వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రాజకీయ పార్టీది మీడియా షో: విమర్శలు సరికావు: టీడీపీపై డీజీపీ పరోక్ష వ్యాఖ్యలు..!

|
Google Oneindia TeluguNews

ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. కొద్ది రోజులుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు..టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు పార్టీ పేరు ప్రస్తావించకుండానే డీజీపీ సమాధానం ఇచ్చారు. తాను ప్రజా సేవకుడిని మాత్రమేనని..తనకు రాజకీయంగా ఎటువంటి పాత్ర లేదని డీజీపీ స్పష్టం చేసారు. ఆ పార్టీది మీడియా షో అంటూ వ్యాఖ్యానించారు. తనకు లేఖ రాశామంటూ మీడియాకు విడుదల చేస్తున్నారని.. ఆ తరువాత ఆ లేఖను ఆ పార్టీ నాయకులు అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. పోలీసుల పైన ఆ పార్టీ నాయకులు చేస్తున్నవి రాజకీయపరమైన ప్రకటనలు గానే భావిస్తున్నానని డీజీపీ చెప్పారు. తమ వద్దకు వచ్చిన ఏ అంశం పైనైనా తగిన చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ స్పష్టం చేసారు.

టీడీపీ మాజీమంత్రి స్వగ్రామంలో ఎక్సైజ్ దాడులు: నిషేధం ఉన్నా.. అక్కడ మాత్రం విచ్చలవిడిగా!టీడీపీ మాజీమంత్రి స్వగ్రామంలో ఎక్సైజ్ దాడులు: నిషేధం ఉన్నా.. అక్కడ మాత్రం విచ్చలవిడిగా!

మీడియాకు ఇచ్చిన తరువాతనే ..మాకు
తన మీద ..కొందరు పోలీసు అధికారుల మీద టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు డీజీపీ గౌతం సవాంగ్ సమాధానమిచ్చారు. ఎక్కడా పార్టీ పేర్లు ప్రస్తావించకుండా స్పందించారు. పోలీసుల పై విమర్శలు చేస్తున్న ఓ పార్టీది మీడియా షో అని వ్యాఖ్యానించారు. తొలుత ఆ పార్టీ డీజీపీకి లేఖ రాశామంటూ ఆ లేఖను మీడియాకు విడుదల చేసి.. రెండు మూడు రోజుల తరువాత ఆ లేఖను తనకు ఆ పార్టీ నాయకులు అందిస్తున్నారని వివరించారు. అందులోని అంశఆలన్నీ అంతకు ముందే మీడియాలో..సోషల్ మీడియాలో చదవినవేనని వివరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే కలిసే అవకాశమిస్తున్నానని .. ప్రతిపక్ష నాయకులకు ఇవ్వటం లేదని ఆ పార్టీ చేస్తున్న విమర్శలు సరి కావని ఖండించారు.

DGP Goutam Sawang indirectly reacted on TDP allegations on him and department

రాజకీయంగా ఎలాంటి పాత్ర లేదు..
తమ పైన విమర్శలు చేస్తున్న పార్టీకి చెందిన నేతలు రెండు మూడు సార్లు వచ్చి కలిశారని చెప్పుకొచ్చారు. ఇటీవల వారు వచ్చిన సమయంలో తాను తన ఛాంబర్ లో లేకపోవటం త బ్యాడ్ లక్ అన్నారు. ఆ సమయంలో వేరే సమావేశాల్లో ఉన్నానని వివరించారు. తాను వినయపూర్వక ప్రజా సేవకుడినని.. అంతకు మించి రాజకీయంగా తనకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేసారు. తమపై విమర్శలు చేస్తున్న పార్టీతో వాదించాలనుకోవటం లేదన్నారు. పోలీసుల పైన ఆ పార్టీ నాయకులు చేస్తున్నవి రాజకీయ పరమైన అంశాలుగానే భావిస్తుమని చెప్పారు. తమ వద్దకు వచ్చిన ఏ అంశం పైనైనా తగిన చర్యలు తీసుకుంటున్నా మంటూ డీజీపీ వివరించారు. ఇప్పుడు డీజీపీ చేసిన వ్యాఖ్యల మీద టీడీపీ నేతలు సైతం స్పందించే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా డీజీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకే ఇప్పుడు ఆయన స్పందించినట్లుగా కనిపిస్తోంది.

English summary
DGP Goutam Sawang indirectly reacted on TDP allegations on him and department. He said that he is only public servent..but, no link with politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X