విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పట్టపగలే బ్యాంకు ఎదుట రూ. 6లక్షలు చోరీ(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఇంటి పనుల కోసం బ్యాంకులో రుణం తీసుకున్నాడు ఓ వ్యక్తి. డబ్బు డ్రా చేసుకుని వస్తుండగా పట్టపగలే ఇద్దరు వ్యక్తులు ఆకస్మాత్తుగా ద్విచక్ర వాహనంపై వచ్చి బ్యాగును లాక్కెళ్లి పోయారు. తేరుకుని, వారి వాహనం వెంట పరుగులు తీసినా ఫలితం లేకపోయింది. ఈ సంఘటన సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మహారాణి పేటకు చెందిన బుల్లి ఉక్కుటూరు కామేశ్వరరావు (40) కేజీహెచ్ దిగువన గల లోటస్ మెరైన్ షిప్పింగ్ సంస్ధలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారు. దానిపై రూ. 14 లక్షల రుణం పొందారు.

శుక్రవారం తన ఇద్దరు స్నేహితలతో కలిసి రెండు ద్విచక్ర వాహనాలపై డబ్బులు డ్రా చేద్దామని 12.30 గంటల ప్రాంతంలో రామ్‌నగర్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు వెళ్లారు. డబ్బులను ల్యాప్ టాప్ బ్యాగులో పెట్టుకుని బ్యాంకు నుంచి బయటకు వస్తున్నారు. ఇంతలో ఆకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు నలుపు రంగు ద్విచక్ర వాహనంపై వచ్చి డబ్బున్న బ్యాగును లాక్కెళ్లిపోయారు.

 పట్టపగలే బ్యాంకు ఎదుట రూ. 6లక్షలు చోరీ

పట్టపగలే బ్యాంకు ఎదుట రూ. 6లక్షలు చోరీ

ఒక్క క్షణం బాధితుడుకి ఏం జరిగిందో అర్ధం కాలేదు. అక్కడున్న వారంతా దొంగ దొంగ అంటూ పెద్దగా కేకలు వేస్తూ దుండగుల వాహనం వెంట పరుగులు తీశారు.

 పట్టపగలే బ్యాంకు ఎదుట రూ. 6లక్షలు చోరీ

పట్టపగలే బ్యాంకు ఎదుట రూ. 6లక్షలు చోరీ

నిందితులు మాత్రం జగదాంబ కూడలి వైపు వేగంగా ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయారు. బాధితుడు స్ధానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 పట్టపగలే బ్యాంకు ఎదుట రూ. 6లక్షలు చోరీ

పట్టపగలే బ్యాంకు ఎదుట రూ. 6లక్షలు చోరీ

ఫిర్యాదు అందిన వెంటనే మహారాణి పేట సీఐ మల్లిఖార్జునరావుతో పాటు ఎస్ఐలు, కానిస్టేబుళ్లు రంగంలోకి దిగారు. ఘటనాస్ధలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుల ఆనవాళ్లు తీసుకున్నారు. వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్‌కు, నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్‌లకు సమాచారం అందించారు.

 పట్టపగలే బ్యాంకు ఎదుట రూ. 6లక్షలు చోరీ

పట్టపగలే బ్యాంకు ఎదుట రూ. 6లక్షలు చోరీ

నగరంలోని అన్ని ప్రముఖ కూడళ్లలోని నిందితులు వేసుకొచ్చిన ద్విచక్ర వాహనం లాంటివాటిని ఆపి తనిఖీలు చేపట్టారు. అలాగే బ్యాంకులోని సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

 పట్టపగలే బ్యాంకు ఎదుట రూ. 6లక్షలు చోరీ

పట్టపగలే బ్యాంకు ఎదుట రూ. 6లక్షలు చోరీ

ఏడాదిక్రితం ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోని జైల్ రోడ్డులో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ వద్ద చోరీ జరిగింది. పెందుర్తికి చెందిన ఓ వ్యక్తి రూ. 5లక్షలు డ్రా చేసుకుని వెళ్లుండగా ఇద్దరు వ్యక్తులు బ్యాగుని లాక్కెళ్లిపోయారు.

 పట్టపగలే బ్యాంకు ఎదుట రూ. 6లక్షలు చోరీ

పట్టపగలే బ్యాంకు ఎదుట రూ. 6లక్షలు చోరీ

అప్పుడు బ్యాంకు నాలుగు వైపులా అమర్చిన కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు అతి తక్కువ సమయంలో పట్టుకున్నారు.

English summary
Daylight Robbery Outside Visakhapatnam HDFC Bank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X