అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి నిర్మాణంలో బ్రిటన్ భాగస్వామ్యం: మోడీ, కామెరూన్‌ల సంయుక్త ప్రకటన

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి మరింత దన్ను లభించింది. ఇప్పటికే సింగపూర్, జపాన్ దేశాలు ఈ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా బ్రిటన్ సైతం అమరావతి నిర్మాణంలో భాగస్వామి కానుంది.

David Cameron and Narendra Modi

ఈ మేరకు మూడు రోజుల బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ మధ్య దీనిపై అంగీకారం కుదిరింది. గురువారం ఇరువురు ప్రధాన మంత్రులు అమరావతి నిర్మాణంపై సంయుక్త ప్రకటన చేశారు.

అమరావతితో పాటు మహారాష్ట్రలోని పుణే, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరాల అభివృద్ధికి భారత్, బ్రిటన్‌లు సంయుక్తంగా కృషి చేయనున్నట్లు ఇరువురు ప్రధానులు ప్రకటించారు. భారత ప్రభుత్వం చేపట్టిన పట్టణాభివృద్ధి లక్ష్యాలకు బ్రిటన్ సహకరిస్తుందని సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.

English summary
David Cameron and Narendra Modi support the Ap Capital Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X