వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ ఢిల్లీకి, 24న విజయశాంతి: బీజేపీ పెద్దలతో కీలక భేటీ, ఈ ఇద్దరు నేతలూ కలుస్తారా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దేశ రాజధాని డిల్లీకి బయల్దేరారు. ఆయన వెంట పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.

ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. బీజేపీ అధినేతతో భేటీ

ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. బీజేపీ అధినేతతో భేటీ


మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులు, ఇరు పార్టీల సమన్వయం, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి వ్యవహారాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు జనసేన పార్టీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

జీహెచ్ఎంసీతోపాటు తెలంగాణ, ఏపీ రాజకీయాలపై..

జీహెచ్ఎంసీతోపాటు తెలంగాణ, ఏపీ రాజకీయాలపై..

ఈ క్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి పనిచేసే అంశంపైనా చర్చ జరగనున్నట్లు సమాచారం. ఈ భేటీలో ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జీ మురళీధరన్ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

విజయశాంతి కూడా ఢిల్లీకి..

విజయశాంతి కూడా ఢిల్లీకి..

ఇది ఇలావుంటే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం విజయశాంతి ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేతలను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేగాక, బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. మొదట బీజేపీ నుంచే ఇతర పార్టీలోకి వెళ్లిన విజయశాంతి.. తిరిగి ఇప్పుడు సొంతగూటికి చేరుతుండటం గమనార్హం. గత కొంత కాలంగా విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

Recommended Video

GHMC Elections 2020 : Balka Suman Reminds Pawan Kalyan His Defeat In AP | Oneindia Telugu
పవన్ కళ్యాణ్, విజయశాంతి భేటీ ఉంటుందా?

పవన్ కళ్యాణ్, విజయశాంతి భేటీ ఉంటుందా?


పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఢిల్లీకి బయల్దేరగా.. విజయశాంతి మంగళవారం వెళ్లనున్నారు. వీరిద్దరూ కూడా ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలవనుండటం గమనార్హం. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్, విజయశాంతి కూడా కలిసే అవకాశం ఉంది. వీరి మధ్య ఏదైనా ఆసక్తిర చర్చ ఏదైనా జరుగుతుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

English summary
delhi tour: Pawan Kalyan will meet bjp president jp nadda on November 24th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X