వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గత టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరద ముంపు... దేవినేని అవినాష్ వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడలో నీటమునిగిన పలు ప్రాంతాలలో పరిస్థితిని వైఎస్ఆర్సిపి తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ పర్యవేక్షించారు. కృష్ణా కరకట్ట ప్రాంతంలో 15 వ డివిజన్ లో పర్యటించిన దేవినేని అవినాష్ గత ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఆ ప్రాంతం ముంపుకు గురైంది అంటూ గత టిడిపి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు . గత ప్రభుత్వం కట్టిన రిటైనింగ్ వాల్ నిరుపయోగంగా మారిందని, నిర్మాణం సగంలో ఆగటం వల్లనే రిటైనింగ్ వాల్ ఉన్నప్పటికీ నీళ్లు లోపలికి వస్తున్నాయని ఆయన కృష్ణా కరకట్ట ప్రాంతాల్లో వరద ముంపు టిడిపి తప్పిదంగా మాట్లాడారు.

ఏపీ, తెలంగాణా జలజగడం ... అపెక్స్ కౌన్సిల్ భేటీకి మరోమారు ముహూర్తం.. ఈ సారైనా ...ఏపీ, తెలంగాణా జలజగడం ... అపెక్స్ కౌన్సిల్ భేటీకి మరోమారు ముహూర్తం.. ఈ సారైనా ...

ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ప్రకాశం బ్యారేజ్ కి పోటెత్తడంతో బ్యారేజి నుంచి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారని తెలిపిన దేవినేని అవినాష్, క్రమంగా వస్తున్న వరద ప్రభావం కారణంగానే వివిధ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి అన్నారు .

devineni Avinash says flood affect in vijayawada due to negligence of last govt

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం ముంపు ప్రాంతాల ప్రజల రక్షణ చర్యలు చేపడుతుందని దేవినేని అవినాష్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాటలు తప్ప, చేతలు ఎక్కడా కనపడవని విమర్శనాస్త్రాలు సంధించారు దేవినేని అవినాష్.రిటైనింగ్ వాల్ నిర్మాణం సగంలోనే ఆపేయడంతోనే ప్రస్తుతం ఈ దుస్థితి వచ్చిందని, గత టీడీపీ పాలకుల నిర్లక్ష్య ధోరణి వల్లే తాజా పరిస్థితి అని దేవినేని అవినాష్ మండిపడ్డారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయడానికి డబ్బులు కేటాయించారని గుర్తు చేశారు దేవినేని అవినాష్ .త్వరలోనే వాల్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు వరద కష్టాల నుండి ఉపశమనం కలిగిస్తామని పేర్కొన్నారు దేవినేని అవినాష్. వరద సహాయక చర్యల్లో కార్యకర్తలందరూ ప్రజలకు తోడ్పాటును అందించాలని కోరిన ఆయన టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పై విమర్శలు గుప్పించారు.

English summary
YSRCP East constituency in-charge Devineni Avinash oversaw the situation in several areas in Vijayawada which were submerged due to heavy rains and floods. Devineni Avinash, who was touring the 15th Division in the Krishna Karakatta area, criticized the previous TDP government for flooding the area due to the failure of the previous government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X