వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యేడాదికి ఒకసారే స్వామివారి దర్శనం.. వీఐపి బ్రేక్ దర్శనాలు రద్దు..! టీటీడి బోర్డ్ కీలక నిర్ణయం..!!

|
Google Oneindia TeluguNews

తిరుపతి/హైదరాబాద్ : శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. అలాంటి వారందదరికి శ్రీవారి దర్శనం ప్రియం కానుంది. సంవత్సరంలో మూడు నాలుగు సార్లు స్వామివారిని దర్శించుకునే వారు ఇక తమ్మ పద్దతిని మార్చుకోవాలి. సంవత్సరంలో ఒకసాదరి మాత్రమే తిరుమల స్వామివారిని దర్శించుకోవాలని టీటీడి బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో త్వరలో వీఐపీలకు ఇస్తున్న ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలను రద్దు చేస్తామని టీటీడి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టంచేశారు.

సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీలు సైతం ఏడాదిలో ఒకసారే శ్రీవారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీటీడి పాలకమండలి సభ్యులను 10 రోజుల్లో సీఎం నియమిస్తారని వెల్లడించారు. అంతకుముందు తిరుపతిలో టీటీడి బర్డ్‌ ఆస్పత్రిని తుడా ఛైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్య సేవలు, సదుపాయాలపై ఆరా తీశారు.తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పెద్ద మొత్తంలో ప్రసాదం తయారీ కారణంగా నెయ్యి కూడా పెద్ద మొత్తంలోనే వాడుతుంటారు.

Darshan only once in a year.!VIP Break canceled! TTD Board key decision .. !!

దీంతో శ్రీవారిలో బూందీ పోటులో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో టీటీడీ బూందీ పోటు ఆధునికీకరణకు నడుం బిగించింది. ఇందులో భాగంగా టర్మో ప్యూయిడ్ ద్వారా నడిచే స్టౌవ్‌లను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. స్వామివారి దర్శనం తర్వాత భక్తులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది శ్రీవారి లడ్డూ ప్రసాదానికే. దీంతో శ్రీవారి లడ్డూ ప్రసాదం.. అత్యంత ప్రియంగా మారిపోయింది. రోజుకు లడ్డూ ప్రసాదాల విక్రయం 3 నుంచి 4 లక్షల వరకు ఉంటుంది.

అయితే ఆధునిక విధానాలతో పూర్తి స్థాయిలో అగ్ని ప్రమాదాలు అరికట్టేందుకు పోటులో టర్మో ప్యూయిడ్ ద్వారా నడిచే స్టౌవ్‌లను అధికారులు వ్యూహాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఈ స్టౌవ్‌ల ద్వారా మంటలు వెలుపలికి వచ్చే అవకాశం లేదు. వేడి కూడా బయటకు రాకపోవడంతో సిబ్బందికి కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉన్నట్లు టీటీడీ అధికారులు గుర్తించారు. ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇస్తే.. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో టర్మో ప్యూయిడ్ ద్వారా నడిచే స్టౌవ్‌లను ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది.

English summary
The TTD Board has decided to visit Thirumala Swamy only once a year. TTD Chairman YV Subba Reddy said that the L1, L2 and L3 Darshanams given to the VIPs will be canceled soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X