విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ కరోనా క్వారంటైన్: రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం, మెనూ ఇదే..!

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 348 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నాలుగు మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో బుధవారం రాత్రి 9 నుంచి గురువారం ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 217 సాంపిల్స్ ను పరీక్షించగా, అన్ని కేసు లు నెగటివ్ గా నిర్దారించబడ్డాయి. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారితో కరోనా కేసులు పెరిగాయి.

క్వారంటైన్లలో ఎలాంటి ఆహారం..

కాగా, కరోనావైరస్ లక్షణాలున్న వారిని క్వారంటైన్లలో ఉంచి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లినవారితోపాటు పాజిటివ్ కేసులు నమోదైన వారి కుటుంబాలను కూడా క్వారంటైన్ కు తరలిస్తున్నారు. క్వారంటైన్ వార్డుల్లో ఉండేవారికి ఎలాంటి ఆహారం అందిస్తున్నారని ప్రశ్న ఇటీవల తరచుగా వినిపిస్తోంది. రోగ నిరోధక శక్తి పెంచేవిధంగా ఆహారం ఇస్తున్నారా? లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

క్లారిటీ ఇచ్చిన ఆరోగ్యాంధ్ర..

ఈ క్రమంలో ఏపీలో క్వారంటైన్లలో ఉన్నవారికి ఎలాంటి ఆహారం అందిస్తున్నారో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆరోగ్యాంధ్రా ట్విట్టర్ వేదికగా ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. విజయవాడలో ఉన్న క్వారంటైన్ వార్డుల్లో ఉన్న వాళ్లకు అందించే ఆహారానికి సంబంధించిన ఫొటోను కూడా జత చేసింది. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు మంచి ఆహారం అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ మెనూను పరిశీలించినట్లయితే.. రెండు గుడ్లు, అరటి పండ్లు, బాదం పప్పు, జీడి పప్పు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం, ఓ జ్యూస్ అందజేస్తున్నట్లు తెలుస్తోంది.

గుంటూరులో తొలి కరోనా మరణం..


కాగా, గుంటూరు జిల్లాలో తొలి కరోనా మరణం చోటు చేసుకుంది. నరసారావుపేట వరవకట్టకు చెందిన ఓ వ్యక్తి టీబీ, నెమ్ము చికిత్స కోసం 10 రోజుల క్రితం ఐడీహెచ్ ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతు రెండ్రోజుల క్రితం మృతి చెందాడు. అయితే, బాధితుడు మృతి చెందిన అనంతరం పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు స్థానిక ఆర్డీవో తెలిపారు.

English summary
details of food for quarantined persons in andhra pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X