వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ హీరోయిన్..ఇద్దరు యాంకర్లు లక్ష్యంగా: డీజీజీఐ అధికారులు సోదాలు: ఆ పెట్టుబడులపైనే..!

|
Google Oneindia TeluguNews

ప్రముఖ సినీ హీరోయిన్ తో పాటుగా ఇద్దరు ప్రముఖ యాంకర్ల నివాసాల్లో సోదాలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రముఖ సినీ నటి లావణ్య త్రిపాఠితో పాటుగా ప్రముఖ యాంకర్లు సుమ కనకాల.. అనసూయ భరద్వాజ్‌ ఇళ్లలో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. తొలుత హీరోయిన్ లావణ్య త్రిపాఠీ నివాసంలో సోదాలు జరుగుతున్న విషయం బయటకు వచ్చింది. ఆ తరువాత ఈ ఇద్దరు యాంకర్ల నివాసాల్లో నూ సోదాలు చేసిన విషయం అధికారుల ద్వారా తెలిసింది. అయితే, వీరు ముగ్గురూ కోట్లాది రూపాయాలుగా చెల్లించాల్సిన సర్వీసు టాక్స్..జీఎస్టీ చెల్లించకుండా ఎగ్గొట్టారనే ఆరోపణలతో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే, సుదీర్ఘంగా కొనసాగిన ఈ సోదాల్లో ఏం తేల్చారనేది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది.

జీఎస్టీ అధికారుల సోదాల కలకలం
సర్వీస్‌ ట్యాక్స్‌.. జీఎస్టీనీ ఎగ్గొట్టిన కేసులకు సంబంధించి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ) అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. పూర్తి సమాచారం ఆధారంగా ఈ తనిఖీలు నిర్వహిచినట్లు తెలుస్తోంది. ప్రముఖ సినీ నటి లావణ్య త్రిపాఠితో పాటుగా ప్రముఖ యాంకర్లు సుమ కనకాల.. అనసూయ భరద్వాజ్‌ ఇళ్లతో పాటు నగరంలోని మొత్తం 23 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రూ.కోట్లలో సర్వీస్‌ ట్యాక్స్‌, జీఎఎస్టీనీ ఎగ్గొట్టారన్న ఆరోపణలతో సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లోని లావణ్య ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాలు జరుగుతున్న విషయం తెలుసుకున్న ఆమె సినిమా షూటింగ్‌ను రద్దు చేసుకుని ఇంటికి చేరుకున్నారు.

DGGi raids on actress and anchors

ఆ ఇద్దరు యాంకర్లు సైతం..
తొలుత లావణ్య త్రిపాఠీ నివాసంలోనే సోదాలు సాగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ, అదే సమయంలో మణికొండలోని యాంకర్‌ సుమ కనకాల, బంజారాహిల్స్‌లోని అనసూయ భరద్వాజ్‌ ఇళ్లలో తనిఖీ చేశారు. సినీ నటి, యాంకర్ల ఇళ్లతో పాటు నగరంలోని చిట్‌ఫండ్‌ కంపెనీలు, కోల్డ్‌ స్టోరేజీ యూనిట్లు, భవన నిర్మాణ సంస్థలు, సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీలు, ఫిట్‌నెస్‌ సెంటర్లు, ఫైనాన్షి యల్‌ సర్వీసెస్‌, ఎంటర్‌టెయిన్‌మెంట్‌ తదితర 23 సంస్థల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. అయితే, ఈ ముగ్గురి నివాసాల్లో సోదాల పైన అధికారులు కీలక సమాచారం సేకరించినట్లుగా చెబుతున్నారు. కొన్ని సంస్థల్లో లావణ్య త్రిపాఠి.. సుమ.. అనసూయ పెట్టుబడులు పెట్టారని.. ఆ సంస్థలపై సర్వీస్‌ ట్యాక్స్‌, జీఎ్‌సటీ ఎగ్గొట్టిన ఆరోపణలున్నట్లు సమాచారం. ఆ సంస్థల్లో సోదాల్లో భాగంగానే లావణ్య త్రిపాఠి తో పాటుగా సుమ.. అనసూయ ఇళ్లలో సోదాలు జరిగినట్లు సమాచారం. అయితే, ఈ సోదాల పైన వీరు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.

English summary
Directorate general of GST Intelligence officers raids on famous actress Lavanya Tripathi and Telugu anchors Suma and Anasuya houses on complaint of non paying taxes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X