• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

‘థాంక్యూ అమరావతి’: దీపికా ఏమన్నారంటే, రానా ఇలా(పిక్చర్స్)

|
  Social Media Summit Awards : Deepika Padukone received Award

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తనకు ఎంతో నచ్చిందని, ఇక్కడ చుట్టూ ఉన్న పచ్చదనం ఎంతో ఆకట్టుకుందని ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనె అన్నారు. విజయవాడలో ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 'సోషల్‌ మీడియా సమ్మిట్‌ 2017 అవార్డు' ప్రదానోత్సవానికి ఆమె హాజరయ్యారు.

  థాంక్యూ అమరావతి..

  థాంక్యూ అమరావతి..

  సామాజిక మాధ్యమంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటిగా దీపికకు అవార్డును రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అందజేశారు. ఈ సందర్భంగా నటి దీపికా మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సోషల్‌ మీడియా చాలా బలమైన మాధ్యమంగా మారింది. నాకు ఈ స్థాయి గుర్తింపు రావడానికి అభిమానులే కారణం. ఇక్కడా ఇంతమంది అభిమానులు ఉండటం ఆనందంగా ఉంది.. ‘థాంక్యూ అమరావతి'' అని దీపికా సంతోషం వ్యక్తం చేశారు.

   మళ్లీ వస్తా..

  మళ్లీ వస్తా..

  ‘నేను సోషల్‌ మీడియాలో ఏం చేసినా ఆలోచించే చేస్తాను. ఈ మాధ్యమాన్ని ఎలా వినియోగించుకోవాలో బాగా తెలుసు. ఉన్నంత వరకూ ఎక్కువ ప్రభావాన్ని చూపించగలుగుతాను. నా అభిమానులతో సోషల్‌ మీడియాలో పారదర్శకంగా ఉంటాను. నా సినిమాలు, పని, ఎక్కడికైనా వెళ్లినా అలాంటి సమాచారం మాత్రం ఎప్పటికప్పుడు తెలియజేస్తాను. నాకు, అభిమానులకు మధ్య ఓ స్పష్టమైన అవగాహన దీని ద్వారానే కుదిరింది. ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. అమరావతి ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని, మళ్లీ త్వరలోనే ఇక్కడికి వస్తాను...' అని దీపికా పదుకొనె‌ చెప్పారు.

   దీపికకు కష్టం లేకుండా చేస్తాం

  దీపికకు కష్టం లేకుండా చేస్తాం

  ఈ సందర్భంగా మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని తొలిసారి విజయవాడలో జరిపామని, భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈసారి నేరుగా ముంబై నుంచి విజయవాడకు మధ్యలో ఎక్కడా ఆగాల్సిన పనిలేకుండా చేరుకునేలా దీపికకు విమాన సౌకర్యం కల్పిస్తామంటూ ఆమె నవ్వుతూ తెలిపారు. కాగా, ముంబై నుంచి హైదరాబాద్‌ వచ్చిన దీపిక అక్కడ కొంత సమయం వేచి ఉండి అనంతరం విజయవాడ చేరుకున్నారు.

   రానా, అనిరుధ్‌లకు అవార్డులు

  రానా, అనిరుధ్‌లకు అవార్డులు

  సోషల్‌ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే సినీ నటుడు దగ్గుబాటి రానా, ‘కొలవెరి డి' పాటతో సంచలనం సృష్టించిన సంగీత దర్శకుడు అనిరుధ్‌, తెలుగులో ప్రముఖ హాస్యనటుడిగా గుర్తింపు పొందిన వైవా హర్ష ఈ అవార్డులను అందుకున్న వారిలో ఉన్నారు. వీరితో పాటు యూట్యూబ్‌లో వంటలు, హాస్యం, సాంకేతికత, గేమింగ్‌, పిల్లల ఛానెళ్లను నిర్వహించే వారికీ కూడా అవార్డులను అందజేశారు. కాగా, ఈ కార్యక్రమంలో దీపికా, రానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

  English summary
  India’s most influential social media stars, channels and the men and women behind them came together celebrating the phenomenon of social media at the country’s first Social Media Summit & Awards 2017 organised by the Andhra Pradesh government here on Sunday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X