విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భక్తులు జైల్లో.. అరాచకశక్తులు బయట?: మాజీమంత్రి దేవినేని ఉమ ఫైర్..

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వంపై మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఎన్నడూ లేనివిధంగా వింత ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. భక్తులు జైల్లో ఉంటే అరాచకశక్తులు రోడ్లపై తిరుగుతున్నారని ఆరోపించారు. ఏడాది కాలంలో జగన్ సర్కార్ చేసిన అరాచకాలను ఎండగట్టారు. టీడీపీ నేతల వేధింపులే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేస్తున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

వినాయక చవితి వేడుకలకు కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించిందని గుర్తుచేశారు. కానీ కొందరు ప్రభుత్వ పెద్దల పుట్టినరోజు వేడుకలకు మాత్రం ప్రోత్సాహకాలు ఇస్తారా అని దేవినేని ప్రశ్నించారు. జీవోలు ఇచ్చి హడావిడి చేయడం ఏంటీ అని అడిగారు. ఇదీ సరికాదు అని.. తీరు మార్చుకోవాలని కోరారు. దీంతోపాటు ఆలయ ఘటనలను దేవినేని ప్రస్తావించారు. ఆలయ ధ్వంసానికి సంబంధించి ఘటనలను సీఎం జగన్ ఎందుకు ఖండించడం లేదు అని అడిగారు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని దేవినేని ఉమ అడిగారు.

devineni uma slams ys jagan govt..

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఘటనుల జరుగుతున్నాయని తెలిపారు. దాదాపు 80 ఘటనలు జరిగాయన్నారు. తొలుత సీఎం జగన్ కఠిన చర్యలు తీసుకుంటే ఘటనలు జరిగేవీ కావన్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో వెండి ఉత్సవ రథంపై మూడు వెండి సింహాలు చోరీకి గురైన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందూ సంఘాలు కూడా ధ్వజమెత్తారు.

ఇటీవల అంతర్వేది రథం దగ్ధమయిన సంగతి తెలిసిందే. దానిపై సీబీఐ విచారణకు ఆదేశించారో లేదో.. అమ్మవారి వెండి సింహాలు అపహరణకు గురయ్యారు. దీంతోపాటు నిన్న సాయిబాబ విగ్రహాం, ఇవాళ హనుమాన్ విగ్రహా ధ్వంసమయ్యాయి. దీంతో హిందూసంస్థలు భగ్గుమంటున్నాయి.

Recommended Video

Japan : ఎనిమిదేళ్ల తరువాత Japan నూతన ప్రధానమంత్రి గా Yoshihide Suga ఘన విజయం! || Oneindia Telugu

English summary
ex minister devineni uma maheshwar rao slams ys jagan mohan reddy government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X