
సినీనటుడికి రాజకీయాలు ఏం తెలుసు.. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీసీఎం నారాయణస్వామి సవాల్!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపి డిప్యూటీ సీఎం నారాయణస్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయం తెలీదు అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే కనీసం 1, 2 స్థానాలలో కూడా గెలవలేరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తానేదో చేసేస్తా అని పవన్ కళ్యాణ్ తెగ ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు.
సినీ నటుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ కు రాజకీయమే తెలియదని వ్యాఖ్యానించిన ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, ఇక అటువంటి వ్యక్తి సీఎం కావాలని పరితపించడం హాస్యాస్పదంగా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఒంటరిగా ఎన్నికల బరిలోకి వెళితే కనీసం 1,2 స్థానాలు కూడా గెలిచే అవకాశం లేదని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కు దమ్ము, ధైర్యం ఉంటే ఒంటరిగా ఎన్నికలలో పోటీ చేయాలంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్ విసిరారు.

తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిపై కుట్రలు చేసి జైలుకు పంపేందుకు కారణమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజకీయంగా దెబ్బ తిన్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు. జగన్ ను ఎదుర్కోవాలి అనుకుంటే, వారు చావు దెబ్బ తినటం పక్కా అంటూ నారాయణ స్వామి తన వ్యాఖ్యల ద్వారా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ తెగ అల్లాడుతున్నాడని, అసలు ఆయనకు రాజకీయమే తెలియదంటూ ఎద్దేవా చేశారు.
గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న వైసీపీనేతలు వైసిపి వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చూస్తానని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పొత్తులపై పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగుతారని టార్గెట్ చేస్తున్నారు. దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని పదే పదే పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతున్నారు.