వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి కొడాలి నానీ శాఖను టార్గెట్ చేసిన దేవినేని ఉమా .. అప్పులు, తప్పులు , ఆపై బూతులు అంటూ ఫైర్

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి దేవినేని ఉమా మంత్రి కొడాలి నాని శాఖపై విమర్శల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖను నిండా అప్పుల్లో ముంచారని టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఒక పోస్ట్ ట్వీట్ చేసిన దేవినేని ఉమా ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోని 16 వేల కోట్ల అప్పుల భారం పౌరసరఫరాల కార్పొరేషన్ పై పడిందని పేర్కొన్నారు.

చంద్రబాబు పెట్టిన భిక్షతో ఎదిగి ఫేక్ సీఎం కోసం గాలి మాటలా ..కొడాలి నానీ పై దేవినేని ఉమా ఫైర్చంద్రబాబు పెట్టిన భిక్షతో ఎదిగి ఫేక్ సీఎం కోసం గాలి మాటలా ..కొడాలి నానీ పై దేవినేని ఉమా ఫైర్

పౌర సరఫరాల కార్పోరేషన్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా అప్పు

పౌర సరఫరాల కార్పోరేషన్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా అప్పు

పౌర సరఫరాల కార్పోరేషన్ చరిత్రలో ఇంత అప్పు ఎప్పుడూ చేయలేదని ఇది మొదటిసారి అని పేర్కొన్న దేవినేని ఉమా, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నారు అంటూ మండిపడ్డారు.

ఇప్పటికే మొత్తం అప్పుల భారం 26 వేల కోట్ల రూపాయలుగా ఉందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రానికి ముందు ముందు అప్పులిచ్చే వారెవరూ అంటూ దేవినేని ఉమా ప్రశ్నించారు . పౌరసరఫరాల శాఖ వర్గాలు కూడా దీనిపై ఆందోళనలో ఉన్నాయని ప్రస్తావించిన దేవినేని ఉమ ఇదేనా మీ పరిపాలన అని ప్రశ్నించారు.

ఏడాదిన్నర లోనే 16 వేల కోట్ల రూపాయలు అప్పు

ఏడాదిన్నర లోనే 16 వేల కోట్ల రూపాయలు అప్పు

మద్దతు ధరకు పంట కొనుగోలు చేయకుండా రైతులను దళారుల పాలు చేశారంటూ దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసరఫరాల శాఖ లో ఏడాదిన్నర లోనే 16 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. రైతుల వద్ద మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయకుండా మోసం చేస్తూ వ్యవహరించడం సరికాదన్నారు. రైతుల వద్ద ఉన్న ధాన్యానికి 813 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేదని దేవినేని ఉమా ఈ సందర్భంగా ప్రస్తావించారు.

 అప్పులు, తప్పులను కప్పిపుచ్చుకోవటం కోసం బూతులు .. ఇది అసమర్ధత కాదా జగన్

అప్పులు, తప్పులను కప్పిపుచ్చుకోవటం కోసం బూతులు .. ఇది అసమర్ధత కాదా జగన్

మితిమీరిన అప్పులు చేస్తున్న ప్రభుత్వం, తప్పుల మీద తప్పులు చేస్తోందని, ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బూతులు ప్రయోగిస్తుందని.. ఇది అసమర్ధత కాదా వైయస్ జగన్ అంటూ దేవినేని ఉమ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఇంతకు ముందు కూడా దేవినేని ఉమా తెలుగుదేశం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడంపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. కొడాలి నాని మాటలు గాలి మాటలని మాజీ మంత్రి దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. ఇప్పుడు తప్పులు చేస్తూ బూతులతో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు .

దేవినేని వ్యాఖ్యలపై కొడాలి నానీ స్పందన ఏంటో ?

దేవినేని వ్యాఖ్యలపై కొడాలి నానీ స్పందన ఏంటో ?

సహజంగానే టీడీపీ అధినేత చంద్రబాబు, టిడిపి నాయకులు అంటే ఒంటికాలిమీద లేచే కొడాలి నాని శాఖపై, అందులో పేరుకుపోయిన అప్పులపై దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్ట్ నేపథ్యంలో కొడాలి నాని ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఏ చిన్న అవకాశం దొరికినా టీడీపీ నేతలను తిట్టిపోసే కొడాలి నానీ దేవినేని తాజా వ్యాఖ్యలపై బాగా ఘాటుగానే స్పందించే అవకాశం ఉంది.

English summary
Former minister Devineni Uma has criticised Minister Kodali Nani's department. TDP senior leader and former minister Devineni Umamaheswara Rao has criticized the Andhra Pradesh state for drowning the Civil Supplies Department in debt. Devineni Uma tweeted in a post on Twitter that the debt burden of Rs 16,000 crore had fallen on the Civil Supplies Corporation during the year and a half since the YCP came to power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X