విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

12కు చేరిన విశాఖ గ్యాస్ లీక్ బాధితుల మరణాలు .. కెమికల్ ఎఫెక్ట్ తో బాధితుల అవస్థలు

|
Google Oneindia TeluguNews

ఒక పక్క దేశం అంతా కరోనా భయంతో ఉన్న వేళ ఊహించని విపత్తులా ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన సమీప గ్రామాల ప్రజల జీవితాల్లో విషం చిమ్మింది. ఎల్జీ పాలిమర్స్ నుండి వెలువడిన విషవాయువుల ధాటికి కొందరు అపస్మారక స్థితికి చేరుకోగా ఇప్పటికే 12 మంది ప్రాణాలు విడిచారు.భయంకర విషవాయువు సమీప గ్రామాల ప్రజల జీవితాల్లో ఊహించని విషాదాన్ని నింపుతుంది. ఒక్కసారిగా నిద్రలో ఉన్న వారిని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనకు కారణం ఏదైనా, నిర్లక్ష్యం ఎవరిదైనా సరే బాధితులు మాత్రం సమీప గ్రామాల ప్రజలే .

విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 12కు చేరిన మృతుల సంఖ్య

విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 12కు చేరిన మృతుల సంఖ్య

నిన్న ఉదయం జరిగిన దుర్ఘటనలో భయానక వాతావరణం , ఎక్కడి వారు అక్కడే పడిపోయిన దృశ్యాలు ఇంకా బాధితులకు కళ్లముందు కదలాడుతున్నాయి. ఆస్పత్రులకు చేర్చినా, చికిత్స అందిస్తున్నా వాళ్ళు అనుభవిస్తున్న నరకం అంతులేనిది. కెమికల్ ధాటికి రాత్రి అంతా నిద్ర లేకుండా హాహాకారాలు చేశారు బాధితులు . వందల సంఖ్యలో ఆస్పత్రి పాలు కాగా ఇప్పటికి 12 మంది చనిపోయారు.

ఆస్పత్రుల్లో నిద్ర లేక నరకం చూస్తున్న బాధితులు కేజీహెచ్ లో మూడువార్డుల్లో 193 మంది

ఆస్పత్రుల్లో నిద్ర లేక నరకం చూస్తున్న బాధితులు కేజీహెచ్ లో మూడువార్డుల్లో 193 మంది

చికిత్సపొందుతున్నారు. ఒళ్ళు , కళ్ళు మంటలు , కడుపు నొప్పి, ఒంటి మీద దద్దుర్లు , వాంతులు , తలనొప్పి వంటి సమస్యలతో నరకం చూస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 45 మంది చిన్నారులు ఉన్న పరిస్థితి . కెమికల్ గాఢత ఎఫెక్ట్‌తో రాత్రంతా నిద్రలేక నరకం చూసిన బాధితులు బ్రతికి బయటపడతామో లేదో అర్ధం కాని సందిగ్ధంలో పడ్డారు. ఇక ఇప్పటికే కొందరి పరిస్థితి విషమంగానే ఉండగా గ్యాస్‌లీక్ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఆర్.ఆర్. వెంకటాపురంలోని పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజ్ కంట్రోల్ చేసి సాధారణ వాతావరణం తీసుకురావటానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Recommended Video

Vizag Gas Leak: PM Modi Assures All Help To Andhra CM
 ఇంకా గ్రామాల్లో తగ్గని గ్యాస్ లీక్ ప్రభావం .. వందల సంఖ్యలో ఆస్పత్రుల్లో బాధితులు

ఇంకా గ్రామాల్లో తగ్గని గ్యాస్ లీక్ ప్రభావం .. వందల సంఖ్యలో ఆస్పత్రుల్లో బాధితులు

పుణె, గుజరాత్ నుండి వచ్చిన టీమ్ రాత్రి నుంచీ పరిస్థితిని పర్యవేక్షిస్తుంది . ప్రస్తుతానికి కెమికల్ గ్యాస్ లీకేజ్ లేదని , అయితే ఎల్జీ పాలిమర్స్ పరిసర గ్రామాల్లో కెమికల్ గ్యాస్ ప్రభావం ఇంకా కొనసాగుతుంది. ఈ క్రమంలో విషవాయువు ప్రభావం తగ్గేవరకూ గ్రామాల్లోకి రావొద్దంటున్నది సర్కార్ . వస్తే అనవసరంగా కెమికల్ ఎఫెక్ట్ కి గురి కావాల్సి వస్తుందని చెప్తున్నారు. అంతేకాదు ఆయా గ్రామాల్లో పొల్యూషన్ లేదని నిర్ధారించుకున్న తర్వాతే బాధితులను పంపిస్తామని స్పష్టం చేస్తున్నారు అధికారులు . ఇక ఒక్క కేజీహెచ్ లోనే కాదు బయట ఆస్పత్రుల్లో కూడా వందమందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారని తెలుస్తుంది.

English summary
The horrific , the scene where they fell, and the victims were shocked by yesterday's accident. The hell that the hospitals are getting and treating them is endless. Victims who had been not sleeping all night with the chemical effect. Hundreds were hospitalized and 12 have died so far.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X