొని నేరాలకు పాల్పడడం మొదలుపెట్టారు. కుటుంబ సభ్యులకు ఏ మాత్రం అనుమానం రాకుండా, కరోనా సమయం కాబట్టి కరోనా తో చనిపోయారేమో అన్న భావన కలిగేలా, కరోనా సమయంలో త్వరగా ఖననం చేస్తారు కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదని భావించారు.

హతమార్చి అనుమానం రాకుండా సహజ హత్యలుగా చిత్రీకరణ

హతమార్చి అనుమానం రాకుండా సహజ హత్యలుగా చిత్రీకరణ

హత్యలు చేసి సహజ మరణాలు చిత్రీకరించి, ఆధారాలు దొరక్కుండా ఎలా తప్పించుకోవాలి అన్నది సినిమాలను, సోషల్ మీడియాలో పలు వీడియోలను చూసి నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే వారు ఇప్పటి వరకు ఐదు కేసులలో ఆరుగురు వ్యక్తులను హతమార్చినట్టు , సుమారు 40 తులాల బంగారు ఆభరణాలు దోచుకున్నట్టు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు వెల్లడించారు. నిందితులు మొదటి హత్యను పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చేశారని, 2020 అక్టోబర్ నెలలో పోరంకి గ్రామంలోని విష్ణుపురి కాలనీ లో ఒంటరిగా నివాసముండే నళిని అనే మహిళను హత్య చేసి బంగారు ఆభరణాలు దోచుకున్నారని వెల్లడించారు.

 విజయవాడలో ఇప్పటివరకు 6 హత్యలు

విజయవాడలో ఇప్పటివరకు 6 హత్యలు


2020 నవంబర్ లో పోరంకి లోని సీతా మహాలక్ష్మి అనే వృద్ధురాలిని హతమార్చారని పేర్కొన్నారు. ఇక కృష్ణా జిల్లా కంచికచర్ల వృద్ధ దంపతులు నాగేశ్వర రావు, ప్రమీల రాణి లను హతమార్చి వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించారని తెలిపారు. 2021 జనవరిలో పెనమలూరు మండలం తాడిగడప కార్మిక నగర్ కట్ట వద్ద తాళ్ళూరు ధనలక్ష్మి అనే మహిళను హత్య చేశారని, మార్చి నెలలో కార్మిక నగర్ లో మల్లేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు అని, జూన్ లో పోరంకి గ్రామంలోని పోస్ట్ ఆఫీస్ సమీపంలో పాపమ్మ అనే వృద్ధురాలు నేను చేసిన ఆభరణాలు దొంగిలించారని వెల్లడించారు.

మంగళగిరి, తెనాలి లలోనూ రెక్కీ .. మరో 20 నేరాలకు స్కెచ్

మంగళగిరి, తెనాలి లలోనూ రెక్కీ .. మరో 20 నేరాలకు స్కెచ్


ఇక ఈ తరహా నేరాలను చెయ్యడానికి వారు విజయవాడ కంకిపాడు, పెనమలూరు, ఉయ్యూరు తదితర ప్రాంతాలలో, గుంటూరు జిల్లా తెనాలి, మంగళగిరిలో రెక్కీ నిర్వహించారని మరో 20 నేరాలకు ప్లాన్ చేశారని సీపీ వెల్లడించారు. ప్రజలు ఇలాంటి నేరగాళ్లు పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఒంటరి మహిళలు తమ ఇళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, డయల్ 100కు కాల్ చేసి ఏ విధమైన అనుమానం వచ్చిన ఫిర్యాదు చేయాలని వెల్లడించారు.

English summary
It is learned that the Penamaluru police have arrested a gang in the state of Andhra Pradesh who were turning into murderers in the style of the Dandupalyam gang. police arrested the gang in a ATM theft case and interrogated them . they agreed the 6 murders in vijayawada and theft gold and money from the old aged people and single women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X