వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రివర్స్ టెండరింగా.. రియాలిటీ షోనా? జగన్ డ్రామాలంటూ దేవినేని సెటైర్లు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా నేటికీ పెండింగ్ బిల్లులు చెల్లించలేని చేతకాని ప్రభుత్వమంటూ ధ్వజమెత్తారు.

పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు పనులు ఒకే గుత్తెదారుకు దక్కాయని, వెలిగొండ పనుల టెండరింగ్‌లో రియాలిటీ షో జరుగుతోందని దేవినేని ఆరోపించారు. సీఎం జగన్ ఇంట్లో కూర్చుని డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో దేవినేని ఉమ మీడియాతో మాట్లాడారు.

గోదావరిలో బోటు మునిగి నెలన్నర అయితే.. రాష్ట్రం మునిగి నాలుగున్నర నెలలు అవుతోందని దేవినేని ఎద్దేవా చేశారు. బోటు మునిగి ఇన్ని నెలలైతే సీఎం జగన్ చేతికానితనం.. అసమర్థత వల్లే ఇంకా బయటకు తీయలేకపోయారని విమర్శించారు. గోదావరి గర్భంలో మూడొందల అడుగుల లోతున ఉన్న కొండను తవ్వి కిలోమీటర్ మేర డయాఫ్రం వాల్ కట్టామని చెప్పుకొచ్చారు. ఈ చేతకాని ప్రభుత్వం బోటు బయటకు తీయలేకపోయిందన్నారు.

 devineni Uma fires at CM YS Jagan

ఆప్తులను పోగొట్టుకున్న బాధితులు ప్రమాదం జరిగిన కచ్చులూరు పరిసరాలకు వెళ్లకుండా గోదావరి నదిపై 144 సెక్షన్ పెట్టిన గొప్ప నేత జగన్ అని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. సీఎం ఇంటి వద్ద కూడా ఎప్పుడూ నిసేధాజ్ఞాలు అమల్లో ఉండటం ఇక్కడే చూశామని అన్నారు.

సీఎం సోమవారం ఢిల్లీ వెళ్తున్నారని, అక్కడికి వెళ్లి ఏం మాట్లాడతారో ఎందుకు చెప్పలేకపోతున్నారని దేవినేని ప్రశ్నించారు. సీబీఐ కేసుల గురించి మాట్లాడటానికే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారని ఆయన ఆరోపించారు.

రాత్రి మద్యం షాపులు మూతపడిన తర్వాత వైఎస్సార్సీపీ నేతలు మద్యం విక్రయాలు చేస్తున్నారన్నారు. రైతు భరోసా ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. డబ్బులు పడకుండానే మెసేజ్‌లు పంపుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
వ్యవసాయ శాఖకు భలే మంత్రిని పెట్టారంటూ ఎద్దేవా చేశారు. ఆధార్ కార్డ్, వెబ్‌ల్యాండ్ వివరాల పేరుతో రైతులను తిప్పుతున్నారని దేవినేని ఆరోపించారు.

English summary
TDP senior leader Devineni Umamaheswara Rao on Sunday fired at CM YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X