అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మండలి చైర్మన్ షరీఫ్ కామెంట్స్: వికేంద్రీకరణ బిల్లు ప్రాసెస్‌లో ఉంది, సెలక్ట్ కమిటీకి అందుకే..

|
Google Oneindia TeluguNews

వికేంద్రీకరణ బిల్లు పూర్తికాలేదని, ప్రాసెస్‌లో ఉన్నందునే సెలక్ట్ కమిటీకి పంపించానని మండలి చైర్మన్ షరీఫ్ స్పష్టంచేశారు. వికేంద్రీకరణ బిల్లులో చిన్న చిన్న లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని సవరించాలని తాను శాసనసభకు సూచించానని తెలిపారు. బిల్లులో తప్పులు ఉన్నందుకే సెలక్ట్ కమిటీకి సిఫారసు చేసినట్టు షరీఫ్ క్లారిటీ ఇచ్చారు.

ఆమోదం పొందాలంటే..

ఆమోదం పొందాలంటే..


వికేంద్రీకరణ బిల్లులో ఉన్న తప్పుల ప్రక్రియ పూర్తయితే తప్ప ఆమోదం పొందని పరిస్థితి నెలకొంది. అందుకోసమే తన విచక్షణాధికారం ఉపయోగించానని షరీఫ్ చెప్పారు. రూల్ 154 కింద సెలక్ట్ కమిటీకి పంపించాననిపేర్కొన్నారు. బిల్లులో ల్యూప్ హోల్స్ ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందని షరీఫ్ పేర్కొన్నారు. పొరపాట్లు జరిగాయని టీడీపీ సభ్యులు చెప్పడంతో తాను స్పందించానని పేర్కొన్నారు.

సరిదిద్దేందుకు...

సరిదిద్దేందుకు...

బిల్లులో తప్పుల గురించి ప్రతిపక్ష సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చారని షరీఫ్ గుర్తుచేశారు. బిల్లును పరిశీలించి.. సరిదిద్దే ప్రయత్నం చేశానని చెప్పారు. బిల్లు రూపొందించే సమయంలో ఓవర్ లుక్‌లో తప్పులు జరగడం సహజమని.. కానీ వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత చట్టసభల్లో ఉందని మండలి చైర్మన్ షరీఫ్ గుర్తుచేశారు.

సరికాదు..

సరికాదు..

వికేంద్రీకరణ బిల్లుపై అధికార, విపక్షాల వాదనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. తప్పులు ఉన్నాయని సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నామని మండలి చైర్మన్ చెప్పగా.. విపక్ష టీడీపీ సభ్యులు స్వాగతించారు. అయితే బిల్లును డివిజన్ పద్దతిలో ఓటింగ్ కూడా నిర్వహించలేదు, సభలో ప్రవేశపెట్టిన తర్వాత మండలి చైర్మన్ విచక్షణాధికారం పేరుతో సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్టు పేర్కొన్నారు.

తీర్మానం ఏదీ..?

తీర్మానం ఏదీ..?

దీనిని ఏపీ ప్రభుత్వం ఖండిస్తోంది. మండలికి వచ్చిన బిల్లుపై చర్చ జరగాలే తప్ప.. సెలక్ట్ కమిటీకి పంపించడం వీలుకాదని ప్రభుత్వం చెబుతోంది. ఒకవేళ సెలక్ట్ కమిటీకి పంపించాలన్న శాసనసభలో తీర్మానం చేయాలని గుర్తుచేస్తుంది. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.

English summary
Decentralization bill is under process mandali chairman shareef clarify.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X