వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన్మోహన్‌ను విచారిస్తే...: మధుకోడా వాదనలను సమర్థించిన దాసరి

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో తనకు ఎలాంటి సంబంధంలేదని, మాజీ ప్రధాని మన్మోహన్‌కే సంబంధం ఉందని మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు అన్నారు. సోమవారం ఆయన బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.

మాజీ ప్రధాని సమక్షంలోనే బొగ్గు క్షేత్రాల కేటాయింపు జరిగిందని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని దాసరి నారాయణరావు సీబీఐ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. జిందాల్ గ్రూపునకు బొగ్గు క్షేత్రాల కేటాయింపులు మన్మోహన్ సింగ్ చేశారని, అంతా మన్మోహనే చూసుకున్నరని దాసరి నారాయణ రావు చెప్పారు. మధు కోడా వాదనలను ఆయన సమర్థించారు.

మన్మోహన్‌ను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన చెప్పారు. అంతా ప్రధానిగా మన్మోహన్ చూసుకున్నారని ఆయన చెప్పారు. జిందాల్ గ్రూపునకు బొగ్గు క్షేత్రాల కేటాయింపులు మన్మోహన్ సింగ్ చేశారని, అంతా మన్మోహనే చూసుకున్నరని దాసరి నారాయణ రావు చెప్పారు. మధు కోడా వాదనలను ఆయన సమర్థించారు. మన్మోహన్‌ను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన చెప్పారు. అంతా ప్రధానిగా మన్మోహన్ చూసుకున్నారని ఆయన చెప్పారు.

కేంద్ర మాజీ మంత్రి, తెలుగు సినీ దర్శకనిర్మాత దాసరి నారాయణ రావు ఢిల్లీలోని సిబిఐ కోర్టులో హాజరయ్యారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణం కేసులో ఆయన జూన్ 30వ తేదీ కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కుంభకోణంలో తన ప్రమేయం లేదని దాసరి అప్పట్లో చెప్పారు.

Dasari blames Manmohan on coal gate

తాను కేవలం సహాయ మంత్రిగా మాత్రమే ఉన్నానని, అప్పటి నిర్ణయాలన్నీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగే తీసుకున్నారని ఆయన చెప్పారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ బొగ్గు మంత్రిత్వ శాఖ ఇంచార్జీగా ఉన్నారని, అందువల్ల ఆయనే నిర్ణయాలు తీసుకున్నారని దాసరి చెప్పారు.

జార్ఖండ్‌లోని అమరుకొండ ముర్గా దుంగల్‌ బొగ్గు క్షేత్రాల కేటాయింపు కేసులో దాసరితో పాటు మొత్తం 14 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. జార్ఖండ్‌ మాజీ సీఎం మధుకోడా, పారిశ్రామిక వేత్త నవీన్‌ జిందాల్‌, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి ఎస్సీ గుప్తాల్‌పై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. దాసరి నారాయణరావుతో పాటు 14 మందికి కూడా సిబిఐ ప్రత్యేక కోర్టు ఇది వరకే బెయిల్ మంజూరు చేసింది.

English summary
Ex union minister Dasari Narayana Rao reiterated that he had no role in coal scam. He attended CBI court today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X