వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరంతా రావాల్సిందే: చంద్రబాబుకు మహారాష్ట్ర కోర్టు షాక్, ఆ ముగ్గురికి రిలీఫ్

|
Google Oneindia TeluguNews

Recommended Video

మీరంతా రావాల్సిందే.. చంద్రబాబుకు మహారాష్ట్ర కోర్టు షాక్

అమరావతి/హైదరాబాద్/ధర్మాబాద్: బాబ్లీ ప్రాజెక్టు కేసుకు సంబంధించి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టులో శుక్రవారం (21-09-2018) విచారణ జరిగింది. నాన్ బెయిలబుల్ వారెంట్ అందుకున్న వారు కోర్టుకు రావాల్సిందేనని న్యాయస్థానం ఏపీ సీఎం చంద్రబాబుకు షాకిచ్చింది.

కోర్టుకు హాజరైన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు బెయిల్ లభించింది. తెలంగాణకు చెందిన గంగుల కమలాకర్, ప్రకాశ్ గౌడ్, కేఎస్ రత్నంలకు బెయిల్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు.

కోర్టుకు రావాల్సిందే

కోర్టుకు రావాల్సిందే

చంద్రబాబు తరఫు న్యాయవాదులు నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు కోరుతూ రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు కోర్టుకు హాజరయ్యేందుకు సమయం లేనందున తన న్యాయవాదిని పంపించారు చంద్రబాబు. చంద్రబాబు తరఫున లాయర్ జీ సుబ్బారావు రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే నోటీసులు అందుకున్న వారు రావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. అనంతరం విచారణను అక్టోబర్ 15వ తేదీకి వాయిదా వేసింది.

చంద్రబాబు సహా 16 మందికి

చంద్రబాబు సహా 16 మందికి

చంద్రబాబు నాయుడు సహా 16 మందికి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ఇటీవల నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. బాబ్లీ ప్రాజక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికి గాను ఈ వారెంటును జారీ చేసింది. ఈ నెల 21వ తేదీ లోపు చంద్రబాబుతో పాటు అందరూ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

కలకలం: బాబుకు మహారాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్, ఈ 15 మందికీ, కారణం ఇదే కలకలం: బాబుకు మహారాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్, ఈ 15 మందికీ, కారణం ఇదే

నాడు ఏం జరిగిందంటే?

నాడు ఏం జరిగిందంటే?


2010లో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ అప్పుడు పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తెలంగాణ సరిహద్దు దాటి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లడానికి ప్రయత్నాలు చేశారు. దీంతో చంద్రబాబుతో పాటు 40 మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నాన్ బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు.

బలవంతంగా తరలింపు

బలవంతంగా తరలింపు

బార్డర్ దాటడంతో మహారాష్ట్ర పోలీసులు అప్పట్లో టీడీపీ నేతలను బలవంతంగా బస్సులో ఎక్కించారు. ధర్మాబాద్ నుంచి ఔరంగబాద్ ఎయిర్ పోర్టుకు తీసుకు వెళ్లారు. వారు అనుమతి లేకుండా ప్రాజెక్టు వద్దకు వచ్చారని తరలించారు. ఈ బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేసిన పోరాటానికి సంబంధించి ఈ అరెస్ట్ వారెంట్ వచ్చింది. నాడు చంద్రబాబు సహా పలువురిపై లాఠీచార్జ్ జరిగింది.

నాన్ బెయిలబుల్ వారెంట్

నాన్ బెయిలబుల్ వారెంట్

నాటి నుంచి ఈ కేసు ధర్మాబాద్‌ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల మహారాష్ట్ర వాసి ధర్మాబాద్ కోర్టులో పిటిషన్‌ వేశాడు. దీంతో బాబ్లీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆ కేసును తవ్వితీశారు. గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినా చంద్రబాబు స్పందించకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.

English summary
Dharmabad Court shocks Andhra radesh Chief Minister Nara Chandrababu Naidu, three former MLAs get bail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X