• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎపిలో త్వరలో చేపట్టబోయే అభివృద్ది కార్యక్రమాలు...మంత్రుల వెల్లడి

|

అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 16 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖామంత్రి కెఈ కృష్ణమూర్తి వెల్లడించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాలలో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయం చెప్పారు.

ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అనంతరం వీటిపై అభ్యంతరాలు స్వీకరించి, డివిజన్లను ఖారారు చేస్తామని మంత్రి కెఈ తెలిపారు. అలాగే రాష్ట్రంలో తమ శాఖల పరిధిలో చేపట్టబోయే అభివృద్ది కార్యక్రమాల గురించి వివిధ శాఖల మంత్రులు అసెంబ్లీలో వివరాలు వెల్లడించారు. ఇళ్ల మంజూరులో అక్రమాలు నిరోధించేందుకు రాష్ట్రంలో ఒకరికి ఒక ఇల్లు మంజూరైనట్లు ప్రభుత్వ జాబితాలో పేరు నమోదైతే...ఇక ఆ లబ్ధిదారునికి మరో ఇల్లు మంజూరు చేసే అవకాశం ఇకమీదట ఉండదని గృహనిర్మాణ శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు.

 కొత్త రెవిన్యూ డివిజన్లు ఇవే...ప్రతిపాదనల్లో...

కొత్త రెవిన్యూ డివిజన్లు ఇవే...ప్రతిపాదనల్లో...

రాష్ట్రంలో పాతపట్నం, చింతపల్లి, నర్సీపట్నం, బొబ్బిలి, చీపురుపల్లి, భీమవరం, నందిగామ, బాపట్ల, మార్టూరు, దర్శి, శ్రీకాళహస్తి, కుప్పం, బద్వేలు, పత్తికొండ, గుంతకల్లు కేంద్రాలుగా కొత్త డివిజన్ల ఏర్పాటు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు రెవిన్యూ మంత్రి కెఈ కృష్ణమూర్తి వెల్లడించారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ రాజోలు కేంద్రంగా మరో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. మంత్రి అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

నూతన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు...కొత్తగా 41 ఏర్పాటు

నూతన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు...కొత్తగా 41 ఏర్పాటు

రాష్ట్రవ్యాప్తంగా 41 కొత్త పిహెచ్‌సిలను ఏర్పాటు చేయాలని నిర్ణియించినట్లు...అలాగే ఇప్పుడు ఉన్నవాటిని అభివృద్ది పరిచేందుకు రాష్ట్ర స్థాయిలో కమిటీని నియమించినట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో అనేక సమస్యలున్నాయని, అందుకే ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు అదనంగా కేటాయించామని మంత్రి తెలిపారు. జిల్లాల వారీగా అభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి ప్రణాళికలు రూపొందించడం చేయలేదని ఎమ్మెల్యేల ప్రశ్నకు మంత్రి యనమల లిఖితపూర్వకంగా జవాబిచ్చారు.

59 జూనియర్‌ కాలేజీల స్థాపనకు.. ప్రతిపాదనలు:మంత్రి గంటా

59 జూనియర్‌ కాలేజీల స్థాపనకు.. ప్రతిపాదనలు:మంత్రి గంటా

రాష్ట్రంలో కొత్తగా మరో 59 జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని విద్యా శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లోని జూనియర్‌ కాలేజ్ లలోని సమస్యల గురించి వివరించేందుకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను పలువురు సభ్యులు కోరారు. బిజెపి ఫ్లోర్‌ లీడర్‌ విష్ణుకుమార్‌ రాజు పదే పదే అనుమతి కోరినా స్పీకర్‌ ఇవ్వలేదు. దీంతో ఆయన లేచి నిలబడి తమ నియోజకవర్గానికి జూనియర్‌ కళాశాల కావాలంటూ మంత్రి గంటా దృష్టికి తెచ్చే యత్నం చేశారు. స్పీకర్‌ అనుమతి లేకుండా నేరుగా మాట్లాడం సభా మర్యాద కాదని అధికార పక్ష సభ్యులు పలువురు వారించడంతో సభలో కలకలం రేగాంది. ఆ తరువాత స్పీకర్‌ ఈ విషయమై మంత్రికి సమాధానం ఇచ్చేందుకు అవకాశం ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.

అమరావతిలో...మెగా శిల్పారామం:మంత్రి అఖిల ప్రియ

అమరావతిలో...మెగా శిల్పారామం:మంత్రి అఖిల ప్రియ

అమరావతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో మెగా శిల్పారామం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. అలాగే తిరుపతి, కడప, విశాఖపట్నం, అనంతపురం, పులివెందుల, పుట్టపర్తిలలో శిల్పారామాలు ఏర్పాటు చేశామని చెప్పారు. విజయనగరం, గుంటూరుల్లో త్వరలో పనులు చేపట్టనున్నామని మంత్రి తెలిపారు. కర్నూలు, శ్రీకాకుళంలో శిల్పారామం కోసం భూములు ఇచ్చారని, తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరుల్లో ఇంకా భూములు కేటాయించాల్సి ఉందని మంత్రి అఖిల ప్రియ వెల్లడించారు.

 కడప ఉక్కు పరిశ్రమపై...కేంద్ర టాస్క్‌ఫోర్సు కమిటీ

కడప ఉక్కు పరిశ్రమపై...కేంద్ర టాస్క్‌ఫోర్సు కమిటీ

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశానికి సంబంధించి స్టీల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన నివేదిక కరెక్ట్ కాదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినట్లు మంత్రి సుజయకృష్ణ రంగారావు తెలిపారు. దీంతో ఈ విషయమై కేంద్రం టాస్క్‌పోర్సు కమిటీని ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యేల ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు. మికాన్‌ సంస్థ తన నివేదికను టాస్క్‌పోర్సు కమిటీకి ఇప్పటికే ఇచ్చిందని చెప్పారు. త్వరలో నిర్వహించే టాస్క్‌పోర్సు కమిటీ సమావేశంలో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందన్నారు.

 రాష్ట్రంలో ఒకరికి ఒక ఇల్లే:మంత్రి కాల్వ

రాష్ట్రంలో ఒకరికి ఒక ఇల్లే:మంత్రి కాల్వ

ఇళ్ల మంజూరులో అక్రమాలు నిరోధించేందుకు రాష్ట్రంలో ఒకరికి ఒక ఇల్లు మంజూరైనట్లు ప్రభుత్వ జాబితాలో పేరు నమోదైతే...ఇక ఆ లబ్ధిదారునికి మరో ఇల్లు మంజూరు చేసే అవకాశం ఇకమీదట ఉండదని గృహనిర్మాణ శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు. అయితే అంతకుముందు మంజూరైన డబ్బు మొత్తం వెనక్కి చెల్లిస్తే, అప్పుడు మరోసారి ఇల్లు కేటాయించే అంశం ప్రభుత్వ పరిశీలిస్తోందన్నారు. అలాగే ఇళ్ల లబ్ధిదారులకు నిధుల చెల్లింపులో జాప్యానికి సాంకేతిక సమస్యలున్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి కాల్వ వివరించారు.

English summary
Amaravathi: Ministers of different ministries have explained in detail about the various development programmes in the state. The details were revealed by the ministers during question Hour in assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more