వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిన్న అలా, నేడు ఇలా: పవన్ కళ్యాణ్ 'ఘోర తప్పిదం'.. ప్రశ్న సరే!

నోట్ల రద్దు ఘోర తప్పిదమే అయితే మొదట పవన్ కళ్యాణ్ ఎందుకు స్వాగతించారనేది కమలనాథుల ప్రశ్న. నవంబర్ 11వ తేదీన పవన్ నోట్ల రద్దును స్వాగతించారు. ఇప్పుడు ఘోర తప్పిదం అంటున్నరు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నోట్ల రద్దు విషయమై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 8వ తేదీన ప్రకటించారు. ఈ నిర్ణయంలో మోడీ పాత్రే ఎక్కువ కాబట్టి పవన్ పరోక్షంగా ఆయన పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లే.

పవన్ కళ్యాణ్ ప్రశ్న

పవన్ కళ్యాణ్ ప్రశ్న

అయితే, ఇప్పుడు నోట్ల రద్దు పైన పవన్ విమర్శలు చేయడాన్ని కమలనాథులు ప్రశ్నిస్తున్నారు. బీజేపీలోని వారికి ఎంతో రాజకీయ అనుభవం, రాజ్యాంగం పైన పట్టు ఉందని, అలాంటప్పడు నోట్ల రద్దు వంటి 'ఘోర తప్పిదాన్ని' ఎలా చేశారని ప్రశ్నించారు.

పవన్‌కు కమలనాథుల ఒక్క ప్రశ్న!

పవన్‌కు కమలనాథుల ఒక్క ప్రశ్న!

ఘోర తప్పిదమే అయితే మొదట పవన్ కళ్యాణ్ ఎందుకు స్వాగతించారనేది కమలనాథుల ప్రశ్న. మోడీ నవంబర్ 8వ తేదీన నోట్ల రద్దు ప్రకటన చేసారు. ఆ తర్వాత 11వ తేదీన పవన్ అనంతపురం జిల్లా గుత్తి కాలేజీలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

నాడు స్వాగతించిన పవన్

నాడు స్వాగతించిన పవన్

ఓ విద్యార్థి నోట్ల రద్దు పైన ప్రశ్నించారు. దీనికి పవన్ స్పందిస్తూ.. డబ్బులు పంచి కొనుక్కునే స్థాయికి మన నాయకులు వచ్చారని, కాబట్టి పెద్ద నోట్లు రద్దు చేయడం మంచి పని అన్నారు. బ్లాక్ మనీని బయటకు తీసుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిని తీసుకు వచ్చే విధానంలో ఇబ్బందులు పడొచ్చన్నారు.

సమస్యలపై సమరం సరైనదే

సమస్యలపై సమరం సరైనదే

ఆ తర్వాత జనాల ఇబ్బందులను చూసి పవన్ కళ్యాణ్ నోట్ల రద్దు అంశాన్ని కొద్ది రోజుల క్రితం ప్రశ్నించారు. నోట్ల రద్దుతో జనాలు ఇబ్బంది పడుతున్నారని, నోట్లు రద్దు చేసే ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పారు. పవన్ అంతకుముందు చేసిన ఈ వ్యాఖ్యల్లో అర్థం ఉందని చెబుతున్నారు.

స్వాగతించిన మెజార్టీ

స్వాగతించిన మెజార్టీ

నోట్ల రద్దు నిర్ణయం సరైనదేనని ఎక్కువ మంది భావిస్తున్నారు. పవన్ కూడా తొలుత స్వాగతించారు. ఆ తర్వాత సామాన్యుల ఇబ్బందులు చూసి.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించడంలో అర్థం ఉందని చెబుతున్నారు.

మాట మార్చారా?

మాట మార్చారా?

అయితే, బుధవారం నాడు ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు మాట మార్చుతున్నారనేందుకు నిదర్శనం అనే వాదనలు వినిపిస్తున్నాయి. అసలు నోట్ల రద్దునే పవన్ తప్పు పట్టడం ఇక్కడ చర్చకు దారి తీసింది. నోట్ల రద్దు తదనంతర పరిణామాల నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని బీజేపీ దుమ్ముదులిపితే అందులో అర్థం ఉండేదని అంటున్నారు.

చారిత్రక తప్పిదమే అయితే...

చారిత్రక తప్పిదమే అయితే...

కానీ ఆయన నోట్ల రద్దు నిర్ణయం చారిత్రాత్మక తప్పిదమని చెప్పడాన్ని కమలనాథులు ప్రశ్నిస్తున్నారు. చారిత్రక తప్పిదం అయితే మెజార్టీ ప్రజలు, రాజకీయ పార్టీలు ఎందుకు మద్దతిస్తున్నాయని అంటున్నారు.

స్వాగతించి, సమస్యలను ప్రశ్నించి ఆ తర్వాత..

స్వాగతించి, సమస్యలను ప్రశ్నించి ఆ తర్వాత..

పవన్ కూడా తొలుత స్వాగతించి, ఆ తర్వాత నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై అగ్రహం వెలిబుచ్చారు. అక్కడ వరకు ఫరవాలేదు. కానీ ఆ తర్వాత.. నోట్ల రద్దు చారిత్రాత్మక తప్పిదమని చెప్పడం ఏమిటంటున్నారు. చారిత్రాత్మిక తప్పిదమే అయితే మొదట ఎందుకు స్వాగతించారంటున్నారు.

చంద్రబాబు కూడా

చంద్రబాబు కూడా

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నోట్ల రద్దు అంశంపై యూ టర్న్ తీసుకున్నారు. తొలుత స్వాగతించి, ఆ తర్వాత వెనక్కి తగ్గడంపై ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. వెంటనే రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైసిపి డిమాండ్ చేసింది.

English summary
BJP hits back at Jana Sena chief Pawan Kalyan for questioning demonetisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X