విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఓ తండ్రి కన్నీటి గాథ ఇది. ఇంటి నుంచి పారిపోయిన తన కుమారుడికి కన్న తండ్రే అంతిమ సంస్కారాలు చేయాల్సి వచ్చింది. అంతేకాదు నాలుగు రోజుల తర్వాత కొడుకు మృతదేహం లభ్యం కావడంతో ఆ తల్లిదండ్రులకు దుంఖం కట్టలు తెంచుకుంది. పున్నమి నరకం నుంచి తప్పిస్తాడనుకున్న కుమారుడికి తమ చేతులతో అంతిమ సంస్కారాలు చేయాల్సి వచ్చిందంటూ వారి కన్నీటి రోదనతో ఆ ప్రాంతం హోరెత్తింది.

ఇంటి నుంచి పారిపోయి వచ్చింది ఇందుకా... కొడుకా అంటూ తల్లిదండ్రులు, సోదరుడు విలపించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. అశ్రునయనాల మధ్య జనార్దన్ మృతదేహానికి శ్మశానవాటకిలోనే దహన సంస్కారాలు పూర్తి చేసి బాధతో స్వగ్రామం బయల్దేరారు.

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు

వివరాల్లోకి వెళితే.... గత నెల 29న అర్ధరాత్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ప్లై ఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా దంతేరుకు చెందిన నక్కా జనార్ధన్ మృతి చెందాడు.

 ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు

పరిహారం కోసం ఆశపడి నంది అప్పారావు అనే వ్యక్తి పోలీసులను మభ్యపెట్టి జనార్ధన్ శవాన్ని తీసుకుపోయి ఖననం చేశాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మృతదేహం ఇప్పించాలని పోలీసులను విజ్ఞప్తి చేశారు.

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు

ఈ మేరకు గురువారం డిప్యూటీ తహసీల్దార్ సుధాకర్, డాక్టర్ రమణమూర్తి, టూటౌన్ సీఐ శ్రీనివాసరావు దగ్గరుండి బంధువుల సమక్షంలో మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు

మృతదేహాన్ని పూడ్చి పెట్టి నాలుగు రోజులవడంతో పూర్తిగా పాడైపోయింది. దీంతో వారి సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు అక్కడే పూర్తి చేసి పుట్టుడు దుఃఖంతో స్వస్థలానికి పయణమయ్యారు.

 ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు

గత సోమవారం ఐదు అనాథ శవాలు రావడంతో రెండు మృతదేహాలు ఒక గొయ్యిలో, మిగిలిన మూడు మృతదేహాలు మరో గొయ్యిలో పాతిపెట్టారు.

 ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు

దీంతో జనార్థన్ మృతదేహం ఏ గొయ్యిలో ఉందో తెలియలేదు. ఓ గోయ్యి పరిశీలించినా అందులో జనార్థన్ మృతదేహం లేకపోవడంతో దానిని పూడ్చి వేశారు.

 ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు

రెండో గొయ్యి తవ్వగా మూడు మృతదేహాలు కనిపించాయి. జనార్ధన్ మృతదేహం పైనే ఉండటంతో వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

English summary
Dead body found for father's wish at visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X