విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2009లో నెహ్రూ అదృష్టం చేజారింది: అప్పుడు వెక్కి వెక్కి ఏడ్చారు

2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేవినేని నెహ్రూను కేబినెట్లోకి తీసుకోవాలని వైయస్ రాజశేఖర రెడ్డి భావించారు. కానీ నెహ్రూ అప్పుడు ప్రజారాజ్యం పార్టీ నేత యలమంచిలి రవి చేతిలో 150 ఓట్ల తేడాతో ఓడిప

|
Google Oneindia TeluguNews

విజయవాడ: 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేవినేని నెహ్రూను కేబినెట్లోకి తీసుకోవాలని వైయస్ రాజశేఖర రెడ్డి భావించారు. కానీ నెహ్రూ అప్పుడు ప్రజారాజ్యం పార్టీ నేత యలమంచిలి రవి చేతిలో 150 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో ఆయనకు మంత్రి పదవి చేజారింది.

కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం రెండేళ్లుగా ప్రయత్నాలుకొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం రెండేళ్లుగా ప్రయత్నాలు

స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే ఎనలేని అభిమానం. టిడిపిలో పదిహేనేళ్లు, కాంగ్రెస్‌తో 19 ఏళ్ల అనుబంధం ఉంది. నెహ్రూ గెలిచినా, ఓడినా ఒకేరకంగా పని చేస్తారని అంటారు. ఎమ్మెల్యేగా ఉన్నా, లేకపోయినా నెహ్రూ కార్యాలయం నుంచి ఫోన్ వస్తే అధికారులకు హడలే అంటారు.

కాంగ్రెస్ పార్టీలో దాదాపు రెండు దశాబ్దాలు ఉన్న నెహ్రూ.. అక్కడా కీలకమైన నేతగానే ఎదిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి, కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి.. ముఖ్యమంత్రి ఎవరైనా జిల్లాలో పార్టీకి సంబంధించిన, అభివృద్ధికి చెందిన అంశాలలో నెహ్రూ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకునేవారు.

ఆ సమయంలో నెహ్రూ కంటతడి

ఆ సమయంలో నెహ్రూ కంటతడి

తన సోదరులు హత్యకు గురైనప్పుడు దేవినేని నెహ్రూ ఎంతో ఆవేదనకు లోనయ్యారు. సొంత అన్న గాంధీ, తాను ఎంతో ఇష్టపడే తమ్ముడు మురళి హత్యకు గురైన సమయంలో కూడా కంటతడిపెట్టని నెహ్రూ.. టిడిపిని వీడే సమయంలో మాత్రం కంటతడి పెట్టారు.

వెక్కి వెక్కి ఏడ్చారు

వెక్కి వెక్కి ఏడ్చారు

టిడిపిని వీడుతున్నట్లు ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చారు. నాయకులు పార్టీ మారగానే పాత ఆనవాళ్లు కనిపించకుండా చూసుకుంటారు. నెహ్రూ మాత్రం తన కార్యాలయంలో ఎన్టీఆర్‌తో కలిసి దిగిన నిలువెత్తు ఫోటోను అలాగే ఉంచుకున్నారు.

వారు స్నేహితులయ్యారు

వారు స్నేహితులయ్యారు


దేవినేని నెహ్రూ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకులు ఆయన 1996లో తమ పార్టీలో చేరినప్పుడు మిత్రులుగా మారారు. మండలి బుద్ధప్రసాద్, బూరగడ్డ వేదవ్యాస్, పేర్ని నానిలు నెహ్రూకు మిత్రులు అయ్యారు. వైయస్‌కు కూడా దగ్గరయ్యారు.

జీవనశైలి

జీవనశైలి

దేవినేని నెహ్రూ జీవనశెలి విభిన్నంగా ఉండేది. రాత్రి ఎనిమిది గంటల వరకే మధ్యలో నిద్రపోయి, తెల్లవారుజామున రెండున్నర గంటలకు నిద్ర లేచేవారు. లేచిన వెంటనే యోగా, నడక వంటివి చేసేవారు. కొద్ది సంవత్సరాల క్రితం ఆయనకు కిడ్నీ మార్పిడి జరిగింది. అప్పటినుంచి ఆరోగ్యానికి సంబంధించి పలు జాగ్రత్తలు తీసుకునేవారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా నిత్యం క్రమశిక్షణ కలిగిన దినచర్యను పాటించేవారు.

English summary
Telugudesam Party senior leader and Former Minister Devineni Nehru wept when he leave Telugudesam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X