చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అది నిరూపిస్తే రాజీనామా చేస్తా.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్..

|
Google Oneindia TeluguNews

చిత్తూరు జిల్లా గంగాధర నియోజకవర్గం పెనమూరు ప్రభుత్వాస్పత్రి వైద్యురాలి అనితా రాణి వివాదంపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పందించారు. ఆమెకు అన్యాయం చేసినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిని అయి ఉండి.. దళిత డాక్టర్ అయిన అనితా రాణికి అన్యాయం ఎలా చేస్తానని ప్రశ్నించారు. చంద్రబాబు,లోకేష్ కుల రాజకీయాలతో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు కుల రాజకీయాలు..

చంద్రబాబు కుల రాజకీయాలు..

'చంద్రబాబు కుల రాజకీయాలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో మాల,మాదిగల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకున్నారు. డా.అనితా రాణి వ్యవహారంలో సీఐడీ విచారణ ముగిస్తే అన్ని నిజాలు బయటపడుతాయి. ఒకవేళ నేను తప్పు చేసినట్టు నిరూపణ అయితే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. నేను తప్పు చేసినట్టు చంద్రబాబు నిరూపించినా.. రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్దం. ఒకవేళ నాపై ఆరోపణలను నిరూపించకపోతే రాజకీయాల నుంచి చంద్రబాబు శాశ్వతంగా తప్పుకుంటారా..?' అని సవాల్ నారాయణ స్వామి విసిరారు.

అనితా రాణి సంచలన ఆరోపణలు

అనితా రాణి సంచలన ఆరోపణలు


ఇటీవల డా.అనితా రాణి వైసీపీ నేతలపై సంచలన ఆరోపణలు చేయడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకు వైసీపీ నేతలు తనను టార్గెట్ చేశారని.. ఆఖరికి వాష్ రూమ్‌కి వెళ్లినా ఫోటోలు,వీడియోలు తీసి వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. టీడీపీ నేత అనితతో అనితా రాణి మాట్లాడిన ఆడియో టేపును నారా లోకేష్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని అందులో అనిత ఆరోపించారు.

Recommended Video

#JaganannaChedhodu : Celebrities Big Thanks To AP CM Jagan For Jagananna Chedhodu Scheme
సీఐడీ విచారణకు అనితా రాణి నో..

సీఐడీ విచారణకు అనితా రాణి నో..

డా.అనితా రాణి వ్యవహారంపై దుమారం రేగుతుండటంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఐడీ విచారణకు ఆదేశించారు. అయితే సీఐడీ విచారణ కాదని.. సీబీఐ విచారణ జరిపించాలని అనితా రాణి డిమాండ్ చేస్తున్నారు. సీఐడీ అధికారులు తన ఇంటికి వచ్చినా విచారణకు సహకరించనని చెప్పారు. తనపై వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేస్తేనే పట్టించుకోని పోలీసులు.. ఇప్పుడెలా న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీంతో సీఐడీ అధికారులు ఈ కేసులో ఎలా ముందుకు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.

English summary
AP Deputy chief minister Narayana Swamy challenged TDP that he will resign to his post if they proves his role in doctor Anitha Rani issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X