• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బెజవాడ రక్తచరిత్ర ముగిసినట్టేనా? రాధా హత్య తర్వాత నెహ్రు సెపరేట్, కారణమిదే!

By Narsimha
|

విజయవాడ: టిడిపి సీనియర్ నాయకుడు దేవినేని నెహ్రు( రాజశేఖర్) అతి చిన్న వయస్సులోనే విజయవాడలో తనకంటూ గుర్తింపును తెచ్చుకొన్నారు.ఒకానొక దశలో ఎన్టీఆర్ కు ధీటుగా సభను ఏర్పాటు చేసి విజయం సాధించిన చరిత్ర దేవినేని నెహ్రుది.

అతి చిన్న వయస్సులోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన దేవినేని నెహ్రు టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అంటే విపరీతంగా అభిమానించేవాడు.1995 లో టిడిపిలో చోటుచేసుకొన్న సంక్షోభ సమయంలో ఆయన ఎన్టీఆర్ వైపే నిలిచారు.

అయితే 1995 లో ఎన్టీఆర్ పక్షాన నిలిచిన ఆయన ఆ తర్వాత టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల టిడిపిలో చేరేనాటికి కూడ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. అయితే తాను చనిపోయేనాటికి టిడిపి జెండా కప్పుకోని చనిపోతానని ఆయన తన సన్నిహితులకు చెప్పేవారు. ఇటీవల కాలంలో ఆయన తన సన్నిహితులతో కలిసి టిడిపిలో చేరారు.

విజయవాడ రాజకీయ చరిత్రలో దేవినేని రాజశేఖర్ చెరగని ముద్రవేశారు. తన కొడుకు అవినాష్ రాజకీయంగా ఉన్నతంగా చూసుకోవాలని నెహ్రు భావించారు.అయితే ఆ కోరిక నెరవేర్చుకొనే క్రమంలోనే నెహ్రు మరణించాడు.

 బెజవాడ రక్తచరిత్రకు శ్రీకారమిలా

బెజవాడ రక్తచరిత్రకు శ్రీకారమిలా

1970 దశకంలో విజయవాడలో సీపీఎం నేత చలసాని వెంకటరత్నం పెద్ద దిక్కుగా ఉండేవాడు. వంగవీటి రాధా అయనకు ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు. అప్పట్లో విజయవాడ రాష్ట్రంలో ప్రధాన వ్యాపార, వాణిజ్యానికి కేంద్రంగా ఉంది.

లక్షలాది మందికి విజయవాడే బతుకుదెరువు. ఇక్కడే కార్మిక సంఘాలపై పట్టు కోసం పోరాటం మొదలైంది.వంగవీటి రాధాతో కలిసి వెంకటరత్నం ఆధిపత్యం చెలాయించేవాడు.

చలసాని వెంకటరత్నం, వంగవీటి రాధా మద్య విభేదాలు

చలసాని వెంకటరత్నం, వంగవీటి రాధా మద్య విభేదాలు

కాలక్రమేణా సీపీఎం నేత చలసాని వెంకటరత్నం ఆయన అనుచరుడు వంగవీటి రాధాల మద్య విభేదాలు వచ్చాయి.దీంతో వంగవీటి రాధా కృష్ణలంక వద్ద టాక్సీస్టాండ్ ఏర్పాటు చేశారు. దీంతో రెండు గ్రూపుల మద్య విభేదాలు తీవ్రమయ్యాయి.ఈ రెండు గ్రూపులు నగరంలోని అన్ని విభాగాల్లో చేతులు పెట్టాయి.

కాలేజీ ఎన్నికలు కూడ కలిసి వచ్చాయి.

కాలేజీ ఎన్నికలు కూడ కలిసి వచ్చాయి.

కాలక్రమేణా సీపీఎం నేత చలసాని వెంకటరత్నం ఆయన అనుచరుడు వంగవీటి రాధాల మద్య విభేదాలు వచ్చాయి.దీంతో వంగవీటి రాధా కృష్ణలంక వద్ద టాక్సీస్టాండ్ ఏర్పాటు చేశారు. దీంతో రెండు గ్రూపుల మద్య విభేదాలు తీవ్రమయ్యాయి.ఈ రెండు గ్రూపులు నగరంలోని అన్ని విభాగాల్లో చేతులు పెట్టాయి.

రాధా హత్యతో స్వంత మార్గాన్ని ఎంచుకొన్న నెహ్రు

రాధా హత్యతో స్వంత మార్గాన్ని ఎంచుకొన్న నెహ్రు

దేవినేని రాజశేఖర్ అంటే తెలియనివారుండొచ్చు. కాని, దేవినేని నెహ్రు అంటే తెలియని వారుండరు విజయవాడలో అని ప్రతీతి.చలసాని, వంగవీటి మధ్య చేలరేగిన ముఠాకక్షల్లో వంగవీటి రాధాకు అనుచరులుగా ఉన్న దేవినేని మురళి, గాంధీలు రాధా హాత్య తర్వాత తమకంటూ ప్రత్యేక మార్గాన్ని ఎంచుకొన్నారు.

రాధా వారసుడిగా రంగా ప్రవేశం

రాధా వారసుడిగా రంగా ప్రవేశం

వంగవీటి రాధా హత్య తర్వాత వంగవీటి రంగా ప్రవేశించారు. అయితే రంగా ప్రవేశంతో దేవినేని నెహ్రు వర్సెస్ వంగవీటి రంగాల మధ్య పోరాటం ప్రారంభమైంది.1979 లో గాంధీ హత్య జరిగింది.

1983 లో ఎన్టీఆర్ టిడిపిని స్థాపించారు. నెహ్రు తన అనుచరులతో కలిసి టిడిపిలో చేరారు. కృష్ణా జిల్లాలో టిడిపి విస్తరణకు కృషి చేశారు. 1983 లో ఆయన కంకిపాడు నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.అయితే ఆయన ప్రత్యర్థిగా ఉన్న రంగా 1985 లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు తీవ్రమయ్యాయి.

హత్యలతో అట్టుడికిన బెజవాడ

హత్యలతో అట్టుడికిన బెజవాడ

1979 లో గాంధీ హత్య జరిగింది.అయితే ఈ హత్యకు ప్రతీకారంగానే కొందరు రంగా అనుచరులను దేవినేని వర్గం హత్య చేయించిందనే ఆరోపణలున్నాయి.అయితే దీనికి ప్రతీకారంగానే రంగా వర్గం మురళీని హత్య చేయించిందనే ఆరోపణలు లేకపోలేదు. ఈ హత్య జరిగిన కొద్దిరోజులకే వంగవీటి రంగా హత్య జరిగింది. ఈ హత్యతో విజయవాడతో పాటు రాష్ట్రం అట్టుడికిపోయింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former minister Devineni Rajasekhar Nehru died of cardiac arrest during early hours on Monday in a hospital in Hyderabad. His death, though unexpected, had brought the faction fights in Vijayawada to an end. Though faction fights of 1970-80s were not seen after the death of his arch rival Vangaveeti Mohana Ranga Rao in December 1988.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more