• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బ్యాగు సర్దేసిన సీఎం జగన్ -జనవరి 10 నుంచి విశాఖలో దుకాణం -చర్చిలో ప్రమాణం: ఎంపీ రఘురామ

|

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులపై వివాదాలు కొనసాగుతున్నా, కోర్టుల్లో విచారణలు జరుగుతున్నా ముఖ్యమంత్రి మాత్రం తన పంథాను మార్చుకోవడానికి ఇష్టపడటం లేదని, కోర్టు తీర్పులు రాకముందే తన కలల రాజధాని విశాఖపట్నానికి షిఫ్ట్ అయిపోవాలని ఆయన డిసైడ్ అయ్యారని వైసీపీకే చెందిన ముఖ్యనేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు. సంక్రాంతి పండుగలోపే సీఎం జగన్ విశాఖకు బిచాణా ఎత్తేయబోతున్నట్లు ఎంపీ సంచలనం స్టేట్మెంట్ ఇచ్చారు. ఆవ భూములకు జగన్ క్లీన్ చిట్ ఇవ్వడంపైనా అనూహ్య వ్యాఖ్యలు చేశారు. మంగళవారం 'మినీ రచ్చబండ'లో మాట్లాడిన రఘురామ ఈ మేరకు పలు అంశాలపై వివరణ ఇచ్చారు. ఎంపీ ఏం చెప్పారో ఆయన మాట్లల్లోనే..

year ender 2020: సెక్స్ కలాపాలు -పట్టపగలే జోరుగా రతిక్రీడ -కండోమ్స్ వాడకంలో హైదరాబాద్ టాప్

అమరావతిపై తీవ్ర వెటకారం

అమరావతిపై తీవ్ర వెటకారం

‘‘ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘అమరావతి.. దాన్ని మీరు రాజధాని అని కూడా అనుకుంటూ ఉంటారు..'' అంటూ సీఎం జగన్ విపరీతమైన వెటకారాన్ని ప్రదర్శించారు. మరి ఇదే వ్యక్తి ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చెప్పారు? జగన్ గృహప్రవేశం నాడు వైసీపీ నేతలు ఏం చెప్పారు? స్వయంగా ఆయన అసెంబ్లీలో ఏమని మాట్లాడారో జనం చెవులతో వినలేదా? జగన్ వస్తే రాజధానిని మార్చేస్తాడని చంద్రబాబు ప్రచారం చేస్తే దానికి వ్యతిరేకంగా అమరావతే రాజధాని అని వైసీపీ కూడా ప్రచారం చేయడం వాస్తంకాదా? చంద్రబాబు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటే నేను అమరావతిలో కట్టుకున్నానని చెప్పలేదా? మరిప్పుడు అదే జగన్ మాట మార్చి అమరావతిపై ప్రేలాపనలు చేయడమేంటి? రాజధాని వివాదం కోర్టులో పెండింగ్ లో ఉండగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడటం తగునా? మాట తప్పే వ్యక్తి కాదని జగన్ గురించి 49 శాతం ప్రజలు చాలా ఉన్నతంగా ఊహించుకున్నారు. కానీ ఆయన మాత్రం తన స్థాయిని తగ్గించుకుంటున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం..

బిగ్‌బాస్-4లో నాగార్జున దరిద్రం -భార్య, కోడలితో డేటింగ్ సరేనా? -పవన్‌కు అంతలేదు: సీపీఐ నారాయరణ

సంక్రాంతిలోపే విశాఖకు మకాం

సంక్రాంతిలోపే విశాఖకు మకాం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సంబంధించి నాకొక ముఖ్య సమాచారం తెలిసింది. జనవరి 6 నుంచి 10లోపు ఒకవేళ ఆలస్యం అయితే, సంక్రాంతి పండుగలోగా జగన్ అమరావతిని వదిలేయబోతున్నారు. కొద్ది మంది మందీమార్బలంలో తట్టాబుట్టా దుకాణం సర్దేసుకుని జగన్ విశాఖపట్నానికి వెళ్లిపోడానికి రెడీ అయ్యారని తెలిసింది. కోర్టులో వివాదం లేలేదాకా విశాఖను రాజధాని అని పిలుచుకోడానికి కూడా వీల్లేని దుస్థితి. జగన్ తనతోపాటు కొద్ది మంది అధికారగణాలను తీసుకెళ్లి మిలీనియం టవర్ లో మకాం పెడతారని విశ్వసనీయంగా తెలిసింది. అమరావతి నుంచి దుకాణం సర్దేసేముందు.. చట్టపరమైన ఇబ్బందులు ఏవైనా వస్తాయేమో జగన్ ఆలోచించుకోవాలి. మహా అయితే ఇంకో నెల రోజుల్లో తీర్పు రావాల్సింది. కానీ చీఫ్ జస్టిస్ గారు మారాల్సి వస్తోంది. కొత్త సీజేఐ వచ్చిన తర్వాతైనా మూడు నాలుగు నెలల్లో రాజధాని వివాదం ముగుస్తుంది. అదీ కాకుండా జగన్ ఇక్కడున్నా, ఎక్కడున్నా కలిసేది ఆ ముగ్గురు నలుగురు వ్యక్తులనే కాబట్టి కోర్టు తీర్పు వచ్చేదాకా అమరావతిలో ఉంటేనే మంచిది.

వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి.. అంతేకాదు ఆఫర్లు కూడా చూడండి

జయలలిత స్టైల్లో జగన్

జయలలిత స్టైల్లో జగన్

గతంలో జయలలిత అనుసరించిన విధానాలనే ప్రస్తుతం జగన్ అవలంభిస్తున్నారు. ఆమె కూడా చెన్నైని వదిలేసి, ఊటీలోని ఎస్టేట్ నుంచి పరిపాలన సాగించారు. కాళ్లకు నమస్కారాలు పెట్టించుకోవడంలోనూ జగన్.. జయను ఫాలో అవుతున్నారు. అయితే.. జగన్ లాగా జయలలిత చెప్పుడు మాటలు వినేవారు కాదు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే ఉంచారు. జగన్ మాత్రం చెప్పుడు మాటలు బాగా వింటారు. ఒక పక్క సుప్రీంకోర్టు సైతం దృష్టిసారించిన అమరావతిపై తనకున్న అయిష్టతతో వెళ్లిపోవడానికి జగన్ సిద్ధమయ్యారు. జయలలిత కొడంగల్ ఎస్టేట్ నుంచి తమిళనాడును పాలించినట్లు.. జగన్ తన కలల రాజధాని నుంచి ఏపీని పరిపాలించాలని ఉవ్విళ్లూరుతున్నారు.

జనవరిలో అసలైన రచ్చ మొదలు

జనవరిలో అసలైన రచ్చ మొదలు

ఈ గందరగోళం నడుమ ఒక మంచి వార్త విన్నాను. జనవరి 3వ వారం నుంచి జగన్ రచ్చబండ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు. ఎప్పటి నుంచో చెబుతున్న విషయం ఇప్పటికైనా కార్యరూపందాల్చడం సంతోషం. ఎందుకంటే, నేను నా ‘రాజధాని రచ్చబండ'లో చెప్పిన విషయాలనే రేపు ప్రజలు తమ నోటి నుంచి ముఖ్యమంత్రికి చెబుతారు. తద్వారానైనా వైసీపీ మళ్లీ బాగుపడుతుందని నేను నమ్ముతున్నాను. అంతేగానీ, రచ్చబండలో కూడా మళ్లీ మందీమాగధులను పక్కన పెట్టుకుంటే ఫలితం ఉండదు. ఇదిలా ఉంటే.. చిత్తూరు జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన జగన్.. ఆవ భూముల అంశాన్ని ప్రస్తావిస్తూ, అసలక్కడ కుంభకోణమే జరగలేదని చెప్పారు. ఇది ఎంత పెద్ద అబద్ధమంటే..

ఆవ భూములంటే ఆవాలు పండిస్తారా?

ఆవ భూములంటే ఆవాలు పండిస్తారా?

ఆవ భూమి అంటే ఆవాలు పండించే భూమి అని ముఖ్యమంత్రి అనుకుంటున్నాడేమో, ఆ పదానికి ముంపు ప్రాంతాలు అని అర్థం. ప్రతి ఏడూ కనీసం 5 నెలలు ముంపులో ఉంటాయని ఆవ భూములపై ఇరిగేషన్ శాఖ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. ఆవ భూములకు సంబంధించి అక్కడి స్థానిక రైతు, ప్రముఖ వైద్యుడు అడపా శ్రీనివాస్ ప్రభుత్వం నుంచి చాలా సమాచారాన్ని సేకరించారు. ఆవ భూములున్న ప్రాంతంలో ఏనాడూ రూ.7లక్షలకు మించి రిజిస్ట్రేషన్లు జరగలేదు. అలాంటి భూములకు మూడు రెట్లకు మించి ధర వెచ్చించి, కొన్ని చోట్ల రూ.45 లక్షలు కూడా చెల్లించిన జగన్ సర్కారు.. చివరికి ఎంత మొత్తాన్ని వెనక్కి తీసుకుందో అందరికీ తెలుసు. దీనిపై డాక్టర్ శ్రీనివాస్ హైకోర్టులో ఓ పిటిషన్ కూడా వేశారు. సీబీఐకి నోటీసులు ఇచ్చారు. డబ్బులు ఎవరి నుంచి ఎవరికి చేతులు మారింది, కుంభకోణం ఎలా జరిగిందన్న వివరాలను పూసగుచ్చినట్లు పేర్కొన్నారు. రైతులు డబ్బులిస్తారో లేదో అనే భయంతో మార్టుగేజ్ కొంత తీసుకుని, మళ్లీ చెక్కులు వేసిన వెంటనే ఎలా కలెక్ట్ చేసుకున్నారు అనేదంతా మీడియాలోనూ వార్తలు వచ్చాయి. ఇంత పెద్ద కుంభకోణం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం అక్కడేమీ జరగలేదని చెప్పడం విడ్డూరం. అసలు..

ఏపీ సర్కారుకు కేంద్రం ఆదేశం..

ఏపీ సర్కారుకు కేంద్రం ఆదేశం..

ఆవ భూముల కుంభకోణంలో సీఎం జగన్ పాత్ర ఉందని ఎవరూ అనడంలేదు. వైసీపీలోని చిన్న స్థాయి నేతలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. జగన్ ఇస్తోన్న పబ్లిసిటీ కారణంగా ఇటీవల గోదావరి జిల్లాలో స్థలాలపై హైప్ కొనసాగుతోంది. నా నియోజకవర్గం నర్సాపురంలో ఇళ్ల స్థలాలకు సంబంధించి కలెక్టర్ కు వెయ్యికిపైగా ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదు. పైగా వాళ్లకు ప్రమోషన్లు కూడా ఇచ్చారు. రాజమండ్రి ఆవ భూముల విషయంలో నేను ఆగస్టు 18న ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు లేఖ రాశాను. దానికి స్పందించిన ప్రధాని.. నా ఫిర్యాదును హోం శాఖకు ఫార్వర్డ్ చేశారు. సెప్టెంబర్ 29నాడు కేంద్ర హోం శాఖ.. ఏపీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది. ఆవ భూముల కుంభకోణంపై దర్యాప్తు చేయించి, రిపోర్టు పంపాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. ఆవ భూముల్లో అవినీతి జరిగిందన్నది పచ్చి నిజం. ఇంటి దొంగల్ని కాపాడుకోడానికి సీఎం జగన్ ప్రయత్నిస్తుండటం హాస్యాస్పదం. ప్రధాని మోదీకి నేను రాసిన లేఖలో కొన్ని పేర్లు కూడా ప్రస్తావించాను. రైతులకు చెక్కులు అందిన వెంటనే ఆ డబ్బులు ఎవరి అకౌంట్లలోకి వెళ్లాయో ఏ నలుగురికి పట్టుకున్నా ఇట్టే బయటపడుతుంది.

చర్చిలో బైబిల్ సాక్షిగా జగన్ ప్రమాణం చేస్తాడా?

చర్చిలో బైబిల్ సాక్షిగా జగన్ ప్రమాణం చేస్తాడా?

అవినీతి ఆరోపణలకు సంబంధించి రాష్ట్రంలో ఇటీవల దేవుళ్ల మీద ప్రమాణాలు చేయడమనే ట్రెండ్ నడుస్తోంది. మొన్న అనపర్తిలో, నిన్న విశాఖలో వెలగపూడి రామకృష్ణపై వైసీపీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రమాణాల సవాళ్లు విసిరారు. గతంలో వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను ఓడించి, మూడు సార్లు ఎమ్మెల్యేగానూ గెలిచి, జగన్ ప్రభంజనంలోనూ జనం ఓట్లతో గెలుపొందిన వెలగపూడిని స్థాయి తక్కువ నేతగా మా(వైసీపీ)వాళ్లు భావిస్తే పొరపాటే అవుతుంది. వెలగపూడి నిత్యం బుల్లెట్ పై తిరుగుతూ జనం మధ్యలోనే ఉంటారు. ఇలా ప్రజల నుంచి ఎన్నికైన ఒక నేతను.. జనంతో సంబంధం లేకుండా రాజ్యసభకు ఎంపికైన ఒక వ్యక్తి తూలనాడటం ఎబ్బెట్టుగా ఉంది. సాయిరెడ్డిని దైవాంశసంభూతుడిగా కొందరు నేతలు ఫీలవుతున్నారట. ఆయనలో కాంతి ఉందో లేదో ఈసారి ఆయనను కలిసినప్పుడు చూస్తాను. ఈక్రమంలో ఆవ భూముల్లో కుంభకోణం జరగలేదని సీఎం జగన్ కూడా చర్చిలో ప్రమాణం చేస్తారా? అని ఎవరైనా అడిగితే పరిస్థిత ఏంటి? నేనే గనుక ఆ డిమాండ్ చేస్తే వైసీపీ వాళ్లు నీ స్థాయి ఏంట్రా? జగన్ స్థాయి ఏంట్రా? అని దాడికి దిగుతారు. మాక్కుడా అభిమానులు ఉన్నప్పటికీ.. స్థాయిల గురించి మాట్లాడుకుని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేదు. ఒకవైపు ప్రధాని స్థాయిలో ఆవ భూములపై ఎంక్వైరీ చేయాలని ఆదేశాలు వస్తే.. ముఖ్యమంత్రి మాత్రం అవినీతి జరగలేదని చెప్పుకోవడం దురదృష్టకరం'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

English summary
narsapuram ysrcp mp raghurama krishnam raju made sensational comments on ap capital that, despite amaravathi legal battles, ap cm ys jagan likely to shift visakhapatnam before 2021 sankranthi. speaking through social media, the rebel mp alleges cm jagan and ysrcp for scams
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X