వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్‌కుఢిల్లీ డిప్యూటీ సీఎం అభినందనలు...ఆ కార్యక్రమం సూపర్..!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దూసుకెళుతోంది. ఇప్పటికే జగన్ చేస్తున్న సంక్షేమ పథకాల ఆధారంగా దేశంలో బెస్ట్ సీఎంలలో ఆయన నాలుగో స్థానం పొందినట్లు సీ-ఓటర్ సర్వే తేల్చింది. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక ఎన్నికలకు ముందు తమ మేనిఫెస్టోలో ప్రకటించిన 90శాతం హామీలను పూర్తి చేశారని అది కూడా ఏడాదిలోనే జరిగిందని వైసీపీ నేతలు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇక విద్య ఆరోగ్య రంగాలకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

టీడీపీ నేతలకు క్వారంటైన్ భయం- చంద్రబాబు ఆందోళన- వ్యూహం మార్చిన జగన్...?టీడీపీ నేతలకు క్వారంటైన్ భయం- చంద్రబాబు ఆందోళన- వ్యూహం మార్చిన జగన్...?

 విద్యా ఆరోగ్య రంగంపై జగన్ ఫోకస్

విద్యా ఆరోగ్య రంగంపై జగన్ ఫోకస్

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సంక్షేమమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారికి ప్రభుత్వం తరపున సాయంఅందేలా పలు పథకాల ద్వారా నగదు బదిలీ చేశారు. ఇక ఏడాది పాలనలో ఆయన ఫోకస్ మొత్తం సంక్షేమం పైనే ఉండగా అభివృద్ధి పరంగా పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక జగన్ విద్య ఆరోగ్య రంగాలను తన మానసపుత్రికగా భావించారు. ఈ రంగాలకు మెరుగుదిద్దాలని భావించారు. ముందుగా ప్రతి ఒక్కరు చదువుకోవాలనే ఉద్దేశంతో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఇందులో భాగంగానే ఇంగ్లీషు మీడియం విద్యను ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ హైకోర్టు అందుకు బ్రేకులు వేసింది.

Recommended Video

#Watch Solar Eclipse 2020 In India మరో గ్రహణం భారత్ నుంచి వీక్షించాలంటే ఒక దశాబ్దం పడుతుందట !
 నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం

నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం

ఇక అమ్మఒడి పథకం ద్వారా తమ పిల్లలను బడికి పంపే తల్లులకు రూ.15వేలు ప్రోత్సాహకం కింద ఇచ్చారు సీఎం జగన్. ఇక తన పెట్ ప్రాజెక్టుగా చెప్పుకునే నాడు-నేడు కార్యక్రమానికి సైతం శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 48వేల స్కూళ్ల రూపురేఖలు మారుస్తామని తెలిపారు.ప్రస్తుతం ఉన్న స్కూలు ఫోటోను తీసి ఏడాది తర్వాత స్కూలు రూపురేఖలు మార్చేసి మరో ఫోటో తీసి ప్రజలు ముందు ఉంచుతామని సీఎం జగన్ చెప్పారు. ఇందుకోసం భారీగానే ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే నాడు నేడు కార్యక్రమంకు విధివిధానాలను కూడా రూపొందించడం జరిగింది.

జగన్‌ను అభినందించిన మనీష్ సిసోడియా

ఇక నాడు నేడు కార్యక్రమంను చాలామంది ప్రముఖులు ప్రశంసించారు. విద్యార్థి నాణ్యమైన విద్యను పొందాలంటే ముందుగా అక్కడి వాతావరణం సరిగ్గా ఉండాలని పలువురు అభిప్రాయపడ్డారు. అంటే విద్యార్థులకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు ఇతరత్ర అవసరాలను కల్పిస్తే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు ముందుకు వస్తారని అభిప్రాయపడ్డారు. ఇక తాజాగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న నాడు-నేడు కార్యక్రమం అద్భుతమైనదని జగన్ పై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో ఈ మహత్తర కార్యక్రమంను తీసుకురావాలన్న మంచి ఆలోచపై సీఎం జగన్‌ను మనీష్ సిసోడియా అభినందించారు. ఈమేరకు ఆయన తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం స్కూలు పరిస్థితిని బట్టి ఆ స్కూళ్లలో మార్పు చేసి విద్యార్థులకు మంచి వాతావరణం కల్పించడం నిజంగా అద్భుతమైన కార్యక్రమం అని సిసోడియా కొనియాడారు. మొత్తానికి నాడు నేడు కార్యక్రమంను ఇప్పటికే పలువురు ప్రశంసలు కురిపించగా ఇప్పుడు ఢిల్లీ డిప్యూటీ సీఎం కూడా ప్రత్యేకించి జగన్‌ను అభినందించడం సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

English summary
Delhi deputy CM Manish Sisodia congratulated AP CM Jagan for his flagship Program Nadu-Nedu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X