వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష కరెక్ట్ కాదు: మంచు లక్ష్మి సంచలనం

నిర్భయ దోషులకు సుప్రీంకోర్టు ఉరిశిక్షను ఖరారు చేయడంతో దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంటే.. సినీ నటి మంచు లక్ష్మి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నిర్భయ దోషులకు సుప్రీంకోర్టు ఉరిశిక్షను ఖరారు చేయడంతో దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంటే.. సినీ నటి మంచు లక్ష్మి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష కరెక్ట్ కాదంటూ ఆమె వ్యాఖ్యానించారు.

నిర్భయ కేసులో ఆ మైనర్ నిందితుడు ఇప్పుడు ఎక్కడ? ఏం చేస్తున్నాడంటే?నిర్భయ కేసులో ఆ మైనర్ నిందితుడు ఇప్పుడు ఎక్కడ? ఏం చేస్తున్నాడంటే?

వారూ మనుషులే

వారూ మనుషులే

అంతేగాక, నిర్భయ నిందితులు కూడా మనుషులే, తప్పును తెలుసుకుందుకు వారికి అవకాశమివ్వాలని మంచు లక్ష్మి అన్నారు. వారికి అమ్మాయిల విలువేంటో అర్థమయ్యేలా చెప్పాలని ఆమె అన్నారు.

రాజకీయాల్లోకి రాను

రాజకీయాల్లోకి రాను

స్త్రీ విలువను బాల్యం నుంచే తెలియజేయాలని అన్నారు. తాను రాజకీయాల్లోకి రానని, సమాజ సేవే ముఖ్యమని మంచు లక్ష్మి స్పష్టం చేశారు.

అత్యంత పాశవికంగా..

అత్యంత పాశవికంగా..

2012, డిసెంబర్ 16న దేశ రాజధానిలో కదులుతున్న బస్సులో అత్యంత పాశవికంగా ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, నిర్భయ శరీర భాగాలను తీవ్రంగా గాయపర్చారు. దీంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.

దేశం హర్షించింది

దేశం హర్షించింది

కాగా, కింది కోర్టు ఇచ్చిన తీర్పు సమర్థిస్తూ నిర్భయ కేసులో దోషులకు శుక్రవారం మరణశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు పట్ల దేశ యావత్తూ హర్షం వ్యక్తం చేసింది. నిర్భయ తల్లిదండ్రులు కూడా సుప్రీం తీర్పు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

English summary
Cine Actress Manchu Laxmi on Saturday said that death sentence is not correct for Nirbhaya case convicts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X