వికేంద్రీకరణతో రాష్ట్రాభివృద్ధి - 2023 జూన్ నాటికి పోలవరం పూర్తి : గవర్నర్ బిశ్వభూషణ్..!!
ఏపీ అభివృద్ధి పథంలో పయణిస్తోందని గవర్నర్ బిశ్వభూషణ్ చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభ వేళ..ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం సమయంలో నినాదాలతో హోరెత్తించిన టీడీపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. గవర్నర్ తన ప్రసంగంలో ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పధకాలైన నవరత్నాలతో పాటుగా వివిధ రంగాల అభివృద్ధి గురించి వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంశాన్ని ప్రస్తావించారు.

వికేంద్రీకృత పరిపాలన ఉండేలా
మూడేళ్లుగా వికేంద్రీకృత పరిపాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, వికేంద్రీకరణతో రాష్ట్రాభివృద్ధి జరుగుతోందన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 0.22 జీఎస్టీపీ వృద్ధి జరిగిందన్నారు. సుపరిపాలన లక్ష్యానికి అనుగుణంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తున్నామని, ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలనా వ్యవస్థ ప్రారంభమవుతుందన్నారు. తెలిపారు. కోవిడ్ వల్ల రెండేళ్ల నుంచి దేశం, రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయని, గత మూడేళ్లుగా వికేంద్రీకృత, సమ్మిళిత పాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులను మూలస్తంభాలుగా భావిస్తున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడిగా ఉందని.. అన్నారు. 2023 జూన్ నాటికి పోలవరం పూర్తి చేసేలా యుద్ధ ప్రాతిపదిక పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఉద్యోగులకు పీఆర్సీ .. నాడు -నేడు
వేగవంతమైన అభివృద్ధికి వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని గవర్నర్ విశ్వభూషణ్ తెలిపారు. భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం వద్ద 3 ఓడరేవుల అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఉద్యోగుల వయో పరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. 2020-2021 ఏడాదికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16.82 శాతం సమగ్ర వృద్ధి సాధించిందని అన్నారు. మన బడి నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జరుగుతోందని, తొలి దశలో రూ.3,669 కోట్లు ఖర్చు చేసి 17,715 పాఠశాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. 44.5 లక్షల మంది తల్లులకు అమ్మఒడి కింద రూ. 13,023 కోట్లు అందజేశామని వివరించారు. ఉద్యోగులకు ఒకేసారి 5 డీఏలు విడుదల చేశామని గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు.

రైతు భరోసా - పోలవరం పైనా
11వ పీఆర్సీ అమలు, రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచామన్నారు. తలసరి ఆదాయం 15.87 శాతం పెరిగి రూ.2,04,758కి చేరిందన్నారు. నవరత్నాలు ద్వారా మానవ, ఆర్థిక అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. నాడు-నేడు, ఆరోగ్యశ్రీ, బాలామృతం అమలు చేస్తున్నామని గవర్నర్ తెలిపారు. రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ. 13,500 చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్లు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. ఇప్పటివరకు 52.38 లక్షల మంది రైతులకు రూ. 20, 162 కోట్ల సాయం చేశామని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు పారదర్శంగా పనిచేస్తున్నాయని గవర్నర్ తెలిపారు. కోవిడ్ వల్ల రెండేళ్ల నుంచి దేశం, రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయని, గత మూడేళ్లుగా వికేంద్రీకృత, సమ్మిళిత పాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

16 మెడికల్ కాలేజీలు.. ఉచిత విద్యుత్
ప్రభుత్వానికి ఉద్యోగులను మూలస్తంభాలుగా భావిస్తున్నామని తెలిపారు. 9 గంటల ఉచిత విద్యుత్ పథకం కింద 18.55 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చినట్లు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. 2021-2022లో రూ.9,091 కోట్ల వ్యయంతో రైతులుకు ప్రయోజనం చేకూర్చామని పేర్కొన్నారు. కొత్తగా 16 మెడికల్ కాలేజీలు ప్రతిపాదించామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశామని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.