వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఏపీ రాజధానిగా దొనకొండ బెస్ట్': జగన్‌పార్టీ నేత కూడా..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఇటీవల దొనకొండ పేరు కూడా వినిపిస్తోంది. దొనకొండ.. ప్రకాశం జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా దొనకొండ బాగుంటుందనే అభిప్రాయాలు ఇటీవల వ్యక్తమవుతున్నాయి. గుంటూరు - విజయవాడ, అమరావతి కేంద్రంగా.. ఇలా తదితర ప్రాంతాల పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా దొనకొండ పేరు వినిపిస్తోంది. శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన అనంతరం శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గుంటూరు - విజయవాడల మధ్య రాజధాని అంతగా అనుకూలం కాదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో దొనకొండ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

Debates gain ground for Donakonda as capital

రాజధాని సాధనా సమితి శనివారం.. దొనకొండను ఏపి రాజధాని చేయాలని డిమాండ్ చేసింది. ప్రపంచానికి ధాన్యాగారంగా ఉన్న ప్రాంతానికి నష్టం కలిగించకుండా భూములు వినియోగంలో లేని ప్రాంతాన్ని గుర్తించి ఏపీ రాజధానిగా ప్రకటించాలని రాజధాని సాధనా సమితి కోరింది.

13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యలో ఉన్న ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతం అందరికీ అందుబాటులో ఉంటుందని సమితి వ్యవస్థాపక అభిప్రాయపడ్డారు. శివరామకృష్ణన్ కమిటీ ప్రకాశం జిల్లాలో పర్యటించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ఈ ప్రదేశాన్ని ఎంపిక చేయాలని కమిటీని కోరనున్నట్లు తెలిపారు. కాగా, రెండు రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత ఒకరు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

English summary
The sleepy mandal headquarters of Donakonda in Prakasam district where the Britishers had set up an aerodrome for fueling fighter planes during the World War II for its strategic location is again in the limelight now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X