వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకటేశ్వర స్వామికీ నోట్ల రద్దు కష్టాలు: పాత కరెన్సీకి బ్యాంకులు నో, ఒక్కసారికే ఛాన్స్

ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు ప్రభావం కోటీశ్వరుల నుంచి సామాన్యుల వరకు అందరి పైన పడింది. చివరకు దేవుడి పైన కూడా ఈ నోట్ల రద్దు ప్రభావం పడింది.

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు ప్రభావం కోటీశ్వరుల నుంచి సామాన్యుల వరకు అందరి పైన పడింది. చివరకు దేవుడి పైన కూడా ఈ నోట్ల రద్దు ప్రభావం పడింది. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి నోట్ల రద్దు చిక్కులు వచ్చి పడ్డాయి.

టీ అమ్ముకునే వ్యాపారి వద్ద రూ.650 కోట్లుటీ అమ్ముకునే వ్యాపారి వద్ద రూ.650 కోట్లు

మంగళవారం నాడు శ్రీవారి హుండీ ద్వారా వచ్చిన కానుకల్లో రూ.90 లక్షలు పాత రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయి. బ్యాంకులు ఈ నోట్లను స్వీకరించేందుకు ముందుకు రాలేదు. ఈ నెల 30వ తేదీ లోపు ఒకేసారి జమ చేసుకోవాలని షరతు పెట్టాయి. రూ.5వేలకు పైగా ఉన్న మొత్తాన్ని ఈ నెల 30వ తేదీ లోపు ఒకేసారి జమ చేయాలని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే.

demonetisation

దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) తన వద్దనే రద్దయిన పాత నోట్లను పెట్టుకుంది. వాటిని ఓ పెట్టెలో పెట్టారు. శ్రీవారికి మంగళవారం రూ.2.47కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. నిత్యం వచ్చే హుండీ కానుకలను స్టేట్‌ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకులో టిటిడి జమ చేస్తుంది.

ఉర్జీత్ పటేల్ దుమ్ముదులిపిన పవన్ కళ్యాణ్ఉర్జీత్ పటేల్ దుమ్ముదులిపిన పవన్ కళ్యాణ్

ఈ మేరకు నోట్లను బ్యాంకులో వేసే సమయంలో రద్దయిన నోట్లను నిరాకరించి మిగిలిన నోట్లను బ్యాంకులు స్వీకరించాయి. కాగా, నిబంధనలు సడలించాలని కోరుతూ ఆర్బీఐకి లేఖ రాయాలని టిటిడి నిర్ణయించింది.

English summary
Banks refuses to take Sri Venkateswara Swamy Hundi income!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X