హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్జీవీ: కరోనా వైరస్‌కు క్రాష్ కోర్స్ నేర్పిస్తాడట: చావు కూడా మేడిన్ చైనా అవుతుందనుకోలేదంటూ..!

|
Google Oneindia TeluguNews

అమరావతి: చైనాలో జన్మించిన ప్రాణాంతక కరోనా వైరస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా పాకిన ప్రస్తుత పరిస్థితుల్లో వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. మరోసారి తన ట్విట్టర్‌కు పని చెప్పారు. కరోనా వైరస్‌ను ఉద్దేశించిన ట్వీట్లు చేశారు. చివరికి చావు కూడా మేడిన్ చైనా అవుతుందని తాను ఏ మాత్రం ఊహించుకోలేకపోయానని అన్నారు. కరోనా వైరస్ గనక తన వద్దకు వస్తే.. క్రాష్ కోర్సును నేర్పించి పంపించేస్తానని కామెంట్స్ చేశారు.

నెంబర్ 7: ఇటలీ పర్యాటకుడి భార్యకు కరోనా వైరస్.. పెరుగుతోన్న వైరస్ కేసులు..నెంబర్ 7: ఇటలీ పర్యాటకుడి భార్యకు కరోనా వైరస్.. పెరుగుతోన్న వైరస్ కేసులు..

కరోనా వైరస్‌ను ఉద్దేశించిన ఆయన ట్వీట్లను సంధించారు. డియర్ వైరస్.. అని ఆ మహమ్మారిని ప్రేమగా సంబోధించారు. జనం ప్రాణాలను తీసినంత మాత్రాన వైరస్ బతికిపోతుందని అనుకోవడం దాని భ్రమ అని వ్యాఖ్యానించారు. ప్రజలతో పాటు తాన కూడా మరణిస్తాననే విషయాన్ని ఆ వైరస్ తెలుసుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. తాను చేసే హెచ్చరికల పట్ల నమ్మకం లేకపోతే.. వైరాలజీలో ఆ వైరస్‌కు క్రాష్ కోర్సు నేర్పిస్తానని అన్నారు.

Dear Virus, my request to u is to live and let live, tweets Director Ram Gopal Varma

అందుకే- అందర్నీ చంపి, తాను చనిపోవడం సరికాదని రామ్‌గోపాల్ వర్మ కరోనా వైరస్‌ను ఉద్దేశించిన కామెంట్స్ చేశారు. లైవ్ అండ్ లెట్ లైవ్..అని సూచించారు. తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సింది మాత్రం వైరస్సేనని ఛాయిస్ దానికే వదిలేశారాయన. అంతకుముందు- మరో కామెంట్ చేశారు. ఎన్నో వస్తువులు, పరికరాలను తాము మేడిన్ చైనా అని చెప్పుకొంటూ ఉంటామని, చివరికి తమ చావు కూడా మేడిన్ చైనా అవుతుందని తాను ఊహించలేదని అన్నారు.

English summary
Filmmaker Ram Gopal Varma has tweeted wrote I never thought death also made in China. On social media, Ram Gopal Varma, this tweet enough to share is going to be. He request to the virus that live and let live.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X