వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిప్యూటీ సీఎం బోస్‌కు బంప‌రాఫ‌ర్‌: స‌చివాల‌యం సాక్షిగా: బిత్త‌రపోయారు..చివ‌ర‌కు ఇలా..!

|
Google Oneindia TeluguNews

ముక్కుసూటి మ‌నిషి. నిజాయితీ ప‌రుడు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు అత్యంత ఇష్డుడు. అందుకే ఆయ‌న‌కు ఏరి కోసి బీసీ వ‌ర్గం నుండి ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి. అటువంటి వ్య‌క్తే బిత్త‌ర‌పోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఏపీ స‌చివాల‌యం వేదిక‌గా ఆయ‌న‌కు వ‌చ్చిన బంప‌రాఫ‌ర్ చూసి షాక్ అయ్యారు. తొలి నుండి వైయ‌స్‌కు విధేయుడిగా ఉంటూ..జ‌గ‌న్ కోసం మంత్రి ప‌ద‌విని త్యాగం చేసిన పిల్లి సుభాష్ చంద్ర బోస్ కు జ‌గ‌న్ వ‌ద్ద కీల‌క ప్రాధాన్య‌త ఉంది. అందుకే ఆయ‌న‌కు రెవిన్యూ తో పాటుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్స్ శాఖ‌ను అప్ప‌గించారు. త‌న ప‌రిధి వ‌ర‌కు ఎక్క‌డా మ‌చ్చ లేకుండా చేసుకొనే బోస్ కు స‌చివాల‌యంలో విస్తుపోయే సంఘ‌ట‌న ఎదురైంది. దీంతో..ఆయ‌న ఎలా స్పందించారంటే..

ఆమె పెళ్ళికి, రాజకీయానికి ఆసక్తికరమైన లింక్ ఉందన్న మంత్రి పుష్ప శ్రీవాణిఆమె పెళ్ళికి, రాజకీయానికి ఆసక్తికరమైన లింక్ ఉందన్న మంత్రి పుష్ప శ్రీవాణి

డిప్యూటీ సీఎం బోస్ ఛాంబ‌ర్ లో...

డిప్యూటీ సీఎం బోస్ ఛాంబ‌ర్ లో...

ఉప ముఖ్య‌మంత్రి పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌. సచివాలయంలోని త‌న ఛాంబ‌ర్‌లో త‌న శాఖ‌ల‌కు సంబంధించిన బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల పైన చ‌ర్చ‌ల్లో బిజీగా ఉన్నారు. సాధార‌ణ వ్య‌క్తులు మంత్రి కోసం నిరీక్షిస్తున్నార‌నే స‌మాచారంతో వారిని లోప‌ల‌కు పంపాల‌ని మంత్రి సూచించారు. అందులో ఇద్ద‌రు వ్య‌క్తులు మంత్రి వ‌ద్ద‌కు వ‌చ్చి ప‌ర్స‌న‌ల్‌గా మాట్లాడాల‌ని కోరారు. విష‌యం ఏంటని బోస్ ఆరా తీయాగా..అత‌ను అస‌లు విష‌యం బ‌య‌ట పెట్టాడు. తాము కోరుకున్న చోట పోస్టింగ్ ఇవ్వాల‌ని కోరారు. విజయవాడ పటమటలో స‌బ్ రిజిస్టార్‌గాపోస్టింగ్‌ ఇస్తే... అక్షరాలా కోటి రూపాయలు సమ ర్పించుకుంటాం అని ఆఫర్‌ చేశాడు. మంత్రి పేషీలో కాదు..మంత్రి స‌న్నిహితుల‌కు కాదు..నేరుగా ఉప ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న పిల్లి సుభాష్ చంద్ర బోస్‌కే ఆ ఘ‌నుడు ఇలా ఆఫ‌ర్ ఇచ్చారు. దీంతో..ఒక్క సారిగా బోస్ బిత్త‌ర‌పోయా రు. వెంట‌నే అధి కారుల‌ను పిలిచారు. ఒక్క స‌బ్ రిజిస్టార్ పోస్టుకే కోటి ఆఫ‌ర్ చేసారు..అసలు ఈ శాఖలో ఏం జరుగు తోంది .. ఏ స్థాయిలో అవినీతి చోటు చేసుకుంటోంది..అంటూ ఆయ‌న షాక్‌లో ఉండిపోయారు.

ఆ లిస్టు ఇవ్వండి.. వారిని త‌ప్పించండి..

ఆ లిస్టు ఇవ్వండి.. వారిని త‌ప్పించండి..

డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న త‌న వ‌ద్ద‌కే వ‌చ్చి ఇంత పెద్ద మొత్తం ఆఫ‌ర్ చేయ‌టంతో వెంట‌నే బోస్ కీల‌క నిర్ణ‌యా ల దిశ‌గా కార్యాచ‌ర‌ణ ప్రారంభించారు. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో అవకతవకలకు చెక్‌పెట్టే దిశగా మూడు సర్క్యు లర్లు జారీ చేశారు. సబ్‌ రిజిస్ర్టార్ల బదిలీల ప్రక్రియతోనే ఈ ప్రక్షాళన మొదలు పెట్టాల‌ని డిసైడ్ అయ్యారు. ప‌ట‌మ‌ట త‌ర‌హాలో భారీగా సైడ్ ఇన్‌కం వ‌చ్చే ఆరు కార్యాల‌యాలు సీఆర్డీఏ ప‌రిధిలో ఉన్న‌ట్లుగా అధికారులు నివేదించారు. అదే విధంగా విశాఖ‌లో ఉన్న కార్యాల‌యాల జాబితాను అంద‌చేసారు. వీటిల్లో పోస్టింగ్‌లు..బ‌దిలీల అధికారాన్ని ఆ శాఖ డీఐజీ నుండి త‌ప్పించారు. అక్క‌డ కొత్త‌గా వ‌చ్చే యువ అధికారుల‌కు మాత్రమే పోస్టింగ్‌లు ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ మేర‌కు వెంట‌నే స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్స్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావుకు పంపించాలని ఆ శాఖ ఐజీ వెంకట్రామిరెడ్డిని ఆదేశించారు.

ఆ ఆరుగురిని త‌ప్పించండి..

ఆ ఆరుగురిని త‌ప్పించండి..

అధికారులు అందించిన ఆరు స‌బ్ రిజిస్టార్ కార్యాల‌యాల్లో ఇప్పటిదాకా పని చేసిన సబ్‌ రిజిస్ర్టార్లను ప్రాముఖ్యత లేని..దూరంలో ఉన్న కార్యాలయాలకు బదిలీ చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. అలాగే... ఏసీబీ కేసులున్న సబ్‌ రిజిస్టార్ల‌ను ప్రాముఖ్యత లేని స్థానాలకు వేయాలంటూ నిర్ధేశించారు. తొలుత వీరిని బదిలీ చేసిన తర్వాతే, మిగిలి న కార్యాలయాల్లో ఖాళీలకు బదిలీల ప్రక్రియ చేపట్టాలని మంత్రి ఆదేశించారు.గతంలో ఇద్దరు డీఐజీలు కుమ్మక్కయి ఇద్దరు సబ్‌రిజిస్ర్టార్లకు అక్రమంగా పోస్టింగ్‌లు ఇచ్చారని... ఆ తప్పులను సరిదిద్దాలని మంత్రి పిల్లి సుభాష్ స్ప‌ష్టం చేసారు. స‌చివాల‌యం కేంద్రంగా ఉప ముఖ్య‌మంత్రి ఛాంబ‌ర్‌లోనే ఆయ‌న‌కే నేరుగా ఆఫ‌ర్ ఇవ్వ‌టం పైన ఇప్పుడు స‌చివాల‌యంలో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది.

English summary
Deputy Cheif Minister Pilli Subash Chandra Boase faced unexpected situation in his peshi in secreatariat. One Sub Registar with another person offered one crore bribe for his posting in Patamata.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X