వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ-వైసీపీ పొత్తుపై విజయసాయి రెడ్డి కొత్త ట్విస్ట్, 'రూ.200 కోట్లతో బాబు విదేశీ టూర్'

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కలుస్తుందనే ప్రచారం ఇటీవల జోరుగా సాగుతోంది. ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీకి మద్దతిస్తామని వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన రెండు రోజులకే బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు.. పార్టీ మారి మంత్రులు అయిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని చంద్రబాబును డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ - వైసీపీ కలుస్తాయని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కమలనాథులు గుడ్ బై చెప్పనున్నారని రెండు రోజులుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బీజేపీతో కలిసి పని చేస్తాం, కానీ పోటీ చేయం

బీజేపీతో కలిసి పని చేస్తాం, కానీ పోటీ చేయం

విజయ సాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాము భారతీయ జనతా పార్టీతో కలిసి పని చేస్తామని చెప్పారు. అయితే కలిసి పోటీ మాత్రం చేయమని స్పష్టం చేశారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని అభిప్రాయపడ్డారు.

రిజైన్ చేయండి!: బాబుపై విష్ణు సంచలనం, జగన్‌తో మొదలు, తెరవెనుక పవన్ కళ్యాణ్!!రిజైన్ చేయండి!: బాబుపై విష్ణు సంచలనం, జగన్‌తో మొదలు, తెరవెనుక పవన్ కళ్యాణ్!!

విష్ణు యూటర్న్

విష్ణు యూటర్న్

ఇదిలా ఉండగా, వైసీపీ నేతలతో కలిసి చేసిన వ్యాఖ్యలపై విష్ణు యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని, పార్టీకి సంబంధించింది కాదని చెప్పారు. వైసీపీ ఎల్పీ కార్యాలయంలో తాను మాట్లాడటం యాదృచ్ఛికమే అన్నారు. తాను వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, టీడీపీలో చేరాలని భావిస్తే రాజీనామా చేసి ఉండేవాడినని చెప్పారు. అదే ఉద్దేశ్యంతో వ్యాఖ్యలు చేశానని చెప్పారు.

ఆ సొమ్మంతా విదేశాలకు! నరికి చంపినా..: చంద్రబాబుపై విజయసాయి నిప్పులుఆ సొమ్మంతా విదేశాలకు! నరికి చంపినా..: చంద్రబాబుపై విజయసాయి నిప్పులు

నెల్లూరులో జగన్ ప్రజా సంకల్ప యాత్ర

నెల్లూరులో జగన్ ప్రజా సంకల్ప యాత్ర

ఇదిలా ఉండగా, జగన్ ప్రజా సంకల్ప యాత్ర శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేయడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాలుగేళ్ల కాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయలేదని, సోమశిలకు నీరొచ్చే పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ను నిర్మించలేదన్నారు. ఆయనకు లంచాలు, కమిషన్లు తీసుకోవడంపై ఉన్న మక్కువ అభివృద్ధిపై లేదన్నారు.

నాలుగేళ్ల కాలంలో ఏమీ నిర్మించలేదు

నాలుగేళ్ల కాలంలో ఏమీ నిర్మించలేదు


వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మించిన కృష్ణపట్నం, శ్రీసిటీ, మాంబట్టు, మేనకూరు సెజ్‌లు మాత్రమే ఉన్నాయని జగన్ అన్నారు. ఆ సెజ్‌ల్లో ఇప్పటి వరకూ ఎటువంటి కంపెనీలు ఏర్పాటు చేయకపోవడంతో యువత ఉపాధి కోసం ఎదురు చూస్తోందన్నారు. నాలుగేళ్ల కాలంలో శాసనసభ, సచివాలయం, హైకోర్టు కూడా నిర్మించలేదన్నారు.

రూ.200 కోట్ల ఖర్చుతో చంద్రబాబు విదేశీ టూర్లు

రూ.200 కోట్ల ఖర్చుతో చంద్రబాబు విదేశీ టూర్లు

చంద్రబాబు రూ.200 కోట్ల ఖర్చుతో 22 సార్లు విదేశీ పర్యటనలు చేశారని జగన్ మండిపడ్డారు. ఆయన అధికారంలోకి వచ్చాక మూడుసార్లు ఛార్జీలు పెంచారన్నారు. జనంపై ఆర్టీసీ ఛార్జీల భారం కూడా మోపారని, ఇంటి పన్నులు పెంచేశారని ఏదీ వదల్లేదన్నారు. తాము అధికారంలోకి వస్తే పేదవాళ్లు ఇతర రాష్ట్రాల్లో శస్త్రచికిత్స చేయించుకుంటే పూర్తి నగదు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కిడ్నీ, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల పింఛను ఇస్తామన్నారు.

English summary
YSR Congress Party National General Secretary Vijaya Sai Reddy accused Andhra Pradesh chief minister N Chandrababu Naidu of ruling the state against the spirit of the constitution. He criticised.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X