• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి మరో కీలక పదవి అప్పగించిన సీఎం జగన్ .. నక్క తోక తొక్కారుగా

|

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో తన మార్కు పాలనను కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే తీసుకుంటున్న నిర్ణయాలు ఆచరణ సాధ్యం కానివని ప్రత్యర్థి పార్టీలు మండి పడుతున్నాయి. ఇక తాజాగా ఏపి డిప్యూటీ సీఎం, గిరిజన శాఖ మంత్రి పుష్ప శ్రీవారికి మరో కీలకమైన పదవిని అప్పగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.

నాడు జ‌గ‌న్‌..భార‌తిని వేధించారు..నేడు ఈడీ..సీబీఐ వేట‌లో చిక్కారు: అడ్డంగా దొరికిన ఈడీ అధికారి..!

గిరిజన సలహా మండలి చైర్మన్ గా పుష్ప శ్రీవాణి

గిరిజన సలహా మండలి చైర్మన్ గా పుష్ప శ్రీవాణి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారాన్ని దక్కించుకున్న తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పాలనలో చాలా దూకుడుగా ముందుకు వెళుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. మొన్నటికి మొన్న సభలో 75% ఉద్యోగాలు స్థానికులకు ఇస్తామని ప్రకటన చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుతం గిరిజన సంక్షేమం కోసం గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేస్తూ, దీనికి ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీవాణిని చైర్‌పర్సన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు సైతం జారీచేసింది.

పుష్ప శ్రీవాణితో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలకు ఛాన్స్

పుష్ప శ్రీవాణితో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలకు ఛాన్స్

జగన్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈ మండలిలో చైర్మన్‌తోపాటు ఆరుగురు సభ్యులు ఉంటారు. అంతేకాకుండా ఆరుగురు గిరిజన ఎమ్మెల్యేలను ఈ మండలి సభ్యులుగా నియమించారు. పాలకొండ ఎమ్మెల్యే కళావతి, సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర, అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ, పాడేరు ఎమ్మెల్యే భాగలక్ష్మీ, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మీ, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. వీరితోపాటు గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి‌‌తోపాటు మరో ఇద్దరు అధికారులు ఈ గిరిజన సలహా మండలిలో సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ డైరెక్టర్ లేదా కమిషనర్ ఈ గిరిజన సలహా మండలికి ఎక్స్ అఫిషియో సెక్రెటరీగా ఉంటారు.

ఎస్టీ సామజిక వర్గానికి చెందిన పుష్ప శ్రీ వాణి.. జాక్ పాట్ కొట్టారుగా

ఎస్టీ సామజిక వర్గానికి చెందిన పుష్ప శ్రీ వాణి.. జాక్ పాట్ కొట్టారుగా

అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ఎస్టీ సామజిక వర్గానికి చెందిన శ్రీవాణికి డిప్యూటీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు. జగన్ కేబినెట్‌లో పిన్న వయస్కురాలైన మంత్రిగా పాముల పాముల పుష్పశ్రీవాణి గుర్తింపు పొందారు. అంతే కాదు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన శ్రీవాణి పెళ్లయ్యాక విజయనగరం జిల్లాలో స్థిరపడ్డారు. గతంలో టీచర్‌గా పని చేసిన ఆమె.. భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. కురుపాం స్థానం ఆమె వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నిక‌ల్లో తొలిసారి గెలిచే నాటికి ఆమె వయసు 27 సంవత్సరాలు. అయితే ఇప్పుడు జగన్ మంత్రి వర్గంలో డిప్యూటీసీఎంగా స్థానాన్ని దక్కించుకోవడమే కాకుండా తాజాగా గిరిజన మండలి ఛైర్మన్ గా పుష్ప శ్రీ వాణి జాక్ పాట్ కొట్టారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Tribal Advisory Council for Tribal Welfare has been set up and the Deputy Chief Minister and Tribal Welfare Minister Srivani has been appointed as the Chairperson. The AP government has issued a directive in this regard. In addition, six tribal MLAs have been appointed as members of the council.Palakonda MLA Kalavati, Salur MLA Rajanna dhora, Araku MLA Shetty Phalguna, Paderu MLA Bhagyalakshmi, Rampachodavaram MLA Dhanalakshmi, Polavaram MLA tella Balaraju. The tribal advisory council is accompanied by two other officials, including the general secretary of the tribal welfare department. The Director or Commissioner of the State Tribal Welfare shall be the Ex-officio Secretary to the Tribal Advisory Council.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more