వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రాఫిక్‌ను చేసినట్లే పోర్న్‌ను చేయండి: రామ్ గోపాల్ వర్మపై స్త్రీల నిరసన

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: చలన చిత్ర దర్సకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేయాలని సామాజిక కార్యకర్త దేవి డిమాండ్ చేశారు. వర్మ అరెస్టును డిమాండ్ చేస్తూ మహిళలు విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు.

మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నా 24 గంటల పాటు సాగనుంది. ఈ దీక్షకు దేవి సంఘీభావం తెలిపారు. వర్మపై తెలంగాణలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆయనపై కేసు నమోదు చేయాలని మహిళలు కోరుతున్నారు.

 వర్మపై ఎపిలో కేసు పెట్టాలి..

వర్మపై ఎపిలో కేసు పెట్టాలి..

గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జిఎస్టీ) సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మపై తెలంగాణలో కేసు నమోదు చేస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు చేయలేదని దేవి ప్రశ్నించారు. పోలీసులను పెట్టి ట్రాఫిక్‌ను నియంత్రించినట్లే నిపుణుల సాయంతో పోర్న్‌సైట్లను కూడా నియంత్రించాలని ఆమె కోరారు.

 డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదు...

డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదు...

తమ డిమాండ్‌ను ప్రభుత్వాలు పట్టించకోవడం లేదని మహిళా కార్యకర్త లక్ష్మి అన్నారు. విచారణ చేపట్టాలని తాము డిమాండ్ చేస్తున్నా పోలీసులు వినడం లేదని ఆమె అన్నారు. మహిళలకు చెందిన చట్టాలు అమలు కాకపోయినా ఎపి మహిళా కమిషన్ పట్టించుకోవడం లేదని అన్నారు.

Recommended Video

RGV To Files A Case Against TV9
 అన్యాయంగా ప్రవర్తిస్తోంది....

అన్యాయంగా ప్రవర్తిస్తోంది....

విధివిధానాల్లో లోపాలున్నాయని, ఎపి ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని లక్ష్మి అన్నారు. తమ డిమాండ్లపై స్పందించాలని, వెంటనే వర్మపై కేసు నమోదు చేయాలని ఆమె అన్నారు.

 ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఉంటే...

ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఉంటే...

మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉంటే తక్షణమే వర్మపై కేసు పెట్టాలని దేవి డిమాండ్ చేశారు. ఆయనను అరెస్టు చేయాలని కూడా అన్నారు.

English summary
Social worker Devi demanded AP govt to takeaction against Ram Gopal Varma, the director of God, sex and Truth
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X