నేపాల్‌లో చిక్కుకున్న దేవేందర్ గౌడ్ తనయుడు: కేంద్ర మంత్రులకు వినతి
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ తెలంగాణ సీనియర్ నేత దేవేందర్‌గౌడ్ బుధవారం పలువురు కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. నేపాల్‌లో చిక్కుబడిపోయిన తన కుమారుడు వీరేందర్‌గౌడ్ సహా 16 మంది బృందాన్ని తక్షణం రక్షించాలని విజ్ఞప్తి చేశారు.
భూకంపంతో అల్లకల్లోలంగా మారిన నేపాల్‌లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీరేందర్ బృందం ఇటీవల అక్కడకు వెళ్లింది.వారు ఆ పనుల్లో ఉండగానే మంగళవారం మరోసారి భారీ భూకంపం విరుచుకుపడింది.

ఈ సమయంలో వారు సింధుపాల్‌చౌక్ జిల్లా స్యాయూల్ బజార్ గ్రామంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో వీరేందర్ బృందాన్ని ఆర్మీ హెలీకాప్టర్ల సహాయంతో రక్షించాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను దేవేందర్ గౌడ్ కోరారు.
వారు సురక్షితంగా స్వదేశానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాల్సిందిగా పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుకు విజ్ఞప్తి చేశారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications