వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డారా : ఫారం -7 లో ఏం చేద్దామ‌నుకున్నారు: వైసిపికి లాభ‌మా...న‌ష్ట‌మా..!

|
Google Oneindia TeluguNews

వైసిపి అధినేత జ‌గ‌న్ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డారా. ఎన్నిక‌ల వేళ ఫారం -7 ద‌ర‌ఖాస్తుల పై జ‌గ‌న్ ఎందుకింత వివ‌ర‌ణ ఇస్తు న్నారు. ఒక వైపు టిడిపి మొత్తం జ‌గ‌న్ ఓట్లు తొలిగిస్తున్నారంటూ మూకుమ్మ‌డిగా దాడి చేస్తున్నారు. వారికి స‌మాధానం చెబుతూనే..జ‌గ‌న్ ఇస్తున్న వివ‌ర‌ణ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అస‌లు జ‌గ‌న్ ల‌క్ష్యం ఏంటి. ఇది ఎన్నిక‌ల వేళ‌..పార్టీకి లాభ‌మా..న‌ష్ట‌మా..

ఫారం-7 పై జ‌గ‌న్ వివ‌ర‌ణ‌..

ఫారం-7 పై జ‌గ‌న్ వివ‌ర‌ణ‌..

ఏపిలో పెద్ద ఎత్తున ఓట్ల తొలిగింపు ధ‌ర‌ఖాస్తుల పై పెద్ద ఎత్తున రాజ‌కీయ దుమారం చెల‌రేగింది. అధికార పార్టీ టిడిపి సైబ‌ర్ క్రైంకు పాల్ప‌డింద‌ని..త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉన్న వారి ఓట్ల‌ను తొలిగిస్తూ..అనుకూలంగా ఓట్ల‌ను చేర్చుతుంద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. ఇదే విష‌యం పై ఏపి లో 54 ల‌క్ష‌ల దొంగ ఓట్లు ఉన్నాయంటూ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి సైతం ఫిర్యాదు చేసారు. అంత‌టితో ఆగ‌లేదు. టిడిపి అక్ర‌మాల‌ను అడ్డుకోవ‌టానికి తామే ఫారం -7 ద్వారా డూప్లికేట్ ఓట‌ర్ల వివ‌రాల‌ను ఎన్నిక‌ల సంఘం దృష్టికి తీసుకెళ్లామ‌ని జ‌గ‌న్ వివ‌రించారు. ఇలా దొంగ ఓట్ల‌ను ఎన్నిక‌ల సంఘం దృష్టికి తీసుకెళ్ల‌టం ప్ర‌తీ ఒక్క‌రి బాధ్య‌త అని చెబుతున్నారు. ఫారం-7 త‌మ నేత‌లు ద‌ర‌ఖాస్తు చేయ‌టం ద్వారా వెంట‌నే వారి ఓట్ల‌ను తొలిగించ‌ర‌ని..డూప్లికేట్ ఓట‌ర్ల‌ను మాత్రమే తొలిగిస్తార‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. ఇదే స‌మ‌యంలో..ముఖ్య‌మం త్రి చేసిన సైబ‌ర్ క్రైం త‌ప్ప‌ని..తాము చేసింది త‌ప్పు కాద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు.

ఇది వివ‌ర‌ణా..ఆత్మ‌ర‌క్ష‌ణా

ఇది వివ‌ర‌ణా..ఆత్మ‌ర‌క్ష‌ణా

జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్ క‌లిసిన త‌రువాత ఇచ్చిన సుదీర్ఘ వివ‌ర‌ణ పై ఇప్పుడు చ‌ర్చ మొద‌లైంది. నెల్లూరు లో జ‌రిగిన పార్టీ స‌మ‌ర శంఖారావం స‌భ‌లో తొలుత జ‌గ‌న్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. దీని పై ముఖ్య‌మంత్రి మొద‌లు టిడిపి నేత‌లు అంద‌రూ జ‌గ‌న్ ను లక్ష్యంగా చేసుకొని విమ‌ర్శ‌లు మొద‌లు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9 ల‌క్ష‌ల ఓట్ల‌ను తొలిగిం చేందుకు జ‌గ‌న్ ఫారం - 7 దాఖ‌లు చేసార‌ని ఆరోపించారు. వీటి పై ఏపి వ్యాప్తంగా అనేక కేసులు న‌మోద‌య్యాయి. ఫారం -7 ను దుర్వినియోగం చేసే వారి పై కేసులు న‌మోదు చేస్తున్నామ‌ని ఎన్నిక‌ల సంఘం సైతం స్ప‌ష్టం చేసింది. కానీ, జ‌గ‌న్ మాత్రం తాము అధికార పార్టీ చేస్తున్న అక్ర‌మాల‌ను అడ్డుకోవ‌టానికే ఈ మార్గం ఎంచుకున్నామ‌ని వివ‌ర‌ణ ఇస్తున్నారు. దీని పై ప్ర‌భుత్వం కేసులు పెట్ట‌టం పై ఆయ‌న అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. గ‌త రెండేళ్ల కాలంగా టిడిపి చేస్తున్న అక్ర‌మాల కార‌ణంగా 54 లక్ష‌ల దొంగ ఓట్లు చేరిన‌ట్లుగా తాము గుర్తించామ‌ని జ‌గ‌న్ వివ‌రించారు. ఎన్నిక‌ల సంఘానికి సైతం ఫిర్యాదు చేసామ‌ని..ఇదే విష‌యాన్ని మ‌రో సారి ఇసికి వివ‌రిస్తామ‌ని చెప్పుకొచ్చారు. అయితే, ఇది వివ‌ర‌ణా లేక టిడిపి ఎదురుదాడి తో ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డారా అనే సందేహం మొద‌లైంది.

వైసిపికి లాభ‌మా.. న‌ష్ట‌మా

వైసిపికి లాభ‌మా.. న‌ష్ట‌మా

ఇక‌, వైసిపి అధినేత టిడిపి అక్ర‌మాల‌కు కౌంట‌ర్ గా తాము ఫారం -7 ద‌ర‌ఖాస్తులు ఇచ్చిన‌ట్లుగా చెప్పుకొచ్చారు. అయితే ఓట్ల తొలిగింపు జ‌గ‌న్ చేస్తున్నారంటూ టిడిపి చేస్తున్న ఆరోప‌ణ‌లకు జ‌గ‌న్ తనంత‌ట తానుగా చెప్ప‌టం మ‌రింత బ‌లం ఇచ్చిన‌ట్ల‌యింది. దీని ద్వారా ఓట్ల తొలిగింపు జ‌గ‌న్ చేయిస్తున్నార‌నే భావ‌న మ‌రింత‌గా టిడిపి ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే అవ కాశం ఉంది. అయితే, వైసిపి నేత‌లు మాత్రం మ‌రోలా స్పందిస్తున్నారు. టిడిపి చేస్తున్న ఆరోప‌ణ‌ల కంటే..ఎన్నిక‌ల్లో
విజ‌యం ముఖ్య‌మ‌ని..అందు కోసం ప్ర‌జ‌ల‌కు అర్ద‌మ‌య్యేలా వివ‌రిస్తూ.. టిడిపి ఓట్ల విష‌యం లో అక్ర‌మాల‌ను అడ్డుకో వాలంటే ఫారం -7 ఇస్తున్న విష‌యం నిజాయితీగా చెప్పుకోవ‌టం ద్వారా ఖ‌చ్చితంగా ప్ర‌జ‌ల్లో సానుకూల‌త ఏర్ప‌డు తుంద‌ని, ఈ ద‌ర‌ఖాస్తుల్లో కేవ‌లం టిడిపి చేర్చిన దొంగ ఓట‌ర్ల లిస్టులోని పేర్లు మాత్ర‌మే ఉంటాయ‌ని చెబుతున్నారు. సాధార‌ణ ఓటర్ల విష‌యంలో ఎటువంటి ప్ర‌భావం ఉండ‌ద‌ని.. ఏ అవ‌కాశం టిడిపికి ఇవ్వ‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే జ‌గ‌న్ తాము ఏం చేస్తున్న‌దీ వివిరించి చెబుతున్నార‌న్న‌ది పార్టీ నేత‌ల వాద‌న‌. ఓట్ల శాతం గెలుపు - ఓట‌ముల మ‌ధ్య చాలా త‌క్కువ‌గా ఉన్న స‌మ‌యంలో ప్ర‌తీ విష‌యం చాలా కీల‌కంగా ఉంటుంద‌ని చెబుతున్నారు.

English summary
YCP Chief jagan is in Deffence in form-7 filing issue. He given detailed explanation o this issue after met Governor in Raj Bhavan. Jagan says to control TDP fraud in voters list party decided to file form -7.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X