వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'వంగవీటి విగ్రహం కూల్చివేతపై విచారణ.. ప్రతీ ఫ్లెక్సీకి భద్రత కష్టం'

సీసీటీవి ఫుటేజీ ఆధారంగా ఫ్లెక్సీలు, విగ్రహాల ధ్వంసానికి పాల్పడినవారిని గుర్తిస్తామని తెలిపారు,

|
Google Oneindia TeluguNews

విజయవాడ: సోమవారం తెల్లవారుజామున సినీ హీరో చిరంజీవి, కాపు నేత వంగవీటి రంగా ఫ్లెక్సీలను గుర్తుత తెలియని వ్యక్తులు చించేసిన సంగతి తెలిసిందే. దీనిపై అభిమానులు, మద్దతుదారుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ముఖ్యంగా విజయవాడలోని సింగ్ నగర్ లో రంగా విగ్రహం కూల్చివేతతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

DGP Sambasiva Rao on flexi conflict of Vangaveeti and Chiru

ఈ నేపథ్యంలో ఫ్లెక్సీ ఘటనలపై ఏపీ డీజీపీ సాంబశివరావు స్పందించారు. విగ్రహ కూల్చివేత ఘటనపై విచారణ జరుపుతున్నామని అన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీకి తావివ్వబోమని చెప్పారు. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా ఫ్లెక్సీలు, విగ్రహాల ధ్వంసానికి పాల్పడినవారిని గుర్తిస్తామని తెలిపారు,

ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇక ప్రతీ ఫ్లెక్సీకి భద్రత ఏర్పాటు చేయడం కూడా కుదరదని, అంతమంది భద్రతా సిబ్బంది కూడా తమవద్ద లేరని డీజీపీ స్పష్టం చేశారు.

English summary
AP DGP Sambashivarao responded over Flexies conflict of Vangaveeti and chiru in vijayawada
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X