• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ రెడ్డి నీకు అదే పనా! చంద్రబాబును అరెస్ట్ చేస్తావా?: దేవినేని ఉమ తీవ్ర హెచ్చరికలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుట్ర, కుతంత్రాలే ఎజెండాగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఆయనప్రభుత్వం, లక్షలాది విద్యార్థులకు విద్యాబుద్ధులునేర్పిస్తున్న నారాయణ విద్యాసంస్థల అధిపతిని లక్ష్యంగా చేసుకుందన్నారు దేవినేని ఉమ. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

జగన్ రెడ్డి తీరు అలానే ఉంది... : దేవినేని ఉమ

జగన్ రెడ్డి తీరు అలానే ఉంది... : దేవినేని ఉమ

తిరుపతి సభలో ముఖ్యమంత్రి మాట్లాడాకే పేపర్ లీక్ ఘటనపై ప్రభుత్వంలో చలనం వచ్చిందని, అంతకుముందు మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో ఎక్కడా పేపర్ లీక్ కాలేదన్నాడని దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. నారాయణపై పెట్టిన కేసులు పరిశీలిస్తే తొలుత చిత్తూరులో కేసు నమోదైనప్పుడు సెక్షన్ 408 నమోదుచేశారు... తరువాత సెక్షన్ 409 యాడ్ చేశారు. టీడీపీనేతలెవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి నేను బురదజల్లుతాను.. మీరు కడుక్కుంటూ ఉండండి అన్నట్లే వ్యవహరిస్తున్నాడు. అచ్చెన్నాయుడు, అశోక్ బాబుసహా, ఇప్పుడు నారాయణపై నమోదుచేసిన కేసులన్నీ తప్పుడుకేసులే అని దేవినేని ఉమ అన్నారు.

జగన్ జైల్లో ఉంటే.. అందరూ ఉండాలా?: దేవినేని ఉమ

జగన్ జైల్లో ఉంటే.. అందరూ ఉండాలా?: దేవినేని ఉమ

తాను 16నెలలు జైల్లో ఉండి వచ్చాడు కాబట్టి, అందరూ జైల్లో ఉండాలి.. అన్నట్టుగా జగన్ రెడ్డి తీరు ఉంది. ఒక పక్క రాష్ట్రంపై తుఫాన్ ప్రభావం పడింది. చాలాప్రాంతాల్లో అకాల వర్షాలు, ఈదురుగాలులకు పంటలు దెబ్బతిన్నాయి. అరటి, బొప్పాయి, మామిడి, కూరగాయల పంటలన్నీ నేలమట్టమయ్యాయి. జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి కనీసం అరగంట కూడా అధికారులతో సమీక్షచేయలేదు. కేబినెట్లోని మంత్రుల్లో ఒక్కమంత్రికూడా రైతుల వద్దకెళ్లి పరామర్శించి, ఎంత నష్టంజరిగిందని ఆరా తీసింది లేదు. తుఫాన్ నష్ట నివారణ చర్యలు తీసుకోవడంగానీ, రైతాంగాన్ని ముందస్తగా అప్రమత్తంచేయడంగానీ చేయలేదు. అసలు ఈ ముఖ్యమంత్రికి, మంత్రులకు బుద్ధి,జ్ఞానం, సిగ్గు,శరం ఉన్నాయా? అని దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.

తెలుగు ప్రైడ్ చంద్రబాబుకి నోటీసులా?: దేవినేని ఉమ వార్నింగ్

తెలుగు ప్రైడ్ చంద్రబాబుకి నోటీసులా?: దేవినేని ఉమ వార్నింగ్

జగన్మోహన్ రెడ్డి, ఆయనమంత్రుల తాపత్రయమంతా.. ఎవరిని తిట్టాలి, ఎవరిపై తప్పుడు కేసులుపెట్టాలనే తప్ప.. ప్రజల కష్టసుఖాలపై లేదు. జగన్మోహన్ రెడ్డి అసలు నీకు బుద్ధుందా...? తెలుగుజాతి గర్వపడే వ్యక్తి, తెలుగుప్రైడ్ అయిన చంద్రబాబుకి నోటీసులుఇస్తావా? ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఖ్యాతి ఇనుమడింపచేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తిని ఏదోచేయాలనుకుంటే నువ్వే నష్టపోతావు జగన్ రెడ్డి. తప్పుడు పనులుచేయాలని చూస్తే జగన్ రెడ్డి.. 60లక్షలమంది కార్యకర్తలు రోడ్లపైకి వస్తారు. అదిగుర్తుంచుకో... అని దేవినేని ఉమ హెచ్చరించారు.

జగన్ రెడ్డి ఆ పనులకు స్వస్తి చెప్పు.. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి..

జగన్ రెడ్డి ఆ పనులకు స్వస్తి చెప్పు.. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి..

తప్పుడు పనులు, 420 పనులకు స్వస్తిచెప్పు. నీ పాలనా వైఫల్యాన్ని, పరీక్షలు నిర్వహించలేని నీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబుపై కేసులుపెడతావా జగన్ రెడ్డి? హెరిటేజ్ సంస్థపై కేసులు పెడతావా? ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కడుంది..హెరిటేజ్ సంస్థ భూమి ఎక్కడుంది? ఎవరో పనికిమాలినవాడు ఫిర్యాదుచేశాడని తప్పుడుకేసులతో నోటీసులిస్తావా? కోర్టుతీర్పులు అసలు చదువుతున్నావా జగన్ రెడ్డి? ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై హైకోర్ట్ గతంలో ఏమని తీర్పుఇచ్చింది? బుద్ధి, జ్ఞానంలేకుండా పనులుచేస్తున్నావు జగన్ రెడ్డి. నీ అతితెలివితేటలు, తప్పుడు నిర్ణ యాలు, తప్పుడు ఫిర్యాదులు కట్టిపెట్టు. నాకు నచ్చినట్టేచేస్తాను... నాకు నచ్చనివారికి నోటీ సులిస్తాను, జైలుకుపంపుతాను అంటే 60లక్షల మంది కార్యకర్తల ఆగ్రహం చవిచూస్తావు జగన్ రెడ్డి.... గుర్తుంచుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు దేవినేని ఉమామహేశ్వరరావు.

English summary
Devineni Uma maheswara rao slams ap cm ys jagan for chandrababu case issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X