వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిరాయింపులు సరికాదు.. జగన్ విధానం భేష్ : ఆర్ నారాయణ మూర్తి

|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం : ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం పార్టీ ఫిరాయింపులు నేరం. కానీ నేతలు, అధినేతలు మాత్రం పాటించడం లేదు. కానీ ఏపీలో సీఎం జగన్ మాత్రం పార్టీ మారే వాళ్లు రాజీనామా చేసి .. చేరాలని కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. తాజాగా ఫిరాయింపులపై సినీనటుడు ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎంకరేజ్ చేయొద్దు ..

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించొద్దని స్పష్టంచేశారు నారాయణ మూర్తి. అలా చేస్తే ప్రజాస్వామ్యం పరిహాస్యం అవుతుందని హెచ్చరించారు. న్యాయంగా, ధర్మబద్దంగా ఓ పార్టీ నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికై ..మరో పార్టీలో చేరడం ఏంటని ప్రశ్నించారు. విశాఖపట్టణంలో బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొని .. ప్రసంగించారు.

Defects are inaccurate says R narayana murthy

అనుసరించిన వైనం ...

పార్టీ ఫిరాయింపులపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా సరికాదని చెప్తున్నారని గుర్తుచేశారు. కానీ ఆయన మాటలను కూడా ఎవరూ గౌరవించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా అయితే భవిష్యత్ తరాల నేతలకు ఎలాంటి సందేశం ఇస్తామని ప్రశ్నించారు. ఇది సరికాదని .. ఆయా నేతుల, పార్టీ అధినేతలు తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. ఫిరాయింపుల విషయంలో సీఎం జగన్ వైఖరిని కొనియాడారు. ఫిరాయింపులపై ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రశంసనీయమని పొగిడారు. పదవీకి రాజీనామా చేయకుండా పార్టీ మారుతామనే నేతలకు .. తాము ప్రోత్సహించనని జగన్ చెప్పారని గుర్తుచేశారు. ఇది మనం అభినందించాల్సిన విషయమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను గుర్తించి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని గుర్తుచేశారు. కానీ కేంద్రం మాత్రం హోదాపై క్లారిటీ ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

English summary
Party defects are a crime under the PR Act. But the leaders and leaders are not complying. But in AP, the CM pics resigned to the party switched to the new tradition. R Narayanamurthy has made sensational comments on the latest defections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X