వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీలోకి వలసలు .. పాత,కొత్త నేతలు సర్దుకుపోతారా ? సైలెంట్ వార్ కు సిద్ధం అవుతారా ?

|
Google Oneindia TeluguNews

స్థానిక సంస్థల ఎన్నికలవేళ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీ అయిన టీడీపీ నుంచి అధికార వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా వైసీపీలో చేరిపోతున్న పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీకి నష్టం అని భావిస్తున్నారు. అయితే ఇబ్బడిముబ్బడిగా జరుగుతున్న ఈ చేరికలు అటు టీడీపీకే కాదు వైసీపీకి భవిష్యత్ లో నష్టం చేస్తాయి అన్న భావన సైతం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే పలు జిల్లాలలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఇక ఈ సమయంలో టీడీపీ నుండి వస్తున్న వారిని చేర్చుకోవటం భవిష్యత్ లో పార్టీలోని పాత , కొత్త నేతల మధ్య అంతర్గత పోరుకు కారణం అయ్యే అవకాశం ఉందన్న భావన వ్యక్తం అవుతుంది.

 కరణం బలరాం చర్యతో ఆమంచి సైలెంట్ .. పార్టీలో చేరకుండానే ప్రత్యర్థికి చెక్ కరణం బలరాం చర్యతో ఆమంచి సైలెంట్ .. పార్టీలో చేరకుండానే ప్రత్యర్థికి చెక్

టీడీపీ నేతల వలసలు .. చంద్రబాబుకు షాక్ ... వైసీపీలో కొందరికి ఝలక్

టీడీపీ నేతల వలసలు .. చంద్రబాబుకు షాక్ ... వైసీపీలో కొందరికి ఝలక్

ఏపీలో టీడీపీ నుండి ముఖ్య నేతలు, నిన్నటి వరకు వైసీపీని ధీటుగా ఎదుర్కొన్న నేతలు ఇప్పుడు వైసీపీ తీర్ధం తీసుకోవటంతో చంద్రబాబుకు షాక్‌మీద షాక్‌లు తగులుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతునిస్తూ పార్టీలో మాత్రం చేరకుండా ఉన్నారు. ఇక ఆ మధ్య మొన్న డొక్కా మాణిక్య వరప్రసాద్‌, రహమాన్‌, కదిరి బాబూరావు, రామసుబ్బారెడ్డి, అంతేకాదు పులివెందులలో జగన్‌పై పోటీ చేసిన సతీష్‌రెడ్డి కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. నిన్నటికి నిన్న కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక వీరంతా అధికార వైసీపీలో చేరి సేఫ్ జోన్ లో ఉన్నామని భావిస్తున్నారు.

వలసలు వైసీపీలో అంతర్గత కుమ్ములాటకు కారణం అవుతాయా ?

వలసలు వైసీపీలో అంతర్గత కుమ్ములాటకు కారణం అవుతాయా ?

ఎన్నికల సమయంలో టీడీపీని దెబ్బకొట్టాలని ఆలోచనతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్న వలసలు ఇక వైసీపీలో అంతర్గత కుమ్ములాటకు కారణం అవుతుందేమో అన్న అనుమానాలు లేకపోలేదు. ఇక ఈ చేరికలు వైసీపీలో వివిధ నియోజకవర్గాల్లో కొత్త సమస్యలు సృష్టించే అవకాశం లేకపోలేదు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావును చేర్చుకున్న సీఎం జగన్ పార్టీ శ్రేణుల్లో ఆయన చేరిక పట్ల అసహనం ఉందన్న విషయం గుర్తించలేదు. ఇప్పుడు ఆయన వల్ల రెండు నియోజకవర్గాలల్లో వర్గ పోరు ప్రారంభమవుతుందన్న భావన వైసీపీ శ్రేణుల్లోనూ ఉంది. కనిగిరి, దర్శిల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో అంతగా కదిరి బాబురావు కలిసి పోయే అవకాశాలు లేదు .

ఎక్కడ చూసినా నేతల మధ్య పంచాయితీలే

ఎక్కడ చూసినా నేతల మధ్య పంచాయితీలే

ఎక్కడ చూసినా నేతల మధ్య పంచాయితీలే ఉన్న నేపధ్యంలో ఇక కరణం బలరాం విషయానికి వస్తే ఇప్పటికే చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. వీరిద్దరికీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి . ప్రస్తుతానికి ఆమంచి సైలెంట్ గా ఉన్నా ప్రత్యర్ధి అయిన కరణం బలరాం ను ఆమంచి మంచి మనసుతో కలుపుకుపోయే అవకాశం లేదు . ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతను తీసుకున్నారు. ఇంత మంది నేతల మధ్య ముందు ముందు కుమ్ములాటలు ఉంటాయన్న భావన చాలా మంది వైసీపీ నేతల్లోనే ఉంది.

 ఆధిపత్యం కోసం భవిష్యత్ లో పెద్ద పోరాటమే

ఆధిపత్యం కోసం భవిష్యత్ లో పెద్ద పోరాటమే


ఇక జమ్మలమడుగులోనూ అదే పరిస్థితి. టీడీపీ నుంచి వచ్చిన రామసుబ్బారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇక మండలి రద్దు సమయంలో వైసీపీకి మద్దతిచ్చిన ఎమ్మెల్సీ చదిపిరాళ్ల శివనాథరెడ్డి ఇలా ఒకరంటే ఒకరికి పాడనీ నేతలు అంతా ఒకే పార్టీలో చేరారు. వీరందరూ కలిసి పార్టీ కోసం పని చెయ్యటం మాట అటుంచి, ఆధిపత్యం కోసం భవిష్యత్ లో పెద్ద పోరాటమే చేస్తారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

Recommended Video

AP Home Minister Sucharita Responds Over TDP Leaders ఎటాక్ At Macherla | Oneindia Telugu
పాత వారిని, కొత్త నేతలను ఏకతాటి మీద నడిపించటం సాధ్యమేనా ?

పాత వారిని, కొత్త నేతలను ఏకతాటి మీద నడిపించటం సాధ్యమేనా ?

ఇక టీడీపీ నుండి వైసీపీలోకి ఇబ్బడిముబ్బడిగా చేర్చుకుంటున్న నేతలతో టీడీపీని దెబ్బకొడుతున్నామన్న సంతోషంలో ఉంది వైసీపీ. అయితే టీడీపీ నుండి వచ్చిన కొత్త వారిని, ఇంతకాలం ప్రత్యర్దులుగా పోరాడిన తమ పార్టీ లోని పాత వారిని ఏకతాటి మీద నడిపించటం వైసీపీ అధినేతకు కత్తి మీద సామే. గతంలో చంద్రబాబు ఇలాంటి తప్పే చేసి అంతర్గత ఘర్షణలతో పార్టీని చేజేతులారా దెబ్బ తినేలా చేసుకున్నారు . ఇక ప్రస్తుతం జగన్ కూడా వలసలను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నారు. కానీ పాత, కొత్త కాపుల మధ్య సఖ్యత లేకుంటే జగన్ కు ముందు ముందు చిక్కులే .

English summary
The TDP leaders believe that defections into the YCP is a loss to the TDP during the local elections. However, the inclusion of the TDP does not mean loss to tdp and that the future damage to the YCP will be expressed. Already the dominant war between the YCP leaders in many districts continues. The inclusion of those coming from the TDP at this time is likely to cause internal conflict between the party's old and new leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X