వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డీజీపీ అత్య‌వ‌స‌ర స‌మావేశం: నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌లు : అప్ర‌మ‌త్తంగా ఉండండి..!

|
Google Oneindia TeluguNews

ఏపీ డీజీపీ ఠాకూర్ రాష్ట్ర పోలీసు అధికారుల‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు. కేంద్ర నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ఈ స‌మావేశం ఏర్పాటు చేసారు. తీవ్ర వాదుల హెచ్చ‌రిక‌లు..తీసుకోవాల్సిన ముంద‌స్తు చ‌ర్య‌ల గురించి ఈ స‌మావేశంలో చ‌ర్చించారు. భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించారు.

భ‌ద్ర‌త పెంచండి...
కేంద్ర నిఘా వ‌ర్గాల తాజా హెచ్చ‌రిక‌ల‌తో ఏపీ డీజీపీ ఠాకూర్ అధికారుల‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేసారు. జిల్లా ఎస్పీల‌తో పాటుగా పోలీసు క‌మిష‌న‌ర్లు..ఉన్న‌తాధికారుల‌తో వీడియో కాన్పిరెన్స్ నిర్వ‌హించారు. భ‌ద్ర‌త‌కు సంబంధించి ప‌లు సూచ‌న‌లు చేసారు. ఇస్లామిక్‌, తీవ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను గుర్తించి, అక్కడ భద్రతను పెంచాలని ఆదేశించారు. శ్రీలంకలో ఉగ్రదాడుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయాలని.. వాహనాలు, హోటళ్లలో తనిఖీలు పెంచాలని సూచించారు. ఎక్కడైనా భద్రతా లోపాలుంటే నెల రోజుల్లో సరిచేయాలని.. నెల రోజుల తర్వాత మళ్లీ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

DGP Thakur call or emergency meeting with officers : ordered for precautionary steps

కౌంటింగ్ ఏర్పాట్ల‌పైనా చ‌ర్చ‌..
ఇదే సమావేశంలో డీజీపీ ఎన్నిక‌ల కౌటింగ్ కోసం తీసుకోవాల్సిన చ‌ర్య‌ల పైనా చ‌ర్చించారు. ప్ర‌ధానంగా సున్నిత ప్రాంతాల్లో ఏ ర‌క‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని ఆరా తీసారు. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర భద్రత.. కౌంటింగ్ బందోబస్తు తదితర చర్యలపై చర్చించారు. ఎన్నిక‌ల పోలింగ్ నాడు జ‌రిగిన ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకొని కౌంటింగ్ నాడు మాత్రం ఎటువంటి ఘ‌ట‌న‌ల‌కు అవ‌కాశం లేకుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. కౌంటింగ్ ముందుగానే నియోక‌వ‌ర్గాల వారీగా కౌంటింగ్ సెంట‌ర్ల వారీగా..భ‌ద్ర‌త‌ను ప్ర‌ణాళికా బ‌ద్దం సిద్దం చేసుకోవాల‌ని డీజీపీ సూచించారు. శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో ఖ‌ఠినంగా ఉండాల‌ని ఆదేశించారు.

English summary
AP DGP called for emergency meeting with departmental Officers. DGP ordered officers that must take precautionary steps for Counting day. mobile summary
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X