• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

sex workers:ఏపీలో సెక్స్ వర్కర్ల ఆకలి కేకలు, రేషన్ రాక, నగదు లేక పాట్లు, చిన్నారులతో కలిసి...

|

కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ పనులు ఆగిపోయాయి. ఆపత్కాలంలో రేషన్ కార్డు ఉన్నవారికి ఫరావలేదు.. మరి లేనివారి పరిస్థితి ఏంటీ..? వారు ఆకలి కేకలతో చనిపోవాల్సిందేనా..? ఆంధ్రప్రదేశ్‌లో కొందరు సెక్స్ వర్కర్ల జీవితం మరీ దుర్భరంగా మారింది. రెండునెలల నుంచి పనిలేకపోవడం.. మరోవైపు రేషన్ కార్డు లేకపోవడం వారి పట్ల శాపంగా మారింది. దీంతో తమకు ఆకలితో చావే శరణ్యమంటున్నారు. ఏపీలో వేలాదిమంది సెక్స్ వర్కర్ల జీవితం దుర్భరంగా మారింది.

 నాలుగేళ్ల కుమారుడితో..

నాలుగేళ్ల కుమారుడితో..

భానుప్రియ (25) (పేరు మార్చాం) ఏపీలో సెక్స్ వర్కర్‌గా ఉన్నారు. నాలుగేళ్ల కుమారుడితో కలిసి ఉంటోంది. అయితే లాక్ డౌన్ వల్ల పడుపువృత్తి నిలిచిపోయింది. విటులు లేకపోవడంతో ఆదాయమార్గాల దారి మూసుకుపోయింది. అంతకుముందు నెలకు రూ.5 వేలు సంపాదించేది. దీంతో ఇంటి అద్దె కట్టి.. సరుకులు తీసుకొని.. పిల్లాడితో ఉండేది. కానీ లాక్ డౌన్ వల్ల ఉపాధి లేదు.. దీంతోపాటు రేషన్ కార్డు కూడా ఆమెకు లేదు. ఆహార భద్రత కార్డు ఉంటే.. బియ్యం, నగదు వచ్చేది. కానీ అలా రాకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంది. మరోచోటకి వెళదమా అంటే వెళ్లలేని స్థితి.. దీంతో తన కుమారుడితో ఆకలి కేకలతో చావు తప్పదని నిట్టూరుస్తోంది.

 మూడోస్థానం

మూడోస్థానం

మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ తర్వాత సెక్స్ వర్కర్లు ఏపీలోనే ఎక్కువగా ఉన్నారు. లాక్‌డౌన్ వల్ల ఉపాధి లేనందున వారి కుటుంబాలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూసతున్నారు. తమకు రేషన్ కార్డు లేదని.. దాని కన్నా ముందు చావే ముందు వస్తోందని సెక్స్ వర్కర్లు నిట్టూరుస్తున్నారు. ఏపీలో సెక్స్ వర్కర్ల సమస్యలపై ఎన్జీవో సంస్థలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి. వారిని ఆదుకోవాలని ఈ మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ కూడా రాశారు.

అందని రేషన్..

అందని రేషన్..

గతనెల 29వ తేదీన ఏపీ ప్రభుత్వం విలేజ్ వాలంటీర్లతో పేదలకు కిలో కందిపప్పు, రూ.వెయ్యి నగదు అందజేశారు. అయితే ప్రకాశం జిల్లాలో గల చీరాలో ఉంటోన్న భానుప్రియ మాత్రం తనకు సరుకులు రాలేవని చెబుతోంది. వాస్తవానికి రేషన్ కార్డు ఉన్నవారికే ప్రభుత్వం సరుకులు అందజేస్తోంది. ప్రియకు రేషన్ కార్డు లేదు. దీనిని విముక్తి అనే స్వచ్చంద సంస్థ రెండునెలల క్రితం సీఎంకు లేఖ రాసింది. కానీ దానిపై ఇంతవరకు సీఎంవో స్పందించలేదు.

 50 శాతానికి పైగా..

50 శాతానికి పైగా..

ఏపీలో 50 శాతానికి పైగా సెక్స్ వర్కర్లకు రేషన్ కార్డులు/ జన్ ధన్ ఖాతాలు లేవు అని విముక్తి ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ తెలిపారు. తమ సంస్థ ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీతో కలిసి పనిచేస్తుందని ఆయన వివరించారు. రేషన్ కార్డుల కోసం సెక్స్ వర్కర్ల పేర్లను రిజిష్టర్ చేశామని పేర్కొన్నారు. వారికి నెల నెల సరుకులు అందితే బాగుంటుందనే ఉద్దేశంతో చేశామని.. కానీ ఇప్పటివరకు రేషన్ కార్డులు రాలేదని పేర్కొన్నారు.

మాత్రలు లేక..

మాత్రలు లేక..

ఏపీలో ఉన్న సెక్స్ వర్కర్లలో కొందరికీ హెచ్‌ఐవీ వైరస్ కూడా ఉంది. వారికి రేషన్ సంగతేమో కానీ.. హెచ్ఐవీ మందులు కూడా అందడం లేదు. వీరికి అందజేసే ఏఆర్టీ మాత్రలు లభించడం లేదు. వాస్తవానికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే ఆ మాత్రలు లభిస్తాయి. అయితే లాక్ డౌన్ వల్ల వాలంటీర్లు కేంద్రాలకు వెళ్లలేకపోయారు. దీంతో వారికి మాత్రలు ఇవ్వడంలో సమస్య ఏర్పడింది. అయితే కొందరికీ కొటా మాత్రలు అందిన... అందుకు తగిన ఆహారం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొందరికి రేషన్ అందకపోవడంతో సమస్య ఏర్పడింది.

 పిల్లలు కూడా...

పిల్లలు కూడా...

ఏపీలోని గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు. ఇందులో కొందరు తమ పిల్లలతో కలసి ఉంటున్నారని విముక్తి స్వచ్చంద సంస్థ తెలిపింది. గుంటూరులో గల వేశ్య గృహాలో 75 మంది చిన్నారులు సెక్స్ వర్కర్లతో కలిసి ఉంటున్నారని.. ఇందులో 22 మంది రెండేళ్లలోపు వారు ఉన్నారని పేర్కొన్నారు. వారి పాల కోసం నగదు లేక సెక్స్ వర్కర్లు ఇబ్బంది పడుతున్నారు. తమకు రేషన్ అందించాలని ఈ నెల 18వ తేదీన సీఎంకు లేఖ రాశామని.. ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూస్తున్నామని మరికొందరు సెక్స్ వర్కర్లు చెబుతున్నారు.

  COVID-19 : Coronavirus Didn't Even Leave Supreme Court,1 Test Positive,2 In Quarentine

  English summary
  AP government has been distributing free rations to be delivered to the doorsteps of all residents of AP. No such aid came to Bhanu Priya's doorstep in Chirala, Prakasam.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X