వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్కన్ క్రానికల్ చైర్మన్ అరెస్ట్‌పై కోర్టుకు భార్య, జైల్లో సదుపాయాల కోసం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దక్కన్ క్రానికల్ చైర్మన్ వెంకట్రామి రెడ్డి, అతని బంధువును బెంగళూరు సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతనిని అతని సోదరుడు రవి రెడ్డిని 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాని విచారణను కోర్టు 19వ తేదీకి వాయిదా వేసింది. అలాగే, వెంకట్రామి రెడ్డి, రవిరెడ్డి తమకు చంచల్ గూడ జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన విచారణను కోర్టు 18వ తేదీకి వాయిదా వేసింది.

తమ భర్త అరెస్టు అక్రమమని వెంకట్రామి రెడ్డి, రవిరెడ్డిల భార్యలు కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి అరెస్టు చేశారని, నోటీసులు ఇవ్వలేదని, వారి పరువుకు నష్టం కలిగించారని వారి తరఫు న్యాయవాది అన్నారు.

తాము పదిసార్లు నోటీసులు ఇచ్చాకే అరెస్టు చేశామని సీబీఐ చెప్పింది. కాగా, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని నిందితులకు కోర్టు తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని సిబీఐని ఆదేశించింది. అనంతరం వచ్చేవారినికి కేసు వాయిదా వేసింది.

 డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

హైదరాబాద్‌కు వచ్చిన బెంగళూరు సీబీఐ అధికారులు డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డిని శనివారం నాడు అరెస్టు చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జడ్జిల నివాస ప్రాంగణానికి తీసుకెళ్లి సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు.

 డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

ఉద్దేశపూర్వకంగా బ్యాంకులను మోసం చేసినందుకు వెంకట్రామి రెడ్డిపై ఐపీసీ 420, 120(బీ), 468, 471 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.

 డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

వెంకట్రామి రెడ్డితోపాటు ఆయన సోదరుడు వినాయక్ రవి రెడ్డి, డీసీహెచ్‌ఎల్‌ ముఖ్య అధికారి పీకే అయ్యర్‌ను కూడా సీబీఐ అరెస్టు చేసింది.

 డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

గతంలో వివిధ బ్యాంకుల్లో రూ.1230 కోట్ల మేర వెంకట్రామి రెడ్డి లోను తీసుకున్నారు. అయితే ఆయన అన్ని బ్యాంకుల్లోనూ ఒకే ఆస్తిని తనఖా పెట్టినట్లు కెనరా బ్యాంకు గుర్తించింది.

 డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

దీంతో వెంకట్రామిరెడ్డి తమను మోసగించారంటూ 2013లో సీబీఐకి ఫిర్యాదు చేసింది. వెంకట్రామి రెడ్డి అరెస్టు వ్యవహారంలో సీబీఐ అధికారులు గోప్యత పాటించారు.

 డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

కెనరా బ్యాంకు పెట్టిన కేసులో సీబీఐ అరెస్టు చేసిన వెంకట రామిరెడ్డి అప్పుల పర్వం 2005లో మొదలైంది. ఆ తరువాత 2009-11 మధ్యలో పలు వందల కోట్ల రూపాయల మేరకు వివిధ బ్యాంకుల నుంచి ఆయన సంస్థ డీసీహెచ్‌ఎల్‌ అప్పులు చేసింది.

English summary
Deccan Chronicle Chairman T Venkatram Reddy files petition in Court
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X