వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"జగన్ పారిపోయారు: ప్రశాంత్ కిశోర్ డైరెక్షన్‌లోనే.. "

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ/ అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావుతో పాటు తెలుగుదేశం నాయకురాలు పంచుమర్తి అనురాధ విరుచుకుపడ్డారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని జగన్ దింపకపోవడంపై అనురాధ వ్యాఖ్యలు చేయగా, జగన్ ప్రజా సంకల్ప యాత్రపై దేవినేని ఉమ విరుచుకుపడ్డారు. జగన్ ప్రజా సమస్యలపై కాకుండా ప్రశాంత్ కిశోర్ డైరెక్షన్‌లో వెళ్తున్నారని ఆయన అన్నారు.

జగన్ అందుకే పారిపోయారు..

జగన్ అందుకే పారిపోయారు..

ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పంచుమర్తి అనురాధ విమర్శించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్‌కు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని అన్నారు. అందుకే కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయారని ఆమె వ్యాఖ్యానించారు.

Recommended Video

YS Jagan Padayatra : దివ్యాంగుల పెన్షను రూ.1500 నుంచి రూ.3000కి
ఆ విషయం జగన్‌కు తెలుసా...

ఆ విషయం జగన్‌కు తెలుసా...

ప్రజాస్వామ్యమంటే ఏమిటో జగన్‌కు, ఆ పార్టీ నాయకులకు తెలుసా అని పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. పోటీ చేయకుండా పారిపోయిన వైసీపీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కులేదని అన్నారు. వైసీపీ దృష్టిలో పారిపోవడమే ప్రజాస్వామ్యమా అని ఆమె అడిగారు. అసెంబ్లీలో కూడా ఉండలేక వైసీపీ పారిపోయిందని అన్నారు.

అధికారం దక్కలేదనే అక్కసుతో..

అధికారం దక్కలేదనే అక్కసుతో..

అధికారం దక్కలేదనే అక్కసుతో ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ విమర్శలు చేయడం సరి కాదని మంత్రి దేవినేని ఉమ అన్నారు. రాష్ట్రంలో వైసీపీ దివాలా తీసిందని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ పథకాలపై ఇలా..

ప్రభుత్వ పథకాలపై ఇలా..

ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను దేవినేని ఉమ మంగళవారం మీడియా సమావేశంలో వివరించారు. జన్మభూమి, మాఊరు, ఇంటింటికి టీడీపీలో అందిన అర్జీలన్నీ జనవరి 2వ తేదీ నుంచి పరిష్కరిస్తామని చెప్పారు.పట్టిసీమ నుంచి 105 టీఎంసీలు కృష్ణా జలాలు రావడంతో రాయలసీమకు ఊరట కలుగుతుందని ఆయన చెప్పారు.

దివాళాకోరు తనమేనని...

దివాళాకోరు తనమేనని...

కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి పోటీ చేయకపోవడం దివాలాకోరుతనమేనని డిప్యూటీ సిఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ అడ్రస్ గల్లంతవుతుందని ఆయన మంగళవారం మీడియాతో అన్నారు. వైసీపీ నిర్ణయంతో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఉన్నాయని, ఒకవేళ ఎన్నిక జరిగితే కేఈ ప్రభాకర్ భారీ మెజార్టీతో గెలుస్తాడని ఆయన అన్నారు.

English summary
Telugu DesamParty (TDP) leader Panchumarthi Anuradha said that YSR Congress party president YS Jagan ran away from Kurnool MLC elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X