వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీలో చేరిన అవినాశ్: పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్: టీడీపీలో అవమానాలు తట్టుకోలేకనే..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Devineni Avinash Joins YSRCP || Oneindia Telugu

తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాశ్ టీడీపీకి రాజీనామా చేసారు. అనుకున్న విధంగానే ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. చంద్రబాబు ఒక వైపు విజయవాడలో దీక్ష చేస్తున్న సమయం లోనే అవినాశ్ ను ముఖ్యమంత్రి జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో క్రియాశీలకంగా పని చేసిన అవినాశ్ తనకు తగిన ప్రాధాన్యత..గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేసారు. పార్టీలో కొందరికే ప్రాధాన్యత లభిస్తోందని కొద్ది రోజులుగా ఆవేదనతో ఉన్నారు. తన తండ్రి అనుచరులు..తన సన్నిహితులతో ఇదే అంశం మీద సుదీర్ఘంగా చర్చించారు. ఆ సమయంలోనే వైసీపీ నుండి ఆహ్వానం ఉండటంతో..వారి అభిప్రాయాలు సేకరించారు. వారంతా వైసీపీలో చేరాలని సూచించారు. దీంతో..అవినాశ్ వైసీపీలో చేరాలని నిర్ణయించారు. అవినాశ్ కు విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించే విధంగా వైసీపీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

వైసీపీలోకి అవినాశ్ ఎంట్రీ..

వైసీపీలోకి అవినాశ్ ఎంట్రీ..

టీడీపీకి రాజీనామా చేసిన తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ఇప్పుడు వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్ ఆయనతో పాటుగా పార్టీలో చేరేందుకు వచ్చిన కడియాల బుచ్చిబాబు వంటి వారికి పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. తొలుత తండ్రితో కలిసి కాంగ్రెస్ లో ..ఆ తరువాత టీడీపీలో విజయవాడ నగరంలో అవినాశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. తండ్రి దేవినేని నెహ్రూ మరణం తరువాత ఆయన టీడీపీలో మరింత యాక్టివ్ అయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు సూచన మేరకు అవినాశం గుడివాడ నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసారు. కొడాలి నాని చేతిలో ఓడిపోయారు. ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆయన టీడీపీలోనే ఉన్నారు. అయితే, కొద్ది రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాల కారణంగా..అవినాశ్ ఆవేదనతో ఉన్నారని సహచరులు చెబుతున్నారు. దీంతో పాటుగా..పార్టీలో ప్రాధాన్యత ..గుర్తింపు లేని కారణంగా ఇక పార్టీ వీడాలని అవినాశ్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.

వైసీపీలో ప్రాధాన్యత ఇస్తామంటూ..

వైసీపీలో ప్రాధాన్యత ఇస్తామంటూ..

టీడీపీలో కొనసాగలేనని అవినాశ్ భావిస్తున్న సమయంలో వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. తమ పారట్ీలోకి రావాలని ఆహ్వానించారు. తొలి నుండి నెహ్రూ కుటుంబానికి పట్టు ఉన్న విజయవాడ తూర్పు నియోజకవర్గం బాధ్యతలు అప్పగిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. గుడివాడ ఎన్నికల బరిలో దించిన సమయంలో అవినాశ్ తన శక్తి..సామర్ధ్యాలకు మించి గెలుపు కోసం ప్రయత్నించారని..అయితే పార్టీ నేతల నుండి మాత్రం ఆశించిన సహకారం లేదని అవినాశ్ సన్నిహితులు చెబుతున్నారు. అవినాశ్ ఆ పరిస్థితిని టీడీపీ అధినేతకు సైతం వివరించారని పేర్కొన్నారు. ఇదే సమయంలో..సొంత జిల్లాకు చెందిన మంత్రులు నేరుగా అవినాశ్ తో టచ్ లోకి వెళ్లారు. అవినాశ్ ను 14న చంద్రబాబు దీక్ష సమయంలో పార్టీలో చేరాలని కోరారు. దీంతో..గుణదలలో కార్యకర్తలతో సమావేశమైన అవినాశ్ వారికి పరిస్థితిని వివరించారు. వారు కూడా పార్టీ మారాలని చెప్పటంతో ఇక, టీడీపీకి రాజీనామా చేసి అధికారికంగా వైసీపీలో చేరారు.

నష్టం చేస్తన్నారంటూ.. చంద్రబాబుకు లేఖలో..

నష్టం చేస్తన్నారంటూ.. చంద్రబాబుకు లేఖలో..

టీడీపీకి రాజీనామా చేస్తూ అవినాశ్ రాసిన లేఖలో ఆసక్తి కర అంశాలను ప్రస్తావించారు. గతంలో తాను పార్టీ వీడుతున్నట్లుగా ఎవరి మీడియాకు సమాచారం ఇచ్చారో..ఎవరు క్రియేట్ చేసారో స్వయంగా చంద్రబాబు కు వివరించినట్లుగా అందులో పేర్కొన్నారు. అదే సమయంలో..జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో ఉన్న తన తండ్రి అనుచరులకు అక్కడి నాయకత్వం ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వటం లేదని..
దీనిని ఎన్నిసార్లు చెప్పినా..న్యాయం చేస్తానని హామీ ఇవ్వటం తప్పితే న్యాయం చేయలేదని అవినాశ్ తన లేఖలో స్పష్టం చేసారు.కొంతమంది లోకల్ నాయకులు కావాలనే ఇదంతా చేస్తున్నా అధిష్టానం పట్టించుకోకపోవడం కార్యకర్తలకు రుచించలేదు. దీంతో..ఇక అవమానాలు తట్టుకొనే ఓపిక లేక పార్టీని వీడుతున్నట్లుగా తేల్చి చెప్పారు. మా కార్యకర్తలకు ప్రాధాన్యం లేని చోట నేను ఉంటూఆత్మవంచన చేసుకోలేను అని అవినాశ్ తేల్చి చెప్పారు.

English summary
Devineni Avinash joined in YCP in presence of CM jagan. He mentioned reason for leave the TDP in his resignation letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X