India
  • search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్, అంబటి వల్లే పోలవరానికీ దుస్దితి-అక్రమాలు తేలితే మళ్లీ జైలుకే-దేవినేని కామెంట్స్

|
Google Oneindia TeluguNews

విజయవాడ : ఏపీలో పోలవరం ప్రాజెక్టుపై రాజకీయ పార్టీల రగడ ప్రారంభమై 8 ఏళ్లు దాటిపోయింది. అయినా ఇప్పటికీ ప్రాజెక్టు పూర్తికాకపోగా రగడ మాత్రం కొనసాగుతోంది. ఇవాళ మరోసారి టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ పోలవరం ప్రాజెక్టు దుస్ధితికి సీఎం వైఎస్ జగన్, జలవనరులమంత్రి అంబటి రాంబాబే కారణమని విమర్శించారు.

ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం డ్యామ్ స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, ల్యాండ్ ఎక్విజేషన్, ఆర్ అండ్ ఆర్ పనులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అని వైసీపీ సర్కార్ కు మాజీ మంత్రి దేవినేని ఉమ సవాల్ విసిరారు. జగన్, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి కలిసి పోలవరం ప్రాజెక్టుకు దుర్గతి పట్టించారని ఆరోపించారు. వీటితోపాటు టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్ల శ్వేతపత్రం కూడా విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం వద్ద అన్ని రికార్డులు సిద్ధంగా ఉంటాయి కావున శ్వేతపత్రం విడుదల చేయడం పెద్ద కష్టమేమీ కాదన్నారు.

devineni uma warns ys jagan to go to prison again if polavaram irregularities proved

పోలవరం ప్రాజెక్టు అథారిటి మినిట్స్ లో పోలవరం నిర్మాణంలో జరగబోయే అనర్థాలను వివరించారని దేవినేని ఉమ తెలిపారు. వాటి గురించి మంత్రి రాంబాబు మాట్లాడాలని కోరారు.. రంపచోడవరం నిర్వాసితుల రికార్డులు తారుమారు చేసి కోట్లాది రూపాయలు పందికొక్కుల్లా తిన్నారని ఆయన ఆరోపింెచారు. రంపచోడవరంలో నిర్వాసితుల గురించి మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి జాయింట్ కలెక్టర్ కు విన్నవించినా ఫలితం శూన్యమన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నాక పోలవరం డ్యామ్ పూర్తవుతుందని ముఖ్యమంత్రి డెడ్ లైన్ ఎలా పెడతారని దేవినేని ప్రశ్నించారు. ఇలా పెట్టడంలో అర్థంలేదన్నారు.

గత మూడునెలలుగా పోలవరం నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్సీ నాయకత్వంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి పోలవరం నిర్వాసితులు డబ్బులు పందికొక్కుల్లా తిన్నారని మాజీ మంత్రి విమర్శించారు.. రంపచోడవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి నిరాహార దీక్ష చేసినా పట్టించుకోలేదు. నష్టపోయినవారి వివరాలను స్వయంగా నేనే సంబంధిత ప్రభుత్వ అధికారులకు అందించినా ఫలితం శూన్యం. మంత్రి రాంబాబు చంద్రబాబును విమర్శించడం కాదు పోలవరంపై మాట్లాడాలన్నారు.

టీడీపీ హయాంలో పోలవరం పట్టిసీమలో ఎటువంటి తప్పిదాలు లేవని, సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ కు అనుగుణంగా, రాష్ట్ర జల వనరుల శాఖలో ఉన్న చట్టాలకు అనుగుణంగా పనులు జరిగాయని కేంద్ర జలవనరుల శాఖ మంత్రే రాష్ట్ర జలవనరుల శాఖకు లేఖ రాశారని దేవినేని గుర్తుచేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రే పార్లమెంటు, రాజ్యసభకు చెప్పారన్నారు. పెంటపాటి పుల్లారావు అనే వ్యక్తి ఉత్తరం రాస్తే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఇదే సమాధానం వచ్చిందన్నారు. పోలవరం పట్టిసీమలో ఎటువంటి తప్పిదాలు జరగలేదని కేంద్రమే తేల్చిందన్నారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన రోజే పోలవరం పనుల్ని ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశారని, పనులు చేయడానికి స్పిల్ వే, ఎర్త్ రాక్ ఫీల్ డ్యాం పనులు, పవర్ ప్రాజెక్టు పనులు కలిపి అప్ లోడ్ చేయడం జరిగిందన్నారు.

రాజశేఖర్ రెడ్డి పార్టీ ఫామ్ లో ఉండగానే జగన్ రెడ్డి పోలవరం నిర్మాణం కోసం వచ్చిన కాంట్రాక్టర్లతో చర్చలు జరిపారని దేవినేని గుర్తుచేశారు. పోలవరం కాంట్రాక్టర్లతో చర్చలు జరపడం చూసి అందరూ ఆశ్చర్యపోయారన్నారు. ఈ పాపం నాకొద్దు అని రోశయ్య పోలవరం పనులను రద్దు చేశారన్నారు. మళ్లీ కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో వాయిదాలు పడి క్యాన్సిల్ అయిందన్నారు. 2009 నుంచి 2013కి టెండర్లు ఫైల్ అయి కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్రాన్స్ అయి 5 సంవత్సరాలు పనులు ఇచ్చి సుమారు 3 వేల కోట్లు మళ్లీ ఖర్చు పెంచారన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా అనేక తప్పిదాలు జరిగాయని, గతంలో రెండు సంఘటనలు జరిగాయని, నాలుగు సంవత్సరాలు ప్రాజెక్టు నిర్మాణంలో గడచిపోయాయి, ఇప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆగస్టు 16, 2019లో పీపీఐ సీఈఓ జెయిన్ పోలవరం ప్రాజెక్టు అథారిటి స్పష్టంగా ఇటీవల చెప్పిందని దేవినేని తెలిపారు. ఇవన్నీ చదవకుండా రాంబాబు ఎప్పటివో మినిట్స్ చదువుతున్నారన్నారు.. రాంబాబు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయని,తెలివితక్కువతనంగా మాట్లాడొద్దని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు.

English summary
former tdp minister devineni uma on today slams ys jagan and ambati rambabu for their negligence on polavaram project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X