వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ కు మరో షాక్.. బాషా దూకుడు.. వైసీపీ గుర్తింపు రద్దుపై ఢిల్లీ హైకోర్టుకు..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ' గుర్తింపుపై కొనసాగుతోన్న వివాదం మరో మలుపు తిరిగింది. సొంత పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసుల చట్టబద్ధతపై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నలు లేవనెత్తిన తర్వాత.. ఈ వివాదంలోకి అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంటర్ కావడం తెలిసిదే. వైసీపీ గుర్తింపును రద్దు చేయాలంటూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంలో ఫిర్యాదులు ఉండగా.. సీఎం జగన్ కు షాక్ తగిలేలా ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులోనూ వైసీపీ గుర్తింపుపై పిటిషన్ దాఖలైంది.

ఢిల్లీలో బాషా హల్‌చల్..

ఢిల్లీలో బాషా హల్‌చల్..

సీఎం జగన్ నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం ఓ పిటిషన్ దాఖలు అయ్యింది. అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, కడప జిల్లాకు చెందిన మహబూబ్ బాషా ఈ పిటిషన్ వేశారు. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించినట్లు తెలుస్తోంది. పార్టీ పేరుపై వివాదం మళ్లీ రాజుకున్న తర్వాత బాషా తరచూ ఢిల్లీ వెళ్లి.. వైసీపీ గుర్తింపు రద్దు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ఆయన ఎన్నికల సంఘంలోనూ ఫిర్యాదు చేశారు.

ఎపీ రఘురామ వివాదంలో మరో మలుపు.. అరెస్టు భయంతో రక్షణ కోరిన రెబల్.. వైసీపీ ఫిర్యాదుల వెల్లువతో..ఎపీ రఘురామ వివాదంలో మరో మలుపు.. అరెస్టు భయంతో రక్షణ కోరిన రెబల్.. వైసీపీ ఫిర్యాదుల వెల్లువతో..

ఆ పేరు మాకే సొంతం..

ఆ పేరు మాకే సొంతం..

‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ'గా వ్యవహరించే హక్కు ఒక్క ‘అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ'కి మాత్రమే ఉందని, జగన్ నేతృత్వంలోని ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ'ని ఆ పేరుతో పిలవడంగానీ, వ్యవహరించడంగానీ చేయరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా పేర్కొందని మహబూబ్ బాషా తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈసీ ఆదేశాలకు విరుద్ధంగా జగన్ పార్టీ తన పేరును వేరుగా ప్రచారం చేసుకుంటోందని, దీనిపై వెంటనే కలుగజేసుకుని వైసీపీ గుర్తింపు రద్దయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించారు.

సాయిరెడ్డికి దిమ్మతిరిగే పంచ్.. రఘురామ సాక్షిగా దేవధర్ ఎంట్రీ.. ప్రమాదంలో వైపీపీ.. సుజనా భారీ స్టెప్సాయిరెడ్డికి దిమ్మతిరిగే పంచ్.. రఘురామ సాక్షిగా దేవధర్ ఎంట్రీ.. ప్రమాదంలో వైపీపీ.. సుజనా భారీ స్టెప్

జగన్ కంటే ముందే రిజిస్ట్రేషన్..

జగన్ కంటే ముందే రిజిస్ట్రేషన్..

ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగానే వైఎస్సార్ చనిపోవడం, ప్రజల్లో ఆయనకున్న ఆదరాభిమానాల నేపథ్యంలో వైఎస్సార్ పేరుతో చాలా పార్టీలు పుట్టుకొచ్చాయి. 2011 మార్చి 12న వైఎస్ జగన్.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP) నెలకొల్పడానికి మూడు నెలల ముందే ‘‘అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ'' పేరుతో ఇంకో పార్టీ ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేయించుకుంది. తమకు మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా వ్యవహరించే హక్కుందని అన్నా వైఎస్సార్ పార్టీ వాదిస్తోంది. రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు పార్టీ జాతీయ కార్యదర్శి హోదాలో విజయసాయి రెడ్డి జారీ చేసిన షోకాజ్ నోటీసుల్లో యువజన శ్రామిక రైతు... అని కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఉండటం తాజా వివాదానికి కేంద్రబిందువైంది.

English summary
Anna YSR Congress Party on Friday moved the Delhi High Court seeking a direction to derecognise the YSR Congress Party led bu andhra pradesh chief minister ys jagan mohan reddy. A petition was filed by Anna YSR Congress Party founder-president Mahbub Pasha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X